Ads
బిగ్ బాస్ సీజన్ ఫైవ్ ముగిసిపోయింది. అయితే బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో సిరి భారీ పాపులారిటీని పొందింది. అయితే హౌస్ లో సిరి ప్రవర్తించిన తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే షణ్ముక్ విన్నర్ అవ్వక పోవడానికి కారణం సిరి అని షణ్ముఖ అభిమానులు అన్నారు. అయితే బిగ్ బాస్ కారణంగా సిరీ, శ్రీహాన్ మధ్య గొడవలు వచ్చాయని జోరుగా ప్రచారం కూడా సాగుతోంది.
Video Advertisement
హౌస్ లో సిరి, షణ్ముఖ్ బాగా దగ్గర అయ్యి రచ్చరచ్చ చేశారు. పైగా ఎలిమినేట్ అయ్యి వెళ్లిపోయిన కంటెస్టెంట్స్ కూడా వాళ్ళిద్దరూ కలిసి గేమ్ ఆడుతున్నారు అంటూ విమర్శలు చేశారు. అయితే సిరి, షన్ను ఇద్దరు టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ లో ఉండడం గమనార్హం. తాజాగా ఒక ఇంటర్వ్యూలో సన్నీ సిరి, షన్ను రిలేషన్ షిప్ గురించి కామెంట్లు చేశాడు.
సిరి తో నీకోసం బయట ఒక వ్యక్తి ఉన్నాడని ఇలా చేయకు అని చెబుతామని అనుకున్నానని… కానీ సిరి తీసుకో లేదని అన్నాడు. పైగా సిరి కి ఈ విషయం చెప్తే నాతోనే గొడవ పడుతుందని కామెంట్లు చేశాడు సన్నీ. అలానే పాపం శ్రీహాన్ అని నాకు అనిపించింది అంటూ సన్నీ ఆ ఇంటర్వ్యూ లో చెప్పడం జరిగింది.
End of Article