ప్రపంచ క్రికెట్ లో మహేంద్రసింగ్ ధోనిది ప్రత్యేక స్థానం. కెప్టెన్ గా, వికెట్ కీపర్ గా ఎన్నో రికార్డులను ధోని సృష్టించాడు. ధోని మ్యాచ్ పరిస్థితులకు అనుగుణంగా ఫీల్డింగుల్లో మార్పులు చేస్తూ.. విజయం సాధించేదిగా ప్రణాళికలు అనుసరిస్తూ ఉంటాడు. బౌలర్ సామర్థ్యానికి అనుగుణంగా ఫీల్డింగ్ సెటప్ చేయడంలో ధోనిది ప్రత్యేక స్థానం.

Video Advertisement

 

 

అయితే ఒక్క ప్లేయర్ మాత్రం ధోని చెప్పిన మాట వినడట. కెప్టెన్ బౌలర్ చెప్పిన మాటకు కూడా కాస్త రెస్పెక్ట్ ఇస్తాడు. ఈ క్రమంలో ఫీల్డర్, కెప్టెన్ కలిసి ఫీల్డింగ్ లో మార్పులు చేస్తూ ఉంటారు. కానీ ధోని ఒక్కసారి ఫీల్డింగ్ సెట్ చేసాడంటే బౌలర్లు ఏ మాత్రం మాట్లాకుండా దానికి తగ్గట్లుగా బౌలింగ్ చేస్తారు. కానీ డ్వెయిన్ బ్రావో మాత్రం ధోని ఫీల్డింగ్ ని మార్చేసేవాడట.

who is the one bowler not listening to dhoni's commands..!!

చెన్నై సూపర్ కింగ్స్ కు ఆడినఈ సీనియర్ బౌలర్ మాత్రం.. ధోని ఫీల్డింగ్ సెట్టింగ్ పూర్తిగా మార్చేస్తాడట. ఒక మ్యాచులో దీపక్ చాహర్ ఫీల్డింగ్ మార్చాల్సిందిగా కోరితే ధోని బౌలర్ ని మార్చేస్తా అని చెప్పాడు. ఈ విషయం అప్పట్లో తెగ వైరల్ అయింది. దీపక్ చాహర్ పిల్లాడు. ధోనికి చాలా అంతర్జాతీయ అనుభవం ఉందని మహీకే అందరూ సపోర్ట్ చేశారు. కానీ తాజాగా ధోని చెప్పిన ఈ మాటలు విని అందరూ ఆశ్చర్యపోతున్నారు.

who is the one bowler not listening to dhoni's commands..!!

అంతర్జాతీయ, ఐపీఎల్ మ్యాచుల్లో ధోనికి అపార అనుభవం ఉంది. అలాగే బ్రావో కూడా ఐపీఎల్ లో అత్యధిక వికెట్లు తీసాడు. ఐపీఎల్ లో 183 వికెట్లు తీసిన బ్రావో ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ కు బౌలింగ్ కోచ్ గా వ్యవహరిస్తున్నాడు.

who is the one bowler not listening to dhoni's commands..!!

బ్రావో గురించి ధోని మాట్లాడుతూ..” ఐపీఎల్ లో బ్రావో నేను సెట్ చేసిన ఫీల్డింగ్ అంతా మార్చేస్తాడు. ఈ విషయంలో అతన్ని నేను ఏమి అనలేను. ఎందుకంటే బ్రావోకి నాకంటే ఎక్కువగా టీ 20 అనుభవం ఉంది. దీంతో అతను చెప్పినట్లుగానే ఫీల్డింగ్ సెట్ చేస్తాను”. అంటూ కామెంట్ చేసాడు.