Ads
ఒలింపిక్స్ విశ్వక్రీడా వేదిక. ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్, బ్యాడ్మింటన్‌లాంటి ఎన్నో పాపులర్ స్పోర్ట్స్‌కు అవకాశం దక్కినా.. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రజాదరణ ఉన్న క్రికెట్ మాత్రం ఒలింపిక్స్‌లో లేదు. ఒలింపిక్స్‌లో క్రికెట్ ఎందుకు లేదు? ఈ ప్రశ్న ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌ను పిచ్చిగా అభిమానించే దేశాల్లో మాత్రం చాలా మంది అభిమానులను వేధిస్తూ ఉంటుంది.
Video Advertisement
1900లో క్రికెట్ కూడా ఒలింపిక్ క్రీడల్లో భాగంగా ఉండేది. అయితే అప్పుడు ఫ్రాన్స్, గ్రేట్ బ్రిటన్ మాత్రమే ఈ పోటీల్లో పాల్గొన్నాయి. అప్పుడు ఆతిథ్య ఫ్రాన్స్‌ను ఓడించి గ్రేట్ బ్రిటన్ గోల్డ్ మెడల్ గెలిచింది. ఇక ఆ తర్వాతి ఒలింపిక్స్ లో క్రికెట్ లో ఏ దేశము పాల్గొనలేదు. ఒక క్రీడ ఒలింపిక్స్‌లోకి ఎంట్రీ ఇవ్వాలంటే దాన్ని కనీసం నాలుగు ఖండాల్లో, 75 దేశాల్లో ఆడుతూ ఉండాలి.
అయితే క్రికెట్ కి 106 దేశాల్లో ఆదరణ ఉన్నా.. ఐసీసీ లో కేవలం 12 దేశాలు మాత్రమే సభ్యులుగా ఉన్నాయి. దీంతో క్రికెట్ ఒలింపిక్స్ కి దూరం గా ఉంది. అలాగే ఒక క్రీడ ని ఒలింపిక్స్ లో చేర్చాలి అంటే ఖర్చు, భద్రత, ఆరోగ్యవంతమైన అథ్లెట్లు, క్రీడలను నిమగ్నం చేయడం, గ్లోబల్ అప్పీల్, హోస్ట్ దేశ ఆసక్తి, లింగ సమానత్వం, క్లీన్ స్పోర్ట్స్‌కు మద్దతు ఇవ్వడంలాంటివి వాటిని పరిగణనలోకి తీసుకుంటుంది ఒలంపిక్ కమిటీ.
అంతే కాకుండా ఈ మెగా ఈవెంట్‌లో క్రికెట్ కోసం అభిమానులు ఆరాటపడుతున్నా.. క్రికెట్ బోర్డులు మాత్రం ఆసక్తి చూపడం లేదు. ముఖ్యంగా ప్రపంచంలోనే అత్యంత ధనికవంతమైన మన ఇండియన్ క్రికెట్ బోర్డు బీసీసీఐ ఇప్పటి వరకూ ఒలింపిక్స్ దిశగా ఆలోచన చేయకపోవడానికి ఇదే ప్రధాన కారణం. ముఖ్యంగా ఐపీఎల్‌లాంటి కాసులు కురిపించే టోర్నీని ఒకవేళ ఒలింపిక్స్ కోసం త్యాగం చేయాల్సి వస్తే.. బీసీసీఐ కచ్చితంగా నో అనే అంటుంది.
వాస్తవానికి ఒలింపిక్స్‌లో ఏయే క్రీడలను చేర్చాలనే దానిపై గత ఏడాది ఫిబ్రవరిలో సమావేశం జరిగింది. ఆ సమావేశంలో, 28 క్రీడలు ఎంపిక చేశారు. ఈ 28 ఆటలను 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో ఆడేందుకు ఖరారు చేశారు. కానీ ఆ తర్వాత మరో 8 క్రీడలు షార్ట్‌లిస్ట్ అయ్యాయి. భవిష్యత్తులో ఇతర క్రీడలను చేర్చవచ్చు, అందులో క్రికెట్ కూడా ఒకటి కూడా ఉండచ్చేమో.
Also read: “ధోనీ” లాంటి క్రికెటర్, శతాబ్దానికి ఒక్కడే వస్తాడు..! సునీల్ గవాస్కర్
End of Article