తెలుగులో ఇప్పుడు మల్టీ స్టారర్ ట్రెండ్ నడుస్తోంది.పలు క్రేజీ కాంబినేషన్ లు తెర మీదకి వస్తున్నాయి.గతంలో వెంకటేష్ మహేష్ ఇద్దరు ఈ ట్రెండ్ ను తిరిగి ప్రారంభించారు.తర్వాత వరస పెట్టి మంచి మంచి కాంబినేషన్స్ తెర మీదకు వచ్చాయి.
అయితే ఇప్పుడు మరో క్రేజీ మల్టీ స్టారర్ చిత్రానికి రంగం సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ప్రేమ ఇష్క్ కాదల్, సావిత్రి, సేనాపతి లాంటి సినిమాలతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న పవన్ సాధినేని తమిళ్, తెలుగు హీరోలతో మల్టీ స్టారర్ మూవీ చేయడానికి రెడీ అవుతున్నాడంట. రీసెంట్ గా దయ అనే వెబ్ సిరీస్ తో మరోసారి పవన్ సాదినేని సత్తా చాటాడు.

ఇప్పుడు కళ్యాణ్ రామ్, కోలీవుడ్ స్టార్ యాక్టర్ విజయ్ సేతుపతి కాంబోలో మల్టీ స్టారర్ మూవీ చేయడానికి రెడీ అవుతున్నాడు. డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ బ్యానర్ ఈ సినిమాని నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. సౌత్ లో ఈ ఇద్దరు హీరోలు కూడా రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ కి భిన్నంగా కొత్త కథలతో మూవీస్ చేసే ప్రయత్నం చేస్తుంటారు. అలాంటి వీరిద్దరితో మూవీ అంటే కచ్చితంగా తెలుగు, తమిళ్ భాషలలో మంచి ప్రాజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. త్వరలో ఈ సినిమాపై అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉందని టాలీవుడ్ సర్కిల్ లో వినిపిస్తోంది. మరి ఇది ఎంత వరకు కార్యరూపం దాల్చుతుందనేది వేచి చూడాలి.













అమర్ దీప్‌ని కొట్టిన తరువాతే అన్నపూర్ణ స్టుడియోస్ నుండి వెళ్తామని పబ్లిక్‌గా యూట్యూబ్ ఛానల్స్ తో చెప్పిన బిగ్ బాస్ పల్లవి ప్రశాంత్ అభిమానులు, అన్నట్టుగానే ఫినాలే షో ముగిసిన తరువాత అర్ధరాత్రి బయటికి వచ్చిన అమర్ దీప్ మరియు అతని కుటుంబం పై దాడి చేశారు. వారి కారుని కూడా ధ్వంసం చేశారు. కారులో ఉన్న అమర్ దీప్, తల్లి, అతని భార్య, ఫ్రెండ్ నరేష్ లొల్ల,డ్రైవర్ ను భయభ్రాంతులకు గురి చేశారు.
బూతులు తిడితూ, కారును అద్దాలను పగులగొట్టారు. అమర్ దీప్‌ని బయటకు లాగాడానికి ప్రయత్నం చేశారు. దాంతో అమర్ దీప్ తల్లి, భార్య తీవ్ర భయాందోళన పడ్డారు. అరగంట పాటు జరిగిన దాడిలో వదిలేయమని అమర్ తల్లి, ఫ్రెండ్ దండం పెట్టినా వినలేదు. కారుని ధ్వసం చేశారు. ఈ దాడిలో కారులో ఉన్న అమర్ దీప్‌కి, తల్లి, భార్యకి గాయాలు అయినట్టు తెలుస్తోంది. అమర్ దీప్ కారునే కాకుండా, గీతూ రాయల్, అశ్విని కార్లను, ఆర్టీసీ బస్సు, ఇతర వాహనాలను కూడా పగుల గొట్టారు. గీతూ రాయల్ ఈ విషయం పై కేసు పెట్టింది.
గీతూ, అశ్విని సోషల్ మీడియాలో దాడి గురించి పోస్ట్ చేశారు. అమర్ దీప్ పై జరిగిన దాడికి సంబంధించిన ఫోటోలు వీడియో నెట్టింట్లో వైరల్ గా మారాయి. వీటిని చూసినవారు ఎలక్షన్స్ టైమ్ లో కూడా ఇంత గొడవ అవలేదు కదా అని కామెంట్స్ చేస్తున్నారు. బిగ్ బాస్ పై సోషల్ మీడియాలో పలు మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి..

4.
5.
6.
7.
8.
ప్రజా భవన్‌గా వేదికగా ప్రజా దర్బార్ కార్యక్రమానికి ప్రజల నుండి భారీ స్పందన వస్తున్న విషయం తెలిసిందే. తమ సమస్యలను చెప్పుకోవడానికి శుక్రవారం నాడు భారీగా ప్రజలు తెల్లవారక ముందే ప్రజా భవన్‌కు వచ్చారు. దాంతో ఆ ప్రాంతం అంతా ట్రాఫిక్ జామ్ అయ్యింది. సమస్యలు విన్నవించుకోవడానికి వచ్చిన వారిలో మహిళా హోంగార్డు మామిడి పద్మ కూడా ఉన్నారు. గత ప్రభుత్వం ఉన్న సమయంలో తన ఉద్యోగం పోయిందని, దానిని తిరిగి ఇప్పించమని అడగడానికి ఆమె ప్రజా దర్బార్ కి వచ్చారు.
ఉద్యోగం పోవడంతో జీవనోపాధి లేకుండా పోయిందని, దాంతో కుటుంబ పోషణ కూడా భారమైందని, దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నందున తనకు మళ్లీ హోంగార్డు ఉద్యోగం ఇప్పించాలని ఆఫీసర్లను వేడుకుంటున్నారు. 2016లో తమ సమస్యలు పరిష్కరించాలని, ఉద్యోగానికి భద్రత ఏర్పరచాలనే డిమాండ్‌తో హోంగార్డులందరు స్ట్రైక్ చేశారు. వారిలో గోదావరిఖనికి చెందిన మామిడి పద్మ కూడా ధర్నాలో పాల్గొని గత ప్రభుత్వ విధానాన్ని విమర్శించారు. అందుకు ఆమె తన ఉద్యోగాన్ని కోల్పోయింది. భర్త వదిలేయడం, ఉద్యోగం పోవడంతో ముగ్గురు పిల్లలను పోషించడం ఆమెకు సమస్యగా మారింది. తన జాబ్ ను తిరిగి ఇప్పించమని సీపీ, డీజీపీ, హోంమినిస్టర్ ను వేడుకున్నారు.
మామిడి పద్మ 2009లో వేములవాడలో హోంగార్డుగా జాయిన్ అయ్యారు. రెండేళ్ళ తర్వాత కరీంనగర్, గోదావరిఖనికి ట్రాన్స్ఫర్ పైన వెళ్లారు. తమ జీతాలు పెంచడంతో పాటు, ప్రతినెలా జీతాలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ 7 ఏళ్ళ క్రితం ఇతర జిల్లాల నుండి వచ్చిన హోంగార్డులు గాంధీ ఆస్పత్రి దగ్గర ధర్నా చేశారు. దీనిలో పాల్గొన్నందుకు మామిడి పద్మ ఉద్యోగాన్ని కోల్పోవాల్సి వచ్చింది. తన బాధను చెప్పుకోవడానికి ప్రజాదర్బార్‌కు హాజరయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన ఉద్యోగాన్ని మళ్ళీ ఇప్పించాలని వేడుకున్నారు.