“ధోనీ” ని RCB ఎందుకు కొనుగోలు చేయలేకపోయారు..? దీనికి కారణం ఏంటంటే..?

“ధోనీ” ని RCB ఎందుకు కొనుగోలు చేయలేకపోయారు..? దీనికి కారణం ఏంటంటే..?

by kavitha

Ads

భారత జట్టు  మాజీ కెప్టెన్, ప్రస్తుత చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన పని లేదు. రిటైర్ అయినప్పటికీ ధోనీ ఫ్యాన్ ఫాలోయింగ్, క్రేజ్ ఏ మాత్రం తగ్గకపోగా, మరింత పెరిగింది. ఇక ఐపీఎల్ మొదటి సీజన్‌ వేలంలో ఫ్రాంచైజీలన్ని ధోనీని దక్కించుకోవడం కోసం చాలా పోటీపడ్డాయి.

Video Advertisement

ఈ వేలంలో చెన్నై సూపర్ కింగ్స్  జట్టు అందరితో పోటీ పడి, చివరికి ధోనీని దక్కించుకుంది. అప్పటి నుండి ఇప్పటి వరకు పదిహేను సీజన్లగా ధోనీ సీఎస్‌కే జట్టుకే ఆడుతున్నాడు. 5 సార్లు సీఎస్‌కేను విజేతగా నిలబెట్టాడు. అయితే మొదటి సీజన్ వేలంలో ఆర్సీబి కూడా ధోనీ కోసం పోటీ పడింది. అయితే ఎందుకు ధోనీని పొందలేకపోయిందనే విషయం తాజాగా బయటికి వచ్చింది.
ఐపీఎల్ 2008లో ప్రారంభం అయిన విషయం తెలిసిందే. ఈ సీజన్ వేలంలో ఎంఎస్ ధోనీ అత్యధిక రేటు పలికిన ప్లేయర్ గా నిలిచాడు. ఆ సమయంలో ధోనీ దాదాపు ఆరు కోట్ల ధర పలికాడు. ధోనీని సొంతం చేసుకోవడం కోసం అన్ని ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. వాటిలో చెన్నై సూపర్ కింగ్స్,  ముంబై ఇండియన్స్‌ మరియు ఆర్‌సీబీ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు) లు తీవ్రంగా పోటీపడ్డాయి.కొన్ని పరిస్థితుల వల్ల ఆర్‌సీబీ ధోనీని దక్కించుకోలేకపోయిందని అప్పటి వేలంపాటదారుడు రిచర్డ్ మాడ్లీ తాజగా ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ‘ఆ సమయానికి ఆర్‌సీబీ తమ ఫ్రాంచైజీ పేరును ఫిక్స్ చేసుకోలేదు. అందువల్ల బెంగళూరు పేరిట వేలంలో పాల్గొంది.  బిడ్డింగ్ రూల్స్ కారణంగా ధోనీని సొంతం చేసుకునే విషయంలో ఆ జట్టు వెన్నక్కి తగ్గాల్సి వచ్చింది’ అని మాడ్లీ పేర్కొన్నాడు.
రూల్ ప్రకారం, జట్టు ఐకాన్ ప్లేయర్ కన్నా ఎక్కువ ఫీజు వేరే ప్లేయర్ కి ఉండకూడదు. ఆ జట్టు రాహుల్ ద్రవిడ్‌ను అప్పటికే  టీమ్ ఐకానిక్ ప్లేయర్‌గా సెలెక్ట్ చేసుకుంది. అందువల్ల అత్యధిక ధర పలికిన ధోనీని జట్టులోకి తీసుకోలేకపోయింది. ముంబై ఇండియన్స్ సైతం ఈ కారణం వల్లే ధోనీని దక్కించుకోలేకపోయింది. ఆ జట్టు అప్పటికే  సచిన్ టెండూల్కర్‌ను ఐకానిక్ ప్లేయర్‌గా తీసుకుంది.

Also Read: దరిద్రం అంటే RCB దే అనుకుంటా.? టీం నుండి తీసేయగానే ఆ ప్లేయర్ సెంచరీ.! ఎవరంటే.?


End of Article

You may also like