Ads
జాస్ బట్లర్.. ఈ ఇంగ్లండ్ టీం కెప్టెన్ టీ20 వరల్డ్ కప్ ఇంగ్లాండ్ జట్టు గెలవడంలో కాలాక పాత్ర పోషించాడు. మంచి ఓపెనర్ గా పేరొందిన బట్లర్ ఇంగ్లాండ్ టీం లో వికెట్ కీపింగ్ బాధ్యతలు కూడా నిర్వహిస్తాడు. ఇక టీ20 స్పెషలిస్ట్ గా పేరొందిన ఈ ఇంగ్లండ్ ఆటగాడు గత ఐపీయల్ లో సూపర్ ఫామ్ తో ఆడాడు. సీజన్ ఆరంభం నుంచి అదరగొడుతూనే ఉన్న అతడు లీగ్ లో 800 పరుగులను పూర్తి చేసుకున్నాడు.
Video Advertisement
రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఆడుతున్న బట్లర్ ఈ సీజన్ లో మాత్రం పేలవ ప్రదర్శన చేస్తున్నాడు. రాజస్థాన్ జట్టులో బట్లర్ అత్యంత కీలకమైన ఆటగాడు. ఓపెనరుగా వచ్చి ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడే ఈ డాషింగ్ ఓపెనర్. బట్లర్ క్రీజులో ఉన్నాడంటే చాలు వీరబాదుడు బాదుతాడు.. ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తాడు. కానీ ఈ సీజన్ లో కొత్త బట్లర్ కనిపిస్తున్నాడు.
అయితే చెలరేగి ఆడడం.. లేకపోతే తుస్సుమన్నడం అన్నట్లు ఉంది బట్లర్ ఆట. గతంలో మాత్రం మ్యాచ్ పరిస్థితికి తగ్గట్టుగా తన శైలిని మార్చుకొని జట్టును ఆదుకునేవాడు. కానీ.. ఈ సీజన్ లో అనుకున్నంతగా రాణించలేదు. తాజా పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో జాస్ బట్లర్ (0) మరోసారి డకౌట్ అయ్యాడు. ఈ సీజన్ లో జోస్ బట్లర్ కి ఇది ఐదో డకౌట్.
దీంతో.. ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. 2020లో ధావన్, 2009లో గిబ్స్ ఓపెనర్లగా ఐపీఎల్ లో నాలుగు సార్లు డకౌట్ అవ్వగా.. పంజాబ్ తో మ్యాచ్ కు ముందు నాలుగు డకౌట్లతో వీరి సరసన ఉన్న బట్లర్.. ఈ మ్యాచ్ లో కూడా డకౌట్ కావడంతో తన పేరుతో సరికొత్త రికార్డును నమోదు చేసుకున్నాడు.
ఈ సీజన్ లో 14 మ్యాచ్ లు ఆడిన బట్లర్ 28 యావరేజ్ తో 392 పరుగులు చేశాడు. అందులో 4 హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. ఇలా ఓకే సీజన్ లో నాలుగు హాఫ్ సెంచరీలు.. ఐదు డకౌట్లు ఉండడంపై ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. గత సీజన్ లో ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్న బట్లర్ ఎందుకు ఈ సీజన్ లో ఇలా విఫలం అవుతున్నాడు అంటూ చర్చించుకుంటున్నారు ఫాన్స్.
End of Article