విరాట్ కోహ్లీ మైదానం లోకి దిగితే ఏ రేంజ్ లో పరుగులు పెడతాడో ఇండియా మొత్తం చూసింది. నిన్న జరిగిన 4 వ టెస్ట్ మ్యాచ్ లో కూడా విరాట్ ఏకం గా ఇరవై మూడు వేల పరుగులు చేసి సచిన్ రికార్డు ని సైతం బద్దలు కొట్టేసాడు. ఇవి కాక తాజాగా సోషల్ మీడియా లో మరో రికార్డు ను సొంతం చేసుకున్నాడు కోహ్లీ.

virat kohli

శుక్రవారం రోజు విరాట్ కోహ్లీ ఇంస్టాగ్రామ్ అకౌంట్ 150 మిలియన్ల ఫాలోవర్స్ ను సొంతం చేసుకుంది. ఇన్ని మిలియన్ల ఫాలోవర్స్ ను సంపాదించుకున్న మొదటి భారతీయ క్రికెటర్ గా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించారు. ఆటగాళ్ల విషయానికి వస్తే.. రోనాల్డో కు 337 మిలియన్ల పాలోవర్స్‌ ఉన్నారు. రోనాల్డో తరువాత మెస్సీ కు 260 మిలియన్ల ఫాలోవర్స్‌ ఉన్నారు.