టీ 20 కోసం భారత జట్టును సిద్ధం చేయడం లో కెప్టెన్ రోహిత్ చాలా మార్పులు చేస్తున్నారు. మరో వైపు టీం ఇండియాలో దినేష్ కార్తిక్ పాత్ర ఏంటనే దానిపై తాజాగా చర్చలు జరుగుతున్నాయి.
Video Advertisement
ఐపీఎల్ లో ఫినిషర్ గా మెరిసిన ఈ వెటరన్ క్రికెటర్ ని ఫినిషర్ గా మార్చి జట్టులో చోటు కల్పించారు. తర్వాత జరిగిన మ్యాచ్ లలో అతడు ఫినిషర్ గా మెరుపులు మెరిపించాడు. ధోని తర్వాత మరో ఫినిషర్ భారత్ కు దొరికాడు అనుకొనే లోపే అతడి పాత్ర ప్రశ్నార్థకం గా మారింది.
ఐపీఎల్ తర్వాత జరిగిన అన్ని మ్యాచ్ లలో దినేష్ ను ఎంపిక చేస్తూ వచ్చారు కానీ, తుది జట్టులో ఆడే అవకాశాలు చాలా తక్కువగా వచ్చేవి. ఒకవేళ జట్టులో చోటు దక్కినా ఏడో స్థానం లో బ్యాటింగ్ కు వచ్చేవాడు. ఇలా అయితే దినేష్ కార్తిక్ ఫినిషర్ పాత్రకు ఎలా న్యాయం చేస్తాడని అందరూ చర్చించుకుంటున్నారు.
తాజాగా ఆసీస్ మాజీ ఓపెనర్ మాథ్యూ హేడెన్ టీమ్ ఇండియాలో కార్తీక్ పాత్రను ప్రశ్నించాడు, అతనికి బ్యాటింగ్ చేయడానికి మరిన్ని అవకాశాలు ఇవ్వాలని మేనేజ్‌మెంట్‌ను కోరాడు.
“నేను భారత జట్టులో దినేష్ పాత్ర గురించి ఆలోచిస్తున్నాను. దినేష్ ఇప్పుడు పోషిస్తున్న ఈ పాత్ర ఫినిషర్. కానీ అతడికి ఆ అవకాశాలు లభించట్లేదు ” అని మొదటి టీ20లో హేడెన్ అన్నాడు.
“నేను దినేష్ కార్తీక్‌ను అగౌరవపరచటం లేదు .కానీ అతడు మంచి ఆటగాడు. ఒక ఫినిషర్ పాత్రకు న్యాయం చేయగలడు. కానీ అతడికి ఆ అవకాశాలు ఇవ్వట్లేదు. అతడు ఏ స్థానం లో వస్తే ఫినిషర్ గా మెరిపించగలడో అది అతనికి ఇవ్వాలి. అల్ రౌండర్ తర్వాత ఫినిషర్ ని బ్యాటింగ్ కి పంపడం వల్ల ఉపయోగం ఉండదు. ఇలా చేస్తే రోహిత్ స్ట్రాటజీ వర్క్ అవుట్ అవ్వదు.” అని హేడెన్ అన్నారు.
సిరీస్‌లోని మొదటి మ్యాచ్‌లో టీమ్ ఇండియా నాలుగు వికెట్ల తేడాతో ఓటమిని చవిచూసింది మరియు ఇప్పుడు శుక్రవారం నాగ్‌పూర్‌లో డిఫెండింగ్ T20 ప్రపంచ కప్ చాంప్‌లతో డూ-ఆర్ డై మ్యాచ్‌ను ఎదుర్కొంటుంది.