ఫైనల్స్ కి ముందు నీరజ్ జావెలిన్ ఎలా మిస్ అయింది..? ఆ పాకిస్తానీ ప్లేయర్ వద్ద ఎందుకుంది..?

ఫైనల్స్ కి ముందు నీరజ్ జావెలిన్ ఎలా మిస్ అయింది..? ఆ పాకిస్తానీ ప్లేయర్ వద్ద ఎందుకుంది..?

by Anudeep

Ads

నీరజ్ చోప్రా ఒలింపిక్స్ లో జావెలిన్ త్రో విభాగం లో స్వర్ణ పతాకాన్ని సాధించారు. భారతీయుల వందేళ్ల నిరీక్షణ కు స్వస్తి పలుకుతూ ఆయన స్వర్ణం సాధించడం తో అందరి ఆనందానికి అవధుల్లేవు. ఇటీవల టైమ్స్ అఫ్ ఇండియా కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో నీరజ్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

Video Advertisement

neeraj 1

ఫైనల్ ప్రారంభం కాబోయే కొద్దీ సేపటికి ముందు అతని జావెలిన్ కనిపించలేదట. మరో వైపు సమయం దగ్గరపడుతోంది.. ఈ జావెలిన్ ఎంత సేపు వెతికినా ఎక్కడా కనిపించలేదట. ఎలా మిస్ అయిందో అర్ధం కాలేదు. ఉన్నట్లుండి పాకిస్థాన్ కి చెందిన ఆటగాడు నదీమ్ అర్షద్ చేతిలో జావెలిన్ కనిపించడం తో ఊపిరి పీల్చుకున్నారట. అతడు ఆ జావెలిన్ తో అటూ..ఇటూ తిరుగుతూ కనిపించాడట.

neeraj 2

వెంటనే నీరజ్ అతని వద్దకు వెళ్లి.. “భాయ్.. ఈ జావెలిన్ నాది.. ఇటివ్వు.. ఫైనల్లో నేను దాన్నే విసరాలి” అంటూ కోరాడట. అర్షద్ కూడా వెంటనే ఆ జావెలిన్ ను నీరజ్ కు ఇచ్చేసాడు. ఈ గందరగోళం వల్లనే అర్షద్ తన తొలి త్రో లో హడావిడి గా జావెలిన్ ను విసరాల్సి వచ్చిందట. ఇంకా నీరజ్ మాట్లాడుతూ.. ఆరవ స్థానం లో నిలబడడం కోసం నదీమ్ అర్షద్ కూడా ఎంతగానో కష్టపడ్డాడని.. గతం నుంచి మా ఇద్దరి మధ్య మంచి బంధం ఉందని చెప్పుకొచ్చాడు.

neeraj 3

మొత్తానికి అంత టెన్షన్ పడినా.. మన నీరజ్ చోప్రా స్వర్ణ పతకాన్ని సాధించారు. ఎంతైనా చివరి క్షణం లో ఇలా అవసరమైనవి కనిపించకుండా మిస్ అయితే వచ్చే టెన్షన్ మాములుగా ఉండదు కదా. ఆ టైంకి ఆ జావెలిన్ ను తీసుకోవాలని ఆ అర్షద్ నదీమ్ కి ఎందుకు అనిపించిందో ఎవ్వరం చెప్పలేం. కనీసం అతను కనిపించేలా నుంచున్నాడు కాబట్టి సరిపోయింది.


End of Article

You may also like