విమానాలు హిమాలయాల పై నుంచి ఎందుకు వెళ్ళవో తెలుసా..? అసలు కారణం ఇదే..!

విమానాలు హిమాలయాల పై నుంచి ఎందుకు వెళ్ళవో తెలుసా..? అసలు కారణం ఇదే..!

by Anudeep

Ads

మీరెప్పుడైనా గమనించారా..? ఇండియా నుంచి ఇతర దేశాలకు వెళ్లే రూట్లు చాలానే ఉన్నప్పటికీ.. వీటిలో ఏ ఒక్కటీ హిమాలయాల పై నుంచి ఉండదు. చివరకు మనకి దగ్గరగా ఉండే చైనా కి వెళ్లాలన్నా కూడా.. డైరెక్ట్ గా ఇండియా నుంచి చైనా కి హిమాలయాలపై నుంచి వెళితే చాలా దగ్గర. కానీ, పైలట్స్ ఈ రూట్ ను తీసుకోరు. ఇలా ఎందుకు చేస్తారో.. ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

Video Advertisement

airlines 1

సాధారణం గా విమానాలు ముప్పై ఐదు వేల అడుగుల ఎత్తులో వెళ్తాయి. అయితే, మౌంట్ ఎవరెస్ట్ హైట్ ఎంతో తెలుసా..? 29 వేల అడుగులు. అంటే మౌంట్ ఎవరెస్టు కు, విమానాల ఎత్తు కు మధ్య కేవలం ఆరువేల అడుగుల దూరం మాత్రమే ఉంటుంది. ఇంత తక్కువ డిస్టెన్స్ తేడా తో ప్రయాణించడం అంత శ్రేయస్కరం కాదు. ఇంకొక కారణం ఏంటంటే, 35 వేల అడుగుల ఎత్తులో వెళ్తున్న విమానం బయట ప్రెజర్ సాధారణం గా ఉండే అట్మాస్ఫియరిక్ ప్రెజర్ లో 1/4 th ఉంటుంది. ఉష్ణోగ్రత కూడా -50 డిగ్రీలలో ఉంటుంది.

airlines 2

అయితే.. విమానం లో మాత్రం ఈ ప్రభావం పడకుండా అన్ని డోర్స్ ను క్లోజ్ చేసేసి జాగ్రత్తలు తీసుకుంటారు. ఒకవేళ ఏదైనా ఇబ్బంది ఎదురైతే.. ఫ్లైట్ లోపలి ప్రయాణికులకు ఆక్సిజెన్ మాస్క్ లను అందిస్తారు. ఇవి పదిహేను నిమిషాల వరకు ఆక్సిజెన్ ను అందిస్తాయి. ఈ సమయం లో పైలట్ ఫ్లైట్ ను 35 వేల అడుగుల ఎత్తు నుంచి ఎనిమిదివేల అడుగులకు తీసుకొస్తారు.

airlines 3

ఇదే పరిస్థితి హిమాలయాల మీదిగా పొనిస్తున్నపుడు జరిగితే.. 8 వేల అడుగులకు విమానాన్ని తీసుకురావడం సాధ్యం కాదు. ఈలోపు ఫ్లైట్ లో ఆక్సిజెన్ ఇబ్బంది ఎదురై మనుషులు చనిపోయే అవకాశం ఉంటుంది. అందుకే విమానాలను ఎప్పుడూ హిమాలయాల పైనుంచి పోనివ్వరు.


End of Article

You may also like