మ్యాచ్ జరుగుతుండగా.. ఈ న్యూజిలాండ్ క్రికెటర్లు పొదల్లోకి ఎందుకు వెళ్లారు? అసలేం జరిగిందంటే?

మ్యాచ్ జరుగుతుండగా.. ఈ న్యూజిలాండ్ క్రికెటర్లు పొదల్లోకి ఎందుకు వెళ్లారు? అసలేం జరిగిందంటే?

by Anudeep

ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లు జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా.. మ్యాచ్ జరుగుతున్న టైం లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. మ్యాచ్ జరుగుతుండగానే.. మ్యాచ్ మధ్యలో ఆటగాళ్లు పొదల్లోకి వెళ్లాల్సి వచ్చింది. అసలు ఇలా ఎందుకు వెళ్లారో ఇప్పుడు తెలుసుకుందాం.

Video Advertisement

మూడు వన్ డే ల సిరీస్ లో భాగం గానే ప్రస్తుతం ఇంగ్లాండ్, నెదర్లాండ్స్ మధ్య మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ తొలి మ్యాచ్ ఆమ్ స్టీల్ వీన్ లో జరుగుతోంది. అయితే.. తొలి మ్యాచ్ లో ఇంగ్లాండ్ టాస్ ఓడింది.

nedarland players 1

ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. తొలి పరుగుకే ఇంగ్లాండ్ తొలి వికెట్ ను కోల్పోయింది. ఆ తరువాత వచ్చిన డేవిడ్ మలాన్, ఫిలిప్ సాల్ట్ పరుగులు చేసారు. డేవిడ్ మలాన్ సెంచరీ విన్నింగ్స్ కి అందరు ఆశ్చర్యపోయారు. కాగా.. మ్యాచ్ జరుగుతున్న టైం లో మలాన్ కొట్టిన ఓ సిక్స్ అంతర్జాతీయ క్రికెట్ లోనే ఓ ఫన్ డ్రామాకు తెరలేపింది.

nedarland players

మలాన్ సిక్స్ కొట్టిన తరువాత బంతి కనిపించలేదు. ఈ బంతి సరిహద్దుల్లో ఉన్న పొదల్లోకి వెళ్ళిపోయింది. దీనితో.. నెదర్లాండ్స్ ఆటగాళ్లు మ్యాచ్ మధ్యలో బయటకు వెళ్లి.. పొదల్లో బంతి ఎక్కడ ఉందో వెతకడం మొదలుపెట్టారు. కాగా.. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మొత్తానికి మలాన్ కొట్టిన బంతిని వెతకడానికి ఆటగాళ్లు మాత్రం చాలానే కష్టపడాల్సి వచ్చింది. అయితే.. నెటిజన్స్ మాత్రం ఈ వీడియోను చూసి నవ్వుకుంటున్నారు.

Watch Video:


You may also like