టి20 ప్రపంచకప్ లో మరో పెను సంచలనం నమోదైంది. సూపర్ 12లో భాగంగా గ్రూప్ ‘2’లో జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ పై జింబాబ్వే అద్బుత విజయాన్ని సాధించింది. చివరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠతో సాగిన మ్యాచ్ లో ప్రాణం పెట్టిన ఆడిన జింబాబ్వే పరుగు తేడాతో విజయం సాధించింది. ఆడిన రెండు మ్యాచ్ ల్లోనూ ఓడిన పాకిస్తాన్ సెమీస్ రేసు నుంచి దాదాపుగా తప్పుకున్నట్లే. 131 పరుగుల స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన పాకిస్తాన్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 129 పరుగులు మాత్రమే చేసింది. ఈ మ్యాచ్ లో విజయం సాధించిన జింబాబ్వే 3 పాయింట్లతో గ్రూప్ ‘2’ పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరుకుంది
Video Advertisement
ఈ విజయంలో జింబాబ్వే స్పిన్నర్ సికిందర్ రజా కీలక పాత్ర పోషించాడు. 4 ఓవర్లలో 25 పరుగులిచ్చిన రజా.. మూడు కీలక వికెట్లు తీశాడు. సరైన టైంలో మసూద్ వికెట్ తీసి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. జట్టు స్కోరు 96 పరుగుల వద్ద మసూద్ ఔటయ్యాక జింబాబ్వే బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి పాకిస్థాన్‌ను ఒత్తిడిలోకి నెట్టారు.
ఆరంభంలోనే బాబర్, రిజ్వాన్ వికెట్లను కోల్పోయిన పాకిస్థాన్.. కాసేపటికే ఇఫ్తికార్ వికెట్‌ను కోల్పోయి 36/3తో కష్టాల్లో పడింది. షాదాబ్ ఖాన్ (17), మసూద్ కలిసి మెల్లగా స్కోరు బోర్డును ముందుకు నడిపారు. పాక్ స్కోరు 88 పరుగులకు చేరిన దశలో సికిందర్ రజా చెలరేగాడు. వరుస బంతుల్లో (13.4, 13.5 ఓవర్లలో) షాదాబ్, హైదర్ అలీని పెవిలియన్ చేర్చాడు. ఒక్క బంతి తేడాతో హ్యాట్రిక్ మిస్సయిన రజా 15వ ఓవర్ తొలి బంతికి మసూద్‌ను పెవిలియన్ చేర్చాడు. రజా లెగ్ సైడ్ వైడ్ వేయగా.. ముందుకొచ్చి షాట్ ఆడబోయిన మసూద్‌ను చకబవా స్టంపౌట్ చేశాడు. దీంతో మ్యాచ్ మలుపు తిరిగింది. అప్పటికి పాక్ విజయానికి 29 బంతుల్లో 37 పరుగులు అవసరం అయ్యాయి.
ఈ మ్యాచ్ 15వ ఓవర్ వరకూ పాకిస్థాన్ చేతుల్లోనే ఉంది. కానీ వైడ్ బాల్‌ను ఆడబోయిన షాన్ మసూద్ స్టంపౌట్ కావడంతో మ్యాచ్ కీలక మలుపు తిరిగింది.
చివరి 2 ఓవర్లలో పాక్ విజయానికి 22 రన్స్ అవసరం కాగా.. మహ్మద్ నవాజ్ సిక్స్ బాదడంతో ఆఖరి ఓవర్లో 11 పరుగులు అవసరమయ్యాయి. తొలి రెండు బంతుల్లో 7 పరుగులు రాగా.. మూడో బంతిని ఇవాన్స్ డాట్ బాల్‌గా వేశాడు. దీంతో ఐదో బంతిని మిడాఫ్ దిశగా ఫోర్ బాదబోయిన నవాజ్ ఫీల్డర్ చేతికి చిక్కాడు. దీంతో మ్యాచ్ పూర్తిగా జింబాబ్వే వశమైంది. కీలక సమయంల మసూద్ ఔట్ కావడం.. చివరి ఓవర్లో నవాజ్ పెవిలియన్ చేరడం మ్యాచ్‌ను మలుపు తిప్పింది.