Ads
కొన్ని రోజుల నుండి టెస్టు క్రికెట్‌లో ‘బజ్‌బాల్’ అనే మాట ఎక్కువగా వినిపిస్తుంది. ఇక ఇంగ్లండ్ జట్టు ఆడే టెస్టు మ్యాచ్‌ల్లో మరీ ఎక్కువగా బజ్‌బాల్ వినిపిస్తోంది. తాజాగా యాషెస్ సిరీస్ లో మొదటి టెస్టు పూర్తి అయినప్పటి నుండి బజ్ బాల్ పై మరింతగా చర్చలు జరుగుతున్నాయి.
Video Advertisement
బజ్‌బాల్ అంటూ దూకుడైన ఆటతో తమకు ఎదురులేదనుకున్న ఇంగ్లండ్ జట్టును ఆసీస్ ఓడించింది. దాంతో ఇంగ్లండ్ జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో ఓవర్ కాన్ఫిడెన్స్‌తో ఇన్నింగ్స్ డిక్లేర్ చేసి ఓటమి పాలైందా అని చర్చలు జరుగుతున్నాయి. ఇంతకీ ఈ ‘బజ్‌బాల్’ అంటే ఏమిటి? ఆ పేరు ఎలా వచ్చిందో ఇప్పుడు చూద్దాం.. ఇంగ్లండ్ సంవత్సర కాలంగా జట్టు బజ్‌బాల్ క్రికెట్‌తో మంచి ఫలితాలను సాధించింది. ఇంగ్లండ్ జట్టు బెన్‌స్టోక్స్ సారధ్యంలో కొత్తగా కనిపించింది. ఈ జట్టు బజ్‌బాల్ తో సౌతాఫ్రికా, పాకిస్తాన్, న్యూజిలాండ్‌లను ఓడించి సిరీస్‌ను గెలుచుకుంది. ప్రస్తుతం జరుగుతున్నది సిరీస్ ప్రతిష్టాత్మక యాషెస్, రీసెంట్ గా ప్రపంచ టెస్టు చాంపియన్ అయిన ఆస్ట్రేలియాను బజ్‌బాల్ టెక్నిక్ తో ఎదుర్కొని మొదటి మ్యాచ్ లో ఇంగ్లండ్ గెలవలేకపోయింది.
‘బజ్‌బాల్’ అంటే..
మ్యాచ్ కండిషన్ తో సంబంధం లేకుండా, పిచ్ ఎలా ఉన్నది పట్టించుకోకుండా ఫస్ట్ బాల్ నుండి వేగంగా ఆడటానికి ప్రయత్నించడాన్నే ‘బజ్‌బాలింగ్’ అంటారు. అయితే బజ్‌బాల్ అనేది ఆట మాత్రమే కాకుండా మైండ్ సెట్ కూడా. బ్యాటింగ్, ఫీల్డింగ్ దేనిలో అయినా అటాకింగ్ మరియు డిఫెన్స్ లో పాజిటివ్ డిసిషన్స్ మాత్రమే తీసుకునే మైండ్ సెట్ ‘బజ్‌బాల్’. ఇంకా చెప్పాలంటే పరిమిత ఓవర్ల క్రికెట్ వన్డే, టీ20 లో ఇన్‌స్టంట్ ఫలితం ఇచ్చే వ్యూహాలను టెస్టు క్రికెట్‌లో అమలు చేయడం ‘బజ్‌బాల్’ స్టైల్.
పేరు ఎలా వచ్చిందంటే..
ఇంగ్లండ్ క్రికెట్ జట్టుకు ప్రస్తుత కోచ్ బ్రెండన్ మెకల్లమ్ నిక్ నేమ్ ‘బజ్’. బ్రెండన్ మెకల్లమ్ మొదటి నుండి వేగంగా ఆడటానికి ఇంపార్టెన్స్ ఇచ్చే వాడు. ఇంగ్లండ్‌కు కోచ్‌గా వచ్చిన మెకల్లమ్, ఇంగ్లండ్ సారధి బెన్ స్టోక్స్, క్రికెట్ మేనేజింగ్ డైరెక్టర్ అయిన రాబ్ కీ కలిసి బజ్‌బాల్ మైండ్‌సెట్‌ను ఇంగ్లండ్ జట్టుకు పరిచయం చేశారు. ఇక ఈ ఆలోచన కోచ్ బ్రెండన్ మెకల్లమ్‌ది అందువల్ల ఈ విధానానికి ‘బజ్‌బాల్’ పేరు వచ్చిందనుకోవచ్చు. అయితే పాపులర్ క్రికెట్ పోర్టల్ జర్నలిస్టు తొలిసారిగా ఈ పేరును వాడాడు. ఆ తర్వాత ఇది అలాగే పాపులర్ అయ్యిందని తెలుస్తోంది.
Also Read: కెప్టెన్ కూల్ “ధోని” ఇరుక్కున్న 5 కాంట్రవర్సిలు ఏంటో తెలుసా.? 5 వ ది చాలామందికి తెలియకపోవచ్చు.!
End of Article