Home Bigg Boss 5 telugu క్వారంటైన్ లోకి బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్స్.!

క్వారంటైన్ లోకి బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్స్.!

by Mohana Priya

ప్రస్తుతం ఎక్కడ చూస్తున్నా నడిచే ఒకే ఒక్క టాపిక్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 5. ఈ సీజన్ ఆగస్ట్ చివరిలో, లేదా సెప్టెంబర్ మొదట్లో మొదలు కాబోతోంది. సాధారణంగా బిగ్ బాస్ అంటే చాలా మందికి ఆసక్తి ఉండడానికి కారణం, ఇందులో మన ఫేవరెట్ సెలబ్రిటీస్ నిజ జీవితంలో ఎలా ఉంటారో అనేది చూపిస్తారు. అంతే కాకుండా అలా అంత మంది ఒకే ఇంట్లో ఉంటే, అది కూడా వాళ్ళలో చాలా మందికి ఒకరికి ఒకరు తెలియకపోతే అసలు ఎలా ఉంటారు అనేది కూడా తెలుసుకోవడానికి చాలా ఆసక్తిగా ఉంటుంది.bigg boss

అయితే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ప్రస్తుతం క్వారంటైన్ లో ఉన్నారట. బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయ్యే ముందు అన్ని రకమైన జాగ్రత్తలు తీసుకొని అడుగుపెట్టబోతున్నారు. ఇందులో పాల్గొనే వ్యక్తుల పేర్లు ఇవే అంటూ చాలా మంది పేర్లు బయటకు వచ్చాయి. వారిలో యాంకర్ రవి, ఆర్జే కాజల్ తో పాటు ఇంకా కొంత మంది సినీ ప్రముఖులు ఉన్నారు. కానీ ఈ వార్తల్లో ఎంతవరకు ఉందో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

You may also like