స్టార్ హీరోయిన్ అవ్వాల్సిన సుజాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎందుకు ఉండిపోయారు..? కారణం ఏంటంటే..?

స్టార్ హీరోయిన్ అవ్వాల్సిన సుజాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎందుకు ఉండిపోయారు..? కారణం ఏంటంటే..?

by Megha Varna

Ads

మొదట్లో హీరోయిన్ గా కొన్ని సినిమాల్లో నటించిన సుజాత తర్వాత పలు కీలక పాత్రలు పోషించారు. చాలా మంది అగ్రతారల తో ఈమె నటించారు. మంచి నటనతో ఇట్టే ఈ నటి ఆకట్టేసుకుంటుంది. ఈమె శ్రీరామదాసు సినిమా లో శబరి పాత్రని ఎంతో అద్భుతంగా చేసారు.

Video Advertisement

చంటి సినిమాలో కూడా ఈమె చాలా అద్భుతంగా నటించారు. దాసరి నారాయణ రావు గారి డైరెక్షన్ లో వచ్చిన గోరింటాకు, ఏడంతస్తుల మేడ, అనుబంధం సినిమాలలో చక్కగా నటించి మంచి పేరుని పొందారు. కరుణ రసాన్ని పండించడంలో ఈమె నెంబర్ వన్. అయితే ఈమె పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించినప్పటికీ స్టార్ హీరోయిన్ అవ్వలేక పోయారు. ఎందుకు ఈమె స్టార్ హీరోయిన్ అవ్వలేక పోయారనే విషయానికి వస్తే..

ఈమె చేతులారా చాలా సినిమాలు వదిలేసుకున్నారని అంటూ ఉంటారు. అయితే ఈమె చాలా సినిమాల్లో మంచి పాత్రలు నటించినప్పటికీ తన మనసుకు నచ్చిన పాత్రలు మాత్రమే చేసేవారట. ఈ కారణంగా చాలా మంది ప్రొడ్యూసర్లకు ఈమె శైలి నచ్చేది కాదని.. అందుకే ఈమె పెద్ద హీరోయిన్ అవ్వలేక పోయారని అంటుంటారు.

ఇది ఇలా ఉంటే నటి సుజాత కె బాలచందర్ ద్వారా వెండి తెరకు ఎంట్రీ ఇవ్వడం జరిగింది. కేవలం తెలుగు లో మాత్రమే కాకుండా ఈమె తమిళ, మలయాళ, కన్నడ వంటి భాషా చిత్రాల్లో కూడా నటించారు. ఈమె అక్కినేని నాగేశ్వర రావు, శోభన్ బాబు మొదలైన సీనియర్ నటుల పక్కన పాత్రలని చేసి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలానే ఈమె నటించిన పసుపు పారాణి, సంధ్య, సర్కస్ రాముడు, సూరిగాడు, ఎం. ఎల్. ఏ. ఏడుకొండలు, జస్టిస్ చక్రవర్తి, సీతాదేవి, బహుదూరపు బాటసారి తదితర చిత్రాలకి మంచి గుర్తింపు వచ్చింది.


End of Article

You may also like