విమానంలో డెలివరీ అయితే.. పుట్టిన బిడ్డకి ఏ దేశ పౌరసత్వం లభిస్తుందో తెలుసా..? చట్టం ఎలా ఉందంటే..?

విమానంలో డెలివరీ అయితే.. పుట్టిన బిడ్డకి ఏ దేశ పౌరసత్వం లభిస్తుందో తెలుసా..? చట్టం ఎలా ఉందంటే..?

by Anudeep

Ads

పౌరసత్వం అంటే.. మనం ఏ దేశంలో నివసించాలి అనే విషయాన్నీ తెలియచెబుతుంది. సాధారణంగా మనం ఏ దేశంలో పుడతామో.. మనకు ఆ దేశ పౌరసత్వమే లభిస్తుంది. ఇది ఒక ప్రాధమిక హక్కు. మనం ఏ దేశంలో పుడతామో.. ఆ దేశంలో శాశ్వతంగా నివసించే హక్కు లభిస్తుంది.

Video Advertisement

మనకి భారత పౌరసత్వం ఉంటె భారతీయులమని, అమెరికా పౌరసత్వం ఉంటె అమెరికన్స్ అని అంటుంటారు. ఇందుకు సంబంధించి కొన్ని విధి విధానాలు.. నియమ నిబంధనలు ఉన్నాయి.

aeroplane delivery

స్పష్టంగా చెప్పాలంటే.. ఏ దేశ గడ్డపై జన్మిస్తామో అదే దేశ పౌరసత్వం మనకి లభిస్తుంది. ఒకవేళ భూమిపై కాకుండా.. ఆకాశంలో జన్మిస్తే అంటే.. విమానాల్లో డెలివరీ అయితే.. అప్పుడు పుట్టిన బిడ్డకి ఏ దేశ పౌరసత్వం లభిస్తుంది..? మీకెప్పుడైనా ఈ సందేహం వచ్చిందా..? అయితే ఈ ఆర్టికల్ చదివి మీ సందేహం తీర్చుకోండి. ఇలా విమానంలో వెళ్తున్నపుడు ఏ దేశ గగనతలంలో డెలివరీ అవుతుందో.. ఆ దేశ పౌరసత్వమే పుట్టిన బిడ్డకి లభిస్తుందట.

aeroplane delivery 1

పౌరసత్వం కోసం ఆ బిడ్డ తల్లితండ్రులు సదరు దేశానికి అప్లికేషన్ కూడా పెట్టుకోవచ్చట. అయితే..ఆ దేశ ప్రభుత్వం కూడా రూల్స్ ప్రకారం పౌరసత్వాన్ని ఇవ్వాల్సి ఉంటుందట. అయితే ఆ తల్లి తండ్రులు ఏ దేశానికి చెందిన వారు అనే సంగతి అవసరం లేదు. ఈ విషయమై చాలా దేశాలు విదేశీ పాలసీలను ఇచ్చిపుచ్చుకున్నాయట. ఏ దేశం అయినా సరే.. తమ గగనతలం లో ఎవరైనా జన్మిస్తే.. ఆ బిడ్డ తల్లి తండ్రులు పౌరసత్వం కోసం అప్లై చేసుకుంటే.. నిబంధనలను అనుసరించి ఆ దేశ ప్రభుత్వం కచ్చితంగా పౌరసత్వాన్ని ఇవ్వాల్సిందేనట.

aeroplane delivery 2

కొన్నేళ్ల క్రితం అమెరికాలో ఇలాంటి కేసు ఒకటి వచ్చింది. ఆమ్‌స్టర్‌డామ్‌ నుంచి ఓ విమానం అమెరికాకు వెళ్లింది. విమానం అట్లాంటిక్ సముద్రానికి చేరుకోగానే ఓ మహిళకు ప్రసవ నొప్పులు రావడంతో ఆరోగ్యవంతమైన ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే, తల్లి మరియు బిడ్డను యుఎస్‌లోని మసాచుసెట్స్ జనరల్ ఆసుపత్రికి తరలించారు. అమ్మాయి US సరిహద్దులో జన్మించింది, కాబట్టి ఆమె US మరియు నెదర్లాండ్ రెండింటి పౌరసత్వాన్ని పొందింది.


End of Article

You may also like