టి20 ఫార్మాట్ అంటే బ్యాటర్స్ గేమ్. ఇందులో బౌలర్లు కూడా రెచ్చిపోయి ఆడుతుంటారు. ఇక డెత్ ఓవర్స్ లో బౌలింగ్ చేయాలంటే ఏ బౌలర్ కైనా వణుకు రావాల్సిందే. .విండీస్ స్టార్ ఆల్ రౌండర్ ఆండ్రీ రస్సెల్ మాత్రం 98 మ్యాచ్ ల్లో 177.88 స్ట్రయిక్ రేట్ తో 2,035 పరుగులు చేశాడు. రస్సెల్ క్రీజులో ఉంటే బౌలర్లకు చెమటలు పట్టాల్సిందే.
Video Advertisement
ఆండ్రీ రస్సెల్ ఐపీఎల్‌లో 100 కి పైగా మ్యాచ్ లు ఆడాడు. KKR తరపున అత్యధిక IPL మ్యాచ్‌లు ఆడిన నాల్గవ ఆటగాడు రస్సెల్. 2012 నుంచి ఐపీఎల్‌లో యాక్టివ్‌గా ఉంటున్నాడు. అతను 2014లో కోల్‌కతా నైట్ రైడర్స్‌లో చేరడానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ తరపున రెండు సీజన్లు ఆడాడు. ఆ సమయంలో అతను ఢిల్లీ తరపున 7 మ్యాచ్‌లు ఆడాడు.
కోల్‌కతా తరపున రస్సెల్ ఆల్‌రౌండర్‌గా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. లీగ్‌లో 89 వికెట్లు కూడా తీశాడు. ఆండ్రీ రస్సెల్ తన పవర్ హిట్టింగ్‌కు ప్రసిద్ధి చెందాడు. ఎన్నోసార్లు లోయర్ మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేస్తూ జట్టు కోసం మ్యాచ్‌లను గెలిపించడంలో సిద్ధహస్తుడు. రస్సెల్ ఫామ్‌లో ఉన్నప్పుడు, ప్రపంచంలోని ఏ బౌలర్‌నైనా చిత్తు చేయగల సామర్థ్యం అతనికి ఉంది.
ఐపీఎల్ 2023 సీజన్‌లో మొదటి మూడు మ్యాచుల్లో బౌలింగ్ కూడా చేయని ఆండ్రే రస్సెల్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో బౌలింగ్‌కి వచ్చి మొదటి ఓవర్‌లోనే 2 వికెట్లు తీశాడు. అయితే ఆండ్రీ రసల్ ఆట తీరు మాత్రం పూర్తిగా గాడి తప్పింది. ఎందుకంటే ఎప్పుడు బ్యాటింగ్ చేసిన కూడా విధ్వంసకరమైన ఆట తీరుతో ప్రత్యర్ధులను భయపెడుతూ ఉండేవాడు రసెల్. కానీ ఈ ఏడాది మాత్రం అతను పూర్తిగా వరుస వైఫల్యాలతో ఇబ్బంది పడుతున్నాడు.
ఇప్పటి వరకు ఏడు మ్యాచ్లు ఆడిన ఆండ్రూ రస్సెల్ ఒక్క మ్యాచ్ లోను భారీ ఇన్నింగ్స్ ఆడ లేకపోయాడు. ఎంతో డేంజరస్ ప్లేయర్ రస్సెల్ కాస్త ఇక ఇప్పుడు టీం కి భారంగా మారిపోయాడు అని చెప్పాలి. అయితే కోల్కతా గెలిచిన రెండు మ్యాచ్లలో కూడా రస్సెల్ భాగస్వామ్యం శూన్యం. ఈ సీజన్ ఆరంభానికి ముందు 190 స్ట్రైక్ రేట్ గా ఉంటే ఇప్పుడు 175కు పడిపోయింది. ఏడు మ్యాచుల్లో మొత్తం కలిపి 107 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో అతడి పై కెప్టెన్ నితీష్ రానా కి నమ్మకం సన్నగిల్లుతోందని తెలుస్తోంది.