కొత్తగా కట్టే బిల్డింగ్స్ కి ఎందుకు ఆకుపచ్చ రంగు క్లాత్ ని కడతారో మీకు తెలుసా..?

కొత్తగా కట్టే బిల్డింగ్స్ కి ఎందుకు ఆకుపచ్చ రంగు క్లాత్ ని కడతారో మీకు తెలుసా..?

by Megha Varna

Ads

ఎప్పుడైనా పెద్ద పెద్ద బిల్డింగ్లని, ఇళ్ళని కట్టినప్పుడు మనం చూసుకున్నట్లయితే ఆకుపచ్చ రంగు క్లాత్ ని బిల్డింగ్ మొత్తం కట్టేసి ఉంచుతారు. ఇది మనం చాలా సార్లు చూసే ఉంటాం. రోడ్డు మీద నుంచి వెళ్ళిపోతున్నప్పుడు మనకు ఇలాంటివి కనబడుతూ ఉంటాయి. అయితే ఎప్పుడైనా మీకు సందేహం కలిగిందా..?

Video Advertisement

ఎందుకు ఆకుపచ్చ రంగుని మాత్రమే వాడతారు..? ఇతర రంగులని ఎందుకు వాడరు అని..? అయితే మరి దాని వెనుక ఉండే కారణం గురించి చూద్దాం. ఇలా కన్స్ట్రక్షన్ చేసే భవనాలకి వాడే ఆకుపచ్చ క్లాత్ ని సేఫ్టీ నెట్ అని అంటారు. దీనిని ఎందుకు ఉపయోగిస్తారు అనే దాని గురించి ఇప్పుడు మనం చూద్దాం.

#1. సేఫ్టీ గా ఉండాలని:

ఈ సేఫ్టీ నెట్ ని ఉపయోగించడం వల్ల ఏమైనా రాళ్లు కానీ ఏదైనా కన్స్ట్రక్షన్ మెటీరియల్ కానీ బయట వేరే వాళ్ల మీద పడకుండా ఉండటానికి వాడతారు.

#2. దుమ్ము, ధూళి రాదు:

ఈ క్లాత్ ని కట్టేసి దీని మీద నీళ్ళని జల్లుతారు. ఇలా చేయడం వల్ల దుమ్ము, ధూళి బయటకి రాదు.

#3. పబ్లిక్ ని అలర్ట్ చేస్తుంది:

పక్కన వెళ్లే వాళ్ళు జాగ్రత్తగా ఉండేలా ఇది సహాయ పడుతుంది. ఈ ఆకుపచ్చ రంగు క్లాత్ చూడగానే ఇక్కడ పని జరుగుతుందని మనం గ్రహించవచ్చు.

#4. సూర్య కిరణాలు బిల్డింగ్ మీద పడవు:

ఈ క్లాత్ కట్టడం వల్ల సూర్యకిరణాలు డైరెక్టుగా బిల్డింగ్ మీద పడవు. దీంతో నీళ్ళని కూడా బాగా బిల్డింగ్ పీల్చుకుంటుంది.

#5. బయట వాళ్ళ ఇబ్బంది ఉండదు:

లోపల బిల్డింగ్ ని కట్టే వాళ్ళకి బయట వాళ్ళ ఇబ్బంది ఉండకుండా ఫ్రీ గా వాళ్లు పని చేసుకోవడానికి ఈ సేఫ్టీ నెట్ హెల్ప్ అవుతుంది.


End of Article

You may also like