Ads
తాజాగా గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే తొలి ఓవర్ లోనే ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. మొదట టాస్ గెలిచిన బెంగళూరు టీం బాటింగ్ ను ఎంచుకుంది. ఈ సీజన్‌లోని 43వ గేమ్‌లో టేబుల్-టాపర్స్ గుజరాత్ టైటాన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో తలపడింది. ఆసక్తికరంగా, RCB కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ ట్రెండ్‌ను బక్ చేసి, టాస్ గెలిచిన తర్వాత మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఆట కూడా సమయానికి ప్రారంభమైంది. కానీ ఒక బంతి తర్వాత అనుకోని సంఘటన చోటు చేసుకుంది.
Video Advertisement
ఈ మ్యాచ్ మొదలైన మొదటి ఓవర్ లోనే ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఓవర్ మధ్యలోనే షమీ ఆట ఆపేసి టేపు తెప్పించి కొలతలు కొలుస్తూ ఉండడంతో అందరు ఆశ్చర్యానికి లోనయ్యారు.
షమీ మొదటి బాల్ ను డాట్ గా వేసాడు. కాగా, రెండవ బంతి వేయబోతున్న సమయంలో కోహ్లీ అతన్ని ఆగమంటూ సైగ చేసాడు. ఆ తరువాత మరో సారి బౌల్ చేస్తూ షమీ మధ్యలోనే ఆపేసాడు. ఆ తర్వాత డగౌట్ వైపు తిరిగి టేపు తేవాలని కోరాడు. కానీ, ఆట మధ్యలో టేపు తెప్పించడానికి అంపైర్ ఒప్పుకోలేదు. వద్దంటూ వారించాడు. అయినా వినకుండా షమీ టేపు తెప్పించాడు. అయితే షమీ ఇలా టేపు తెచ్చి కొలవడం వలన గేమ్ కొంత సమయం వాయిదా పడింది. మొదటి ఓవర్ ను సాగదీస్తూ పూర్తి చేయాల్సి వచ్చింది.
రన్నప్ సరిగ్గా లేకపోవడం వల్లే షమీ బౌలింగ్ చేయడానికి కొంత ఇబ్బంది ఎదుర్కొన్నాడు. అయితే అంపైర్ అడ్డు చెప్పిన.. షమీ అదేమీ పట్టించుకోలేదు. టేపుతో కొలుచుకుని తన రన్నప్ ను మార్క్ చేసుకున్నాడు. ఆ తర్వాత వేసిన బంతిని కోహ్లీ మిస్ చేసుకున్నాడు. కానీ, ఆ తరువాత వరుసగా ఫోర్లు కొట్టి తొలి ఓవర్ లోనే పది పరుగులు సొంతం చేసేసుకున్నారు.
End of Article