ఈ వందేళ్ల బామ్మ..కరోనా ను జయించింది..!

ఈ వందేళ్ల బామ్మ..కరోనా ను జయించింది..!

by Anudeep

Ads

ప్రస్తుతం ఎటు వైపు చూసినా ఒక్క కరోనా గురించే చర్చ జరుగుతోంది. ఈ మహమ్మారి ని ఎలా ఎదుర్కోవాలి అన్నదే అందరి లక్ష్యం. ఎవరికివారు జాగ్రత్తలు తీసుకోవడమే తప్ప.. ఏమి చేయలేని పరిస్థితి. అయితే.. కరోనా సోకి ధైర్యం గా కోలుకున్నవారు మరెందరికో స్ఫూర్తి దాయకం గా నిలుస్తున్నారు. తాజాగా ఓ వందేళ్ల బామ్మ కూడా కరోనా నుంచి కోలుకుని అందరికి స్ఫూర్తినిస్తోంది.

Video Advertisement

100 years old women

వివరాల ప్రకారం, సారవకోట మండలం కుమ్మరిగుంట గ్రామ నివాసి యాళ్ల సీతారావమ్మ కు వందేళ్లు. ఆమెకు గత నెల 20 న కరోనా పరీక్షలు చేయగా.. పాజిటివ్ గా తేలింది. అప్పటి నుంచి ఆమె వైద్యుల పర్యవేక్షణలో ఇంట్లోనే ఉండి చికిత్స తీసుకుంటూ వచ్చారు. ఆమె క్వారంటైన్ లో ఉండి సమయానికి తగిన ఆహరం తీసుకుంటూ.. మందులు వేసుకుంటూ.. జాగ్రత్తలు తీసుకున్నారు. ఎక్కువ గా నీటిని కూడా తాగుతూ..మంచి ఆహారాన్ని తీసుకున్నారు. హోం ఐసోలేషన్ కిట్ లో ఉండే మందులే ఆమె కూడా వేసుకున్నారు. ప్రస్తుతం ఆమె కరోనా ను జయించారు. ఆమెకు ఆక్సిజెన్ లెవెల్స్ కూడా పెరిగాయి. ప్రస్తుతం ఆమెకు 97 నుంచి 98 వరకు ఆక్సిజెన్ లెవెల్ ఉంది. ఈ వయసులో ఆమె కరోనా తో పోరాడి ఎందరికో ధైర్యాన్ని నింపుతున్నారు.


End of Article

You may also like