తెలుగు టెలివిజన్ ఆడియెన్స్ కి నటి జ్యోతి రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఇప్పటి వరకు చాలా సీరియల్స్ లో నటించి ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్నారు. ఎండమావులు నుండి కార్తీక దీపం వరకు ఎన్నో సీరియల్‌లో నటించింది.

Video Advertisement

బుల్లితెర పై పాపులర్ అయిన కార్తీకదీపంలో ఏసీపీ రోషిణి క్యారెక్టర్ లో నటించి అలరించింది. ప్రస్తుతం ఆమె పలు సీరియల్స్‌ తో బిజీగా ఉంది. అయితే 30 ఏళ్లకు పైగా బుల్లితెరపై రాణిస్తున్న జ్యోతి రెడ్డి ఫ్యామిలీ నేపద్యం గురించి చాలామందికి తెలియదు.

ఆమె ఏపీ మాజీ సీఎం భవనం వెంకట్రామిరెడ్డి మనవరాలు. జ్యోతి రెడ్డి 9 ఏళ్లు ఉన్నప్పుడే నటించడం మొదలుపెట్టింది. ఆమె ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుండి వరుస అవకాశాలను పొందుతూ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఆమె  ఇటీవల ఒక ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలోపలు ఇంట్రెస్టింగ్ విషయాలను తెలిపారు.
TV-actress-Jyoti-Reddy4తాను ఏపీ మాజీ సీఎం అయిన భవనం వెంకట్రామిరెడ్డి మనవరాలిని అని చెప్పారు. తనకు ఉద్యోగం చేయడం ఇష్టం అని, ఎంఫిల్‌ వరకు చేశానని తెలిపారు. అతనకు మూడుసార్లు వరుసగా గోల్డ్‌ మెడల్‌ వచ్చిందని,ఆ తరువాత ఉద్యోగం చేయాలనుకున్నానని అన్నారు. అయితే టాప్ దర్శకులు వారి ప్రాజెక్టుల్లో చేయాలని మా ఇంటికి వారి పీఏలను పంపించేవారు. దాంతో మా అమ్మ పెద్దవాళ్లు నటించమని అంటే వద్దంటా అని వారికి ఒకే చెప్పేది. మా అమ్మ వల్లే ఈ రంగంలోకి వచ్చాను. ఇప్పటికీ కూడా నటిస్తూనే ఉన్నానని తెలిపారు.
అప్పట్లో ఆర్టిస్టులు ఎంతో డెడికేటెడ్‌గా ఉండేవారని, మేకప్ వేసుకొని ఉదయం 7.30 లోపే సెట్‌ కి వెళ్ళేవారిమని అన్నారు. ఒక్కోసారి అయితే రాత్రి 12 కూడా అయ్యేదని, ఇంకొన్ని సార్లు అయితే నెక్స్ట్ డే ఉదయం 6 వరకూ కూడా  షూటింగ్ ఉండేదని అన్నారు. క్యారెక్టర్, లైటింగ్, వెదర్ ను బట్టి మేకప్ సామగ్రిని మార్చాల్సి వచ్చేది. కాస్ట్యూమ్స్ ఒకరోజు వాడినవి మళ్లీ వాడకూడదు. అందువల్ల వాటిని ఎప్పుడు కొంటూనే ఉండాలి. మాకు లోన్స్ కూడా రావు. లోన్ కోసం వెళ్ళినపుడు మీకు నెలవారిగా జీతాలు ఉండవు. సీరియల్ నుంచి తొలగిస్తే గ్యారెంటీ ఏమిటి అని అనేవారు.
TV-actress-Jyoti-Reddy3ఇక మీ కెరీర్‌లో బాగా నచ్చిన క్యారెక్టర్ ఏమిటి యానాం ప్రశ్నకి సమాధానంగా నేను చేసిన  సీరియల్స్‌ అన్ని ఇష్టపడి చేశాను. అయితే ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్ లో చేసిన అమ్మావారి గెటప్ చాలా ఇష్టం అని అన్నారు. ఇప్పుడు ‘నేత్ర’ అనే సీరియల్ లో నటిస్తున్నాను. ఈ సీరియల్‌ ఒకేసారి ఐదు భాషల్లో ప్రసారం అవుతుంది. తెలుగులో ఇలా ప్రసారం అవడం ఇదే మొదటిసారి అని అన్నారు.
TV-actress-Jyoti-Reddy3Also Read: “సమంత” స్థానం లో “రష్మిక”..వైరల్ అవుతున్న నిర్మాత కామెంట్స్..!!