Ads
విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్.. భారత్ క్రికెట్‌లో ఇద్దరు అత్యుత్తమ ఆటగాళ్లు. అయితే వీరిద్దరికి ఒకరంటే ఒకరు పడదు. ముఖ్యంగా గంభీర్ తరచూ విరాట్ కోహ్లీని విమర్శిస్తుంటాడు. తాజాగా లక్నో వర్సెస్ బెంగళూరు మ్యాచ్ సందర్భంగా కోహ్లీ, గంభీర్ మరోసారి గొడవకు దిగిన విషయం తెలిసిందే. మ్యాచ్ అనంతరం ఇద్దరి మధ్య మాటల తూటాలు పేలాయి.
Video Advertisement
ఇద్దరి మధ్య మాట మాట పెరిగి గొడవకు దారి తీయడంతో సహచర ఆటగాళ్లు జోక్యం చేసుకొని విడదీసారు. అమిత్ మిశ్రా కోహ్లీని అడ్డుకోగా.. కేఎల్ రాహుల్ గంభీర్‌ను పక్కకు తీసుకెళ్లాడు. వీరి గొడవకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మ్యాచ్ అనంతరం ఇరు జట్ల ఆటగాళ్ల షేక్ హ్యాండ్‌ల సమయంలో విరాట్ కోహ్లీ, లఖ్‌నవూ బౌలర్ నవీనుల్ హఖ్ (అఫ్గానిస్తాన్) మధ్య ఏదో విషయమై వివాదం చెలరేగింది. ఇద్దరూ చేతులు విసిరికొట్టుకున్నారు.
అయితే తనకేం సంబంధం లేకపోయినా గౌతమ్ గంభీర్ ఈ వివాదంలో తలదూర్చాడు. ఈ క్రమంలో కోహ్లీ, గంభీర్ చాలా తీవ్రంగా వాదించుకున్నారు. లక్నో ఇన్నింగ్స్ 16వ ఓవర్ పూర్తయిన సమయంలో ఏదో విషయంలో విరాట్ కోహ్లీ, నవీన్ ఉల్ హక్ మధ్య వివాదం రాజుకుంది. ఈ వాగ్వాదం కాస్తా.. మ్యాచ్ అనంతరం గంభీర్, కోహ్లీ మధ్య గొడవకు కారణమైంది.
అయితే కోహ్లీ ని ఉద్దేశించి
గంభీర్ : ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు.. అనగా
కోహ్లీ : నేను మిమ్మల్ని ఏం అందినప్పుడు మీరు ఎందుకు మధ్యలో వస్తున్నారు.. అని కోహ్లీ బదులిచ్చాడు.
దానికి
గంభీర్ : నువ్వు నా ప్లేయర్ ని అంటున్నావు.. అది నా కుటుంబాన్ని అన్నట్టే.. అనగా,
దానికి
కోహ్లీ : అయితే మీ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోండి..’ అన్నాడు.
ఇక చివరిగా గొడవ ముగిసే ముందు
గంభీర్ : ఇవన్నీ ఇక నీ దగ్గరే నేర్చుకోవాలి..’ అని అన్నాడు.
ఇలా ఇద్దరి మధ్య మాటా మాటా పెరగడంతో సహచర ఆటగాళ్లు వారిద్దరిని విడదీశారు.
ఇదిలా ఉంటే.. గతంలో ఈ రెండు టీమ్స్‌కి మధ్య బెంగళూరులో మ్యాచ్ జరిగింది. ఆ సమయంలో లక్నో గెలవగా.. గౌతమ్ గంభీర్ ఆర్సీబీ ఫ్యాన్స్‌కు నోరు మూసుకోవాల్సిందిగా సైగ చేశాడు. దానికి రివెంజ్‌గా ఈ మ్యాచ్‌లో కోహ్లీ మ్యాచ్ గెలిచాక అగ్రెసివ్‌గా సెలబ్రేషన్స్ చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో ఈ గొడవ ఇలా ముదిరి మైదానం లో తీవ్ర వాగ్వాదం జరిగింది.
విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ మధ్య గొడవ ఇప్పటిది కాదు. 2013 సీజన్‌లో కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో గౌతమ్ గంభీర్, విరాట్ కోహ్లీ మధ్య మాటా మాటా పెరిగి కొట్టుకునే దాకా వెళ్లారు. అప్పటి నుంచే వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. అయితే ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు విరాట్ కోహ్లీ , గౌతమ్ గంభీర్‌లకు భారీగా జరిమానా విధించింది బీసీసీఐ. మ్యాచ్ ఫీజులో 100% కోత విధించింది. అలాగే నవీన్ ఉల్ హక్ మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధించారు.
Also Read: “విరాట్ కోహ్లీ” కెరీర్‌లో… “రివెంజ్” తీర్చుకున్న 6 సందర్భాలు ఇవే..!
End of Article