ఇండియా vs హాంకాంగ్ ఆసియా కప్ 2022: గేమ్ కు ఫిదా అయిన ఫ్యాన్స్…. మీమ్స్ ట్వీట్స్ తో హోరెత్తిన సోషల్ మీడియా……

ఇండియా vs హాంకాంగ్ ఆసియా కప్ 2022: గేమ్ కు ఫిదా అయిన ఫ్యాన్స్…. మీమ్స్ ట్వీట్స్ తో హోరెత్తిన సోషల్ మీడియా……

by Anudeep

Ads

టీమ్ ఇండియా ఎక్కడ యాక్షన్‌లో ఉంటుందో అక్కడ ఏదో ఒక సెన్సేషన్ ఉంటుంది.ప్రస్తుతం, భారతదేశం ఆసియా కప్‌లో పాల్గొంటున్న సందర్భం లో ఎప్పుడు టీమ్ ఇండియా మ్యాచ్ జరిగిన సోషల్ మీడియా అంతా మీమ్స్ మరియు ట్వీట్స్ తో మారుమోగుతోంది.

Video Advertisement

నిన్న జరిగిన ఇండియా వర్సెస్ హాంకాంగ్‌ మ్యాచ్‌ మొదట నుంచి నాటకీయంగా సాగినా….చివరకు టీమ్ ఇండియా తన ఖాతా లో ఇంకో విజయాన్ని నమోదు చేసుకుంది. దీనితో సంతోషించిన అభిమానులు మ్యాచ్ పై తమ భావాలను రకరకాల మీమ్స్ ద్వారా సోషల్ మీడియాలో పంచుకున్నారు.

#1)

గత కొద్దికాలం గా మీమ్స్ ….. తమ భావోద్వేగాలను అభిప్రాయాలను ,వ్యక్తీకరించడానికి అందరూ వాడుతున్న సామాజిక మాధ్యమంగా మారింది. సోషల్ మీడియాలో ఈమధ్య మీమ్స్ తమ అధిపత్యాన్ని చెలాయిస్తున్నాయి.

#2) 

#3) 

అన్ని రంగాలలో జరిగే సరికొత్త వార్తలపై మీమ్స్ విడుదలవ్వడం మనకు కొత్త ఏమీ కాదు. కానీ క్రీడల విషయానికి వచ్చేసరికి వాటిలో ఫ్రీక్వెన్సీ, ఇంటెన్సిటీ మరియు హ్యూమర్ ఇలా అన్ని ఒక రవ్వ ఎక్కువ మోతాదులోనే ఉంటున్నాయి. ఇక క్రికెట్ విషయానికొస్తే మనం అసలు చెప్పనవసరం లేదు…. తమకు నచ్చిన మరియు నచ్చని అంశాల పై మీమ్స్ చేసి ఆన్లైన్లోనే బంతాట ఆడుతున్నారు అభిమానులు.

#4) 

ఈ క్రమంలోనే నిన్న జరిగిన ఇండియా వర్సెస్ హాంకాంగ్‌ మ్యాచ్ పై అభిమానులు రకరకాల మీమ్స్ తో సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు. పైగా ఈ మ్యాచ్ తొలి పరుగు పూర్తి చేసిన వెంటనే అంతర్జాతీయ టి20 మ్యాచ్లలో 3500 పరుగులు చేసిన తొలి బ్యాట్స్‌మెన్‌గా రోహిత్ రికార్డు సృష్టించడం ఈ మ్యాచ్ కు ఇంకో హైలైట్ గా నిలిచింది

#5) 

నిన్న టాస్ ఓడిపోయిన భారత్ మొదట బ్యాటింగ్ చేపట్టింది. కోహ్లి 44 బంతుల్లో ఒక ఫోర్ మరియు మూడు భారీ సిక్సర్ల సహాయంతో 59 పరుగులు చేసి 31వ T20I హాఫ్ సెంచరీ సాధించాడు. కోహ్లీ తో జత కట్టిన సూర్యకుమార్ ఆరంభం నుంచి దూకుడుగా ఆడాడు. కేవలం 26 బంతుల్లో ఆరు ఫోర్లు మరియు ఆరు సిక్సర్ల సహాయంతో 68 పరుగులు చేశాడు.అతను చివరి ఓవర్‌లో నాలుగు సిక్సర్లు కొట్టి 26 పరుగులు చేసి భారత్ స్కోర్ బోర్డును పరిగెత్తించాడు.

#6) 

#7) 

#8) 

#9

#10

#11

#12

#13

#14

#15

#16

#17 

#18

#20

భారత్ నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది.లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో హాంకాంగ్ 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 152 పరుగులు మాత్రమే చేయగలిగింది. చివరికి భారత్ ఐదు వికెట్ల తేడాతో ఈ మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. ఈ విజయంతో ఫిదా అయిన ఫ్యాన్స్ తమ ఆనందాన్ని వినూత్నమైన , సృజనాత్మకమైన మీమ్స్ ద్వారా ప్రదర్శించారు. ఈ క్రమంలో సోషల్ మీడియా రకరకాల మీమ్స్ తో మరియు ట్వీట్స్ తో హోరెత్తుతోంది.


End of Article

You may also like