వరల్డ్ కప్ ఫైనల్ చూడడానికి ధోనీ ఎందుకు వెళ్లలేదు..? అసలు ఆ సమయంలో ఎక్కడ ఉన్నారు..?

వరల్డ్ కప్ ఫైనల్ చూడడానికి ధోనీ ఎందుకు వెళ్లలేదు..? అసలు ఆ సమయంలో ఎక్కడ ఉన్నారు..?

by Mounika Singaluri

Ads

2023 వన్డే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరిగగింది. ఈ మ్యాచ్ ను స్టేడియంలో వీక్షించేందుకు లక్ష 30 వేల మంది భారతీయ అభిమానులు విచ్చేశారు. వారితోపాటు ప్రధాని నరేంద్ర మోడీ బాలీవుడ్ సెలబ్రిటీలు టాలీవుడ్ హీరోలు ఇతర స్పోర్ట్స్ సెలబ్రిటీలు అందరూ హాజరయ్యారు. అయితే ఈ ఫైనల్ మ్యాచ్ కి ఇండియాకి రెండుసార్లు వరల్డ్ కప్ లు తెచ్చి పెట్టిన కెప్టెన్లు కపిల్ దేవ్, ఎమ్మెస్ ధోని మాత్రం హాజరు అవ్వలేదు.

Video Advertisement

ఇండియాలో జరిగే ఫైనల్ మ్యాచ్ కి ఇండియా ఆడుతుందంటే యావత్ దేశం మొత్తం తమ కళ్లంతా ఆ మ్యాచ్ మీదే పెట్టి మరి చూసాయి. దురదృష్టవశాస్తూ ఇండియా ఫైనల్ మ్యాచ్ లో ఓడిపోయింది, అది వేరే విషయం.

Kapil Dev

అయితే ఇండియన్ ఎంకరేజ్ చేసేందుకు మాజీ కెప్టెన్లు రాకపోవడం ఇప్పుడు చర్చనీయాంశం అయింది. ఈ విషయం పైన కపిల్ దేవ్ ని అడగగా మ్యాచ్ కి తనకి ఇన్విటేషన్ అందలేదని చెప్పారు. ఇండియాకి వరల్డ్ కప్ తెచ్చిన మొదటి కెప్టెన్ పిలవక పోవడం ఏంటంటూ ఫ్యాన్స్ బీసీసీ అయిపోయిన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అయితే ఎంఎస్ ధోని కి ఆహ్వానం అందిందా లేదా అనే విషయం మాత్రం తెలియదు గానీ ధోని ఫైనల్ మ్యాచ్ కి హాజరు కాలేదు.

తన కుటుంబ సభ్యులతో కలిసి తన పూర్వీకుల గ్రామంలో పర్యటించాడు ఆ పర్యటనకు సంబంధించిన ఫోటోలు ధోని భార్య సాక్షి సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది.కాగా ఈ ఫైనల్ మ్యాచ్ ను వీక్షించేందుకు మాజీ బీసీసీఐ ప్రెసిడెంట్ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కూడా హాజరయ్యాడు. ధోని తన పూర్వీకుల గ్రామంలో టీవీలో క్రికెట్ మ్యాచ్ లైవ్ చూసినట్లుగా తెలిసింది.

 

Also Read:ఇప్పటి టాప్ ప్లేయర్… 3 సార్లు ఎందుకు చనిపోవాలి అనుకున్నాడు..? IPL కి ముందు ఇతనికి ఏం జరిగింది..?


End of Article

You may also like