Ads
ఈ ఐపీఎల్ సీజన్ ఉత్కంఠగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సారి ఐపీఎల్ లో ఎస్ ఆర్ హెచ్ వరుసగా రెండు సార్లు ఓడిపోయింది. మరో వైపు ముంబై ఇండియన్స్ తో బరిలోకి దిగి సత్తా చాటాలని ఆర్సీబీ కూడా పోటీ పడుతోంది. ఇది ఇలా ఉంటె.. ఈ సీజన్ లో ఎస్ ఆర్ హెచ్ టీమ్ వెనకబడినట్లు కనిపిస్తోంది. ఇప్పటి దాకా ఎస్ ఆర్ హెచ్ ఆడిన రెండు మ్యాచ్ ల లోను కేన్ విలియమ్సన్ లేకపోవడం గమనార్హం.
Video Advertisement
అయితే.. ఈ విషయమై అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్నారు. ఎస్ ఆర్ హెచ్ టీం లో కేన్ విలియమ్సన్ లేకపోవడం పై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జట్టుపై తీవ్రం గా విమర్శలు చేస్తున్నారు. కేన్ మామ లేకపోవడం వల్లే ఎస్ ఆర్ హెచ్ ఓడిపోతుందని ఫ్రాంచేజి పై కూడా ఎస్ ఆర్ హెచ్ అభిమానులు విమర్శలు కురిపిస్తున్నారు.
దీనితో ఫ్రాంచైజీ కి వివరణ ఇవ్వక తప్పలేదు. కేన్ విలియమ్సన్ ఇంకా పూర్తి గా కోలుకోలేదని.. ఆటకి ఫిట్ గా లేడని.. అందుకే ఆయనను జట్టులోకి తీసుకోలేదంటూ.. సదరు ఫ్రాంచైజీ వివరణ ఇచ్చింది. ముంబై తో మ్యాచ్ సమయానికి కూడా కేన్ విలియమ్సన్ అందుబాటులోకి వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి సన్ రైజర్స్ ఓ వీడియో ను కూడా పోస్ట్ చేసింది. “గాయం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నా.. మరో వారం రోజుల్లో పూర్తి గా ఫిట్ నెస్ సాధించి మైదానం లో అడుగు పెడతా” అంటూ కేన్ విలియమ్సన్ ఈ వీడియో లో తెలిపారు.
Kane Williamson gives us an update on his recovery.#OrangeOrNothing #OrangeArmy #IPL2021 pic.twitter.com/BP77O28Akk
— SunRisers Hyderabad (@SunRisers) April 16, 2021
End of Article