అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతున్న “వ్యూహం” వెబ్ సిరీస్ ఎలా ఉందంటే..?

అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతున్న “వ్యూహం” వెబ్ సిరీస్ ఎలా ఉందంటే..?

by kavitha

Ads

ఇటీవల కాలంలో ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ కథలతో తెరకెక్కిన వెబ్ సిరీస్ లు ఎక్కువగా ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ స్ట్రీమింగ్  అవుతున్న విషయం తెలిసిందే. ఈ తరహా స్టోరీలకు ప్రేక్షకుల నుండి ఎక్కువ ఆదరణ లభిస్తోంది. అందువల్ల ఇలాంటి స్టోరీలతో వెబ్ సిరీస్ లు రూపొందుతున్నాయి.

Video Advertisement

తాజాగా ‘వ్యూహం’ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ స్టోరీతో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘అమెజాన్ ప్రైమ్’ లో రిలీజ్ అయ్యింది. ఎనిమిది ఎపిసోడ్స్ గా రూపొందిన ఈ సిరీస్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
తెలుగులో వచ్చిన మరో ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ వ్యూహం. ఈ వెబ్ సిరీస్ ను సుప్రియ యార్లగడ్డ అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మించారు.  ఈ సిరీస్ డిసెంబర్ 14 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. చైతన్య కృష్ణ, సాయి సుశాంత్ రెడ్డి, పావని గంగిరెడ్డి, శశాంక్ సిద్ధంశెట్టి, రవీంద్ర విజయ్ ఈ సిరీస్ లో ముఖ్యమైన పాత్రల్లో నటించారు.ఇక ఈ సిరీస్ కథ విషయానికి వస్తే, ఐపీఎస్ పూర్తిచేసిన అర్జున్ రామచంద్ర (సాయి సుశాంత్ రెడ్డి)  కొత్తగా డిపార్ట్మెంట్ లో చేరుతాడు. అతని తల్లి కూడా ఐపీఎస్ ఆఫీసర్, అర్జున్ 10 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు నక్సలైట్ల చేతిలో మరణిస్తుంది. తల్లి మాటలే అర్జున్ ఐపీఎస్ అయ్యేలా చేస్తాయి. అతనికి మైఖేల్ కి సంబంధించిన హిట్ అండ్ రన్ కేసును అప్పగిస్తారు.
అర్జున్ ఆ కేసును లోతుగా దర్యాప్తు చేస్తుండగా, అది హిట్ అండ్ రన్ కేసు కాదని కావాలని చేసినట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా ఆ కేసుకి తన తల్లి మరణానికి సంబంధం ఉన్నట్టుగా తెలుస్తుంది. దాంతో ఆ రెండు కేసులు ఒకదానితో ఒకటి కనెక్ట్ అయిన చిక్కు ముడిని విప్పుతాడు. ఆ తర్వాత ఏం జరుగుతుంది? ఇతర వ్యక్తులతో ముడిపడి ఉన్న మిస్టరీ కేసును అర్జున్ ఎలా సాల్వ్ చేశాడు అనేది మిగిలిన కథ.

Also Read: PINDAM REVIEW : “శ్రీరామ్” నటించిన ఈ సినిమా ఎలా ఉంది..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!


End of Article

You may also like