దినేష్ కార్తీక్ ధరించే “హెల్మెట్” ఎందుకు భిన్నంగా ఉంటుంది..? వెనకున్న కారణమేంటి..?

దినేష్ కార్తీక్ ధరించే “హెల్మెట్” ఎందుకు భిన్నంగా ఉంటుంది..? వెనకున్న కారణమేంటి..?

by Anudeep

Ads

టీ 20 కోసం భారత జట్టును సిద్ధం చేయడం లో కెప్టెన్ రోహిత్ చాలా మార్పులు చేస్తున్నారు. మరో వైపు టీం ఇండియాలో దినేష్ కార్తిక్ పాత్ర ఏంటనే దానిపై తాజాగా చర్చలు జరుగుతున్నాయి. ఐపీఎల్ లో ఫినిషర్ గా మెరిసిన ఈ వెటరన్ క్రికెటర్ ని ఫినిషర్ గా మార్చి జట్టులో చోటు కల్పించారు. తర్వాత జరిగిన మ్యాచ్ లలో అతడు ఫినిషర్ గా మెరుపులు మెరిపించాడు. ధోని తర్వాత మరో ఫినిషర్ భారత్ కు దొరికాడు అంటూ క్రికెట్ ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Video Advertisement

ఇది ఇలా ఉండగా…మీరెప్పుడైనా గమనించారా.. దినేష్ వాడే హెల్మెట్ ఇతర బ్యాటర్స్ కి డిఫరెంట్ గా ఉండడాన్ని?దీనికి ప్రత్యేక కారణమంటూ ఏం లేదు కానీ హెల్మెట్ యొక్క బరువు (తేలికగా ఉండడం) కారణం అవ్వొచ్చు. ఏది ఏమైనప్పటికీ క్రికెట్ రూల్స్ కి కట్టుబడి ఉన్నంత వరకూ పరికరాల ఎంపిక ఆటగాడి వ్యక్తిగత ప్రాధాన్యతకు సంబంధించిన విషయం.

డీకే ఈ రకమైన హెల్మెట్ వాడడం ఇదే తొలిసారి కాదు. అతని వికెట్ కీపింగ్ హెల్మెట్ కూడా ఇతర కీపర్లకు భిన్నంగా ఉన్న సందర్భాలు అనేకం. అంతర్జాతీయ క్రికెట్ (ICC), IPL రెండింటిలోను అనేక సందర్భాల్లో కార్తీక్ బేస్ బాల్-రకం ఫేస్ ప్రొటెక్టర్ గార్డ్ ధరించి కనిపించాడు. ఇది క్రికెట్ నిబంధనల ద్వారా అనుమతించబడుతుంది. కేవలం దినేష్ కార్తీక్ మాత్రమే కాదు.

what is dk role in indian team

రాహుల్ త్రిపాఠి కూడా ఇదే రకమైన బ్యాటింగ్ హెల్మెట్‌ని ధరిస్తాడు. శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర, ఇంగ్లండ్ మాజీ బ్యాటర్లు జేమ్స్ టేలర్ మరియు మైఖేల్ కార్బెర్రీ కూడా అప్పట్లో ఇటువంటి హెల్మెట్‌లను ధరించేవారు.

అయితే ఐపీఎల్ తర్వాత జరిగిన అన్ని మ్యాచ్ లలో దినేష్ ను ఎంపిక చేస్తూ వచ్చారు కానీ, తుది జట్టులో ఆడే అవకాశాలు చాలా తక్కువగా వచ్చేవి. ఒకవేళ జట్టులో చోటు దక్కినా ఏడో స్థానం లో బ్యాటింగ్ కు వచ్చేవాడు. ఇలా అయితే దినేష్ కార్తిక్ ఫినిషర్ పాత్రకు ఎలా న్యాయం చేస్తాడని అందరూ చర్చించుకుంటున్నారు. తాజాగా ఆసీస్ మాజీ ఓపెనర్ మాథ్యూ హేడెన్ టీమ్ ఇండియాలో కార్తీక్ పాత్రను ప్రశ్నించాడు, అతనికి బ్యాటింగ్ చేయడానికి మరిన్ని అవకాశాలు ఇవ్వాలని మేనేజ్‌మెంట్‌ను కోరాడు.


End of Article

You may also like