Home Sports Adda T20 ప్రపంచ కప్ లో… ఇండియా టీమ్ తో ఆస్ట్రేలియాకి వెళ్లిన ఈ “ఏకైక మహిళ” ఎవరో తెలుసా?

T20 ప్రపంచ కప్ లో… ఇండియా టీమ్ తో ఆస్ట్రేలియాకి వెళ్లిన ఈ “ఏకైక మహిళ” ఎవరో తెలుసా?

by Anudeep

టీ20 ప్రపంచకప్ కోసం భారత జట్టు ఇప్పటికే ఆస్ట్రేలియాకు చేరుకుంది. 14 మంది సభ్యులతో భారత్ ఆస్ట్రేలియాకు చేరుకుంది. బయలుదేరే ముందు భారత జట్టు.. కోచింగ్ స్టాఫ్, ఇతర సహాయక సిబ్బందితో గ్రూప్ ఫోటో దిగింది. ఇక ఆ ఫోటోలో ఒక వైపు టీమిండియా ప్లేయర్లు ఉంటే.. మరో సైడ్ కోచింగ్ స్టాఫ్ తో పాటు ఇతర సిబ్బంది ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే భారత టీం కంటే కూడా స్టాఫ్ టీమే పెద్దదిగా కనిపించింది. మొత్తం 16 మంది టీమిండియాకు సహయక సిబ్బందిగా ఉన్నారు.

అయితే టీం స్టాఫ్ సిబ్బందిలో ఒక మహిళ కూడా కనిపించింది. దాంతో ఆమె ఎవరు? టీమిండియాలో ఆమె రోల్ ఏంటో తెలుసుకునేందుకు అభిమానులు ఆసక్తి ప్రదర్శిస్తున్నారు.

who is that lady staff in team india.
ఆమె పేరు రాజలక్షి అరోరా. ఆమె టీమిండియా పురుషుల జట్టుకు సంబంధించిన మీడియా విషయాలను చూసుకుంటుంది. 2015 లో రాజలక్ష్మి బీసీసీఐ లో సోషల్ మీడియా మేనేజర్ గా చేరారు. ప్రస్తుతం ఆమె బీసీసీఐ మీడియా, కమ్యునికేషన్ టీంకు హెడ్ గా ఉన్నారు.

who is that lady staff in team india.
రాజలక్ష్మి భారత జట్టుకు, ఫాన్స్ కు అనుసంధానం గా పనిచేస్తున్నారు. అంటే ఎప్పటికప్పుడు టీమిండియా ప్లేయర్లకు సంబంధించిన వీడియోలను, ఫోటోలను సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులకు చేరవేస్తుంది. ప్లేయర్లకు సంబంధించిన ప్రాక్టీస్ సెషన్స్ కు సంబంధించిన వీడియోలను, ఫోటోలను బీసీసీఐ ట్విట్టర్ ఖాతాలో ఎప్పటికప్పుడు పోస్ట్ చేయడంలో ఈమెదే కీలక పాత్ర.

who is that lady staff in team india.
బీసీసీఐకి ట్విట్టర్ లో మొత్తం మూడు అధికారిక ఖాతాలు ఉన్నాయి. ఒకటి బీసీసీఐ, రెండోది బీసీసీఐ ఉమెన్, మూడోది బీసీసీఐ డొమెస్టిక్. ఈ మూడు ఖాతాలను అరోరానే నిర్వహిస్తుంటుంది.

who is that lady staff in team india.

అంతేకాకుండా 2019లో ఈమెను బీసీసీఐ అంతర్గత ఫిర్యాదుల కమిటీకి హెడ్ గా నియమించారు. ఇందులో మొత్తం నలుగురు సభ్యులు ఉంటారు. ఆటగాళ్ల దురుసు ప్రవర్తన, లైంగిక వేధింపులు వంటి వాటిని ఈ కమిటీ విచారిస్తుంది. ప్లేయర్లు మైదానంలో లేదా బయట దురుసుగా ప్రవర్తించినా.. లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్న అరోరా అధ్యక్షతన ఉన్న కమిటీ విచారణ చేస్తుంది.

You may also like