Ads
ఐపీఎల్ 2021 లో ఏప్రిల్ 15 న రాజస్థాన్ రాయల్స్ , ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ చోటు చేసుకుంది. రాజస్థాన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతో మొదట బాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు 20 ఓవర్లలో ఢిల్లీ 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసి ప్రత్యర్థి ఎదుట ఓ మాదిరి విజయలక్ష్యాన్ని ఉంచింది. ఓపెనర్లు పృథ్వీషా (2), శిఖర్ ధవన్ (9), అజింక్య రహానే (8) లు స్టార్టింగ్ లో వెనుదిరిగారు. రిషబ్ ప్యాంటు 32 బంతుల్లో 9 ఫోర్లతో 51 పరుగులు ఈ మాదిరి టార్గెట్ సెట్ చేయగలిగారు. రాజస్థాన్ బౌలర్లలో ఉనద్కత్ మూడు వికెట్లు పడగొట్టాడు.
Video Advertisement
148 పరుగుల ఛేదనలో రాజస్థాన్ జట్టు మొదట్లో చాలా తడపడింది. 42/5 స్కోరుతో పీకల్లోతు కష్టాల్లో పడింది. మిల్లర్ కూడా అవుట్ అవ్వడంతో ఆశలు వదులుకున్నారు. మోరిస్ పై నమ్మకం లేని టీం అతన్ని 8 వ వికెట్ కి పంపించారు. క్రిస్ మోరిస్ (18 బంతుల్లో 4 సిక్సర్లతో 36 నాటౌట్) తన విలువేంటో చూపాడు. మొన్నటి పంజాబ్ తో మ్యాచ్ సంజు అతనికి స్ట్రైక్ ఇవ్వలేదు. కానీ ఈ రోజు అతనే గెలిపించాడు. ఇంకో రెండు కోట్లు ఇచ్చిన తక్కువే అనే రేంజ్ కి వెళ్ళాడు. ఏది ఏమైనా ఈ ఐపీఎల్ లో ట్విస్ట్ లు మాత్రం మాములుగా లేవు.
End of Article