Ads
దాదాపు 3 నెలలపాటు సాగిన బిగ్ బాస్ తెలుగు సీజన్-5 ఇటీవల ముగిసింది. 20 మందితో మొదలైన ఈ ప్రోగ్రామ్‌లో సన్నీ విజేతగా నిలిచారు. ఫినాలే ఎపిసోడ్ సందర్భంగా ఎంతో మంది స్టార్స్ అతిథులుగా వచ్చారు.
Video Advertisement
బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్, అలియా భట్ బ్రహ్మాస్త్ర సినిమా ప్రమోషన్ కోసం షోకి వచ్చారు. అలాగే నవీన్ చంద్ర, జగపతి బాబు కూడా వచ్చి హాట్‌స్టార్‌లో రాబోయే వారి వెబ్ సిరీస్ గురించి మాట్లాడారు. డింపుల్ హయాతి, శ్రియా సరన్ స్పెషల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. 3వ రన్నరప్ గా శ్రీ రామ చంద్ర నిలవగా, 2వ రన్నరప్ గా షణ్ముఖ్ జస్వంత్ నిలిచారు.
షో అయిపోయాక, బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ 2 నెలల్లో ప్రారంభమవుతుంది అని చెప్పారు. ఆ సీజన్ ఓటీటీలో ప్రసారం అవుతుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా, ఆ బిగ్ బాస్ కి హోస్ట్ గా ఓంకార్ కానీ ప్రదీప్ కానీ వ్యవహరిస్తారు అని సమాచారం. ఇది బిగ్ బాస్ 5వ సీజన్. అంతకు ముందు నాలుగు సీజన్లు జరిగాయి. మొదటి సీజన్ విజేతగా శివ బాలాజీ, రెండవ సీజన్ విజేతగా కౌశల్, మూడవ సీజన్ విజేతగా రాహుల్ సిప్లిగంజ్, నాలుగవ సీజన్ విజేతగా అభిజిత్ నిలిచారు. వీరిలో కొంత మంది మనకు అప్పుడప్పుడు టీవీలో కనిపిస్తున్నా కూడా, కొంత మంది మాత్రం అంత ఎక్కువగా ఎక్కడా కనిపించడం లేదు. ఇప్పటివరకు జరిగిన బిగ్ బాస్ తెలుగు సీజన్ విజేతగా నిలిచిన కంటెస్టెంట్స్ ఏం చేస్తున్నారో ఇప్పుడు చూద్దాం.
#1 శివ బాలాజీ
బిగ్ బాస్ మొదటి సీజన్ విజేతగా నిలిచిన శివ బాలాజీ, ఆ తర్వాత ఒక సినిమాలో కనిపించారు. అలాగే తర్వాత కొన్ని సినిమాల్లో సహాయ పాత్రల్లో నటించారు. ప్రస్తుతం యూట్యూబ్ లో అప్పుడప్పుడు కనిపిస్తుంటారు.
#2 కౌశల్
బిగ్ బాస్ 2 సీజన్ విజేతగా నిలిచిన కౌశల్ కూడా ఇటీవల యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టారు. అలాగే ఆది సాయి కుమార్ హీరోగా నటిస్తున్న ఒక సినిమాలో విలన్ పాత్ర పోషిస్తున్నారు అని సమాచారం.
#4 రాహుల్ సిప్లిగంజ్
బిగ్ బాస్ విజేతగా నిలిచిన తర్వాత ఇంకా ఎక్కువ పాపులారిటీ సంపాదించుకున్న కంటెస్టెంట్ రాహుల్ సిప్లిగంజ్. బిగ్ బాస్ తర్వాత ఎన్నో సూపర్ హిట్ పాటలు పాడారు రాహుల్. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ లో కూడా నాటు నాటు పాట పాడారు.
#5 అభిజిత్
బిగ్ బాస్ నాలుగవ సీజన్ విజేతగా నిలిచిన అభిజిత్ తర్వాత ఎక్కడా పెద్దగా కనిపించలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటారు. తన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నట్టు, తన ఆరోగ్యం మళ్ళీ మామూలు అయిన తర్వాత సినిమాలపై దృష్టి పెడతాను అన్నట్టు అభిజిత్ ఒక సందర్భంలో చెప్పారు.
ఇదిలా ఉండగా, మూడో సీజన్ విజేతగా నిలిచిన రాహుల్ సిప్లిగంజ్ మాత్రం వరుసగా చాలా సూపర్‌హిట్ పాటలు పాడుతున్నారు. ఒక రకంగా రాహుల్‌కి బిగ్ బాస్ కలిసొచ్చింది అనే చెప్పాలి. షో తర్వాత ఇంకా పాపులర్ అయ్యారు.
End of Article