మనం మరణించిన తరువాత ఆత్మ ఏమవుతుంది..? సైన్స్ ఏమి చెబుతోందో తెలుసా..?

మనం మరణించిన తరువాత ఆత్మ ఏమవుతుంది..? సైన్స్ ఏమి చెబుతోందో తెలుసా..?

by Anudeep

Ads

పుట్టిన వాడు మరణించక తప్పదు. ఇది అనివార్యమైన విషయమే. అయితే, ఆసక్తి కలిగించే అంశం ఏమిటంటే.. మనం మరణించిన తరువాత మన శరీరం లోని ఆత్మ ఏమవుతుంది.? పురాణాల ప్రకారం స్వర్గ నరకాలలో దేనికి చేరాలో మన పాప పుణ్యాలు చెబుతాయని పేర్కొన్నారు. సైన్స్ ఈ విషయమై ఏ వివరణ ఇస్తోందో మనం ఇప్పుడు చూద్దాం..

Video Advertisement

after death 1

మరణించిన తరువాత ఏమి జరుగుతుంది అని మనం ఎప్పుడైనా ఆలోచిస్తూ ఉంటాం కదా..? మనకి రెండే ఆప్షన్స్ ఉంటాయి. ఏదైనా జరగొచ్చు అని మనం భావిస్తాం. లేదంటే అలాంటిదేమి ఉండదు అని కొట్టి పడేస్తాం. ఈ విషయమై డాక్టర్ స్టువర్ట్ హామెరాఫ్ ఏమి చెప్పారంటే.. ఓ వ్యక్తి మరణించిన తరువాత కూడా అతని ఆత్మ స్పృహ లో ఉంటుందని తెలిపారు. మనసు వేరు పడ్డ తరువాత, అది స్పృహ లోనే ఉండి పరిసరాలను గమనిస్తూ ఓ అవగాహన కు వస్తుంది. అయితే ఈ విషయాన్నీ మనం ఎలా గుర్తించవచ్చు అంటే దానికి కొంత సాంకేతిక పరిజ్ఞానం అవసరం అవుతుంది. ఇందుకు కావలసిన సాంకేతిక పరిజ్ఞానాన్ని మనకు క్వాంటం మెకానిక్స్ అందిస్తుంది.

life after death 2

పవర్ ఆఫ్ పాజిటివిటీ కధనం ప్రకారం.. డాక్టర్ హామెరాఫ్ అరిజోనా విశ్వవిద్యాలయంలోని కాన్షియస్నెస్ స్టడీస్ (వ్యక్తి యొక్క స్పృహ పై అధ్యయనం) సెంటర్‌ను పర్యవేక్షిస్తున్నారు. ఆయన గత యాభై ఏళ్ళు గా ఈ అంశం పై తన పరిశోధనలు చేస్తున్నారు. ఆయన క్వాంటం మెకానిక్స్ రంగం లో అత్యున్నత స్థితి కి చేరుకున్నారు. క్వాంటం మెకానిక్స్ ద్వారానే ఆయన ఈ విషయమై పరిశోధిస్తున్నారు. క్వాంటం మెకానిక్స్ అనేది భౌతిక శాస్త్రంలో ఒక ప్రాథమిక సిద్ధాంతం, ఇది అణువుల మరియు సబ్‌టామిక్ కణాల శక్తి స్థాయిల యొక్క చిన్న ప్రమాణాల వద్ద ప్రకృతిని వివరిస్తుంది.

life after death 4

ఒక పరిస్థితి కి సంబంధించిన వాస్తవికతను అర్ధం చేసుకోవడానికి క్వాంటం మెకానిక్స్ ఎంతగానో దోహదం చేస్తుంది. ఇందులో భాగం గా చేసే డబుల్ స్లిట్ ప్రయోగం ప్రోటాన్ల నమూనాను పరిశీలించగలిగే వెసులుబాటుని కలిపిస్తుంది. అయితే ఇందుకోసం ప్రోటాన్ల కదలికలను గుర్తించగల డిటెక్టర్ అవసరమవుతుంది. అయితే, ఈ ప్రయోగం లో చాలా మంది భౌతిక శాస్త్ర వేత్తలకు అడ్డంకులు ఎదురయ్యాయి. ఇది సృష్టి కి విరుద్ధమైన చర్య. ఈ ప్రయోగాన్ని పరిశీలిస్తే, కాంతి కణాలుగా పిలవబడే ఫోటాన్లు రెండు చీలికలు (స్లిట్స్) గుండా వెళతాయట. ఇవి గోడ పై ఒక క్రమబద్ధమైన నమూనా ను ఏర్పరుస్తాయి.

life after death 3

ఈ ప్రోటాన్లు ఏ చీలిక గుండా వెళుతున్నాయో గుర్తించడానికి ఒక పరిశీలనా పరికరం (డిటెక్టర్) ఏర్పాటు చేస్తే ఏ విధమైన నమూనా కనిపించదు. ఎప్పుడైతే, సాంకేతిక పరికరాలను ఏర్పాటు చేస్తామో.. అప్పుడు ఈ నమూనా మారిపోతూ ఉంటుంది. మన మెదడు లోని న్యూరో ట్రాన్స్ మీటర్లు కూడా ఇలానే పని చేస్తాయి. అవి శరీరం లోని అన్ని అవయవాలకు మెదడు ఇచ్చే ఆదేశాలను మోసుకెళ్తాయి. అయితే, శాస్త్రజ్ఞులకు కూడా ఈ విషయం లో రెండు అభిప్రాయాలున్నాయి. స్పృహ అనేది మెదడు నుంచే ఉద్భవిస్తుందా..? లేక లేదా ఆధ్యాత్మిక విధానాలు చెబుతున్నట్లు గా ఉంటుందా..? అని.

life after death

హామెరాఫ్ తో పాటు మరో సైంటిస్ట్ పెన్రోస్ ఏమని పేర్కొన్నారంటే, … మా సిద్ధాంతం ఈ రెండు అభిప్రాయాలకు అనుగుణంగా ఉంటుంది, మైక్రోటూబ్యూల్స్‌లోని క్వాంటం వైబ్రేషన్స్, మెదడు న్యూరాన్‌లలోని ప్రోటీన్ పాలిమర్‌ల నుండి స్పృహ ఉద్భవించిందని, ఇవి న్యూరానల్ మరియు సినాప్టిక్ పనితీరును నియంత్రిస్తాయి మరియు మెదడు ప్రక్రియలను చక్కటి స్థాయిలో స్వీయ-ఆర్గనైజింగ్ ప్రక్రియలకు అనుసంధానిస్తాయి” అని పేర్కొంటున్నారు. దాదాపు ఇరవై సంవత్సరాల క్రితమే వీరు తమ పరిశోధనలను ప్రచురించారు. దీనిని బట్టి, మనం మరణం తరువాత కూడా ఈ స్పృహ కొనసాగుతుందని అర్ధం చేసుకోవచ్చు.


End of Article

You may also like