మలయాళం నుండి మరొక సినిమా తెలుగులో డబ్ అయ్యి విడుదల అయ్యింది. ఈ సినిమా పేరు కీచురాళ్ళు. రాహుల్ రాజి నాయర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, రజీషా విజయన్ హీరోయిన్ గా నటించారు. 2022 లో కీడమ్ అనే పేరుతో మలయాళం లో ఈ సినిమా విడుదల అయ్యింది. ఇప్పుడు ఈ సినిమాని తెలుగులో ఈటీవీ విన్ యాప్ లో కీచురాళ్ళు పేరుతో విడుదల చేశారు. ఇంక ఈ సినిమా కథ విషయానికి వస్తే, రాధిక (రజీషా విజయన్) ఒక సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్. పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఎన్నో విషయాల్లో కేస్ పరిష్కరించడానికి సహాయం చేస్తుంది. రాధిక తండ్రి ఒక లాయర్.

తర్వాత రాధికకి ఒక రోజు ఫ్రిడ్జ్ రిపేర్ రావడంతో ఒక అతనికి ఫోన్ చేస్తుంది. అతను మాట్లాడే మాటలు రాధికకి నచ్చవు. అందుకే ఫోన్ కట్ చేస్తుంది. కానీ ఆ వ్యక్తి మాత్రం రాధిక ఫోటోలు అన్నీ ఫేస్ బుక్ లో చూసి ఆమె వెనకాల పడటం మొదలు పెడతాడు. మెసేజెస్ పంపిస్తూ ఉంటాడు. కానీ అతను అందరూ అనుకున్నట్టుగా ఫ్రిడ్జ్ రిపేర్ చేసే వ్యక్తి కాదు. ఈ విషయాలన్నీ రాధిక ఎలా కనిపెట్టింది అనేది మిగిలిన కథ. కేవలం రాధిక అనే ఒక పాత్ర చుట్టూ సినిమా తిరుగుతుంది. ఇది ఒక ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా. ఈ సినిమాలో తన పాత్రలో అంతే బాగా నటించారు రజీషా విజయన్.
లొకేషన్స్ కూడా చాలా తక్కువగానే ఉంటాయి. ఈ కాలంలో జరిగే చాలా విషయాల మీద ఈ సినిమా ఫోకస్ చేస్తుంది. మధ్య మధ్యలో కొన్ని సీన్స్ సాగదీసినట్టు అనిపించినా కూడా సినిమా అంతా కూడా ఒకే విషయం మీద సాగుతుంది. దాంతో సినిమా చూసే వారికి తర్వాత ఏమవుతుంది అనేది తెలుసుకోవాలి అనిపిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమాకి చాలా మంచి స్పందన వస్తోంది. ఈ తరం వాళ్ళని ఉద్దేశించి ఈ సినిమా తీసినా కూడా కుటుంబం అంతా కలిసి చూసే విధంగా సినిమాని రూపొందించారు. అందుకే అందరూ చూసి ఈ సినిమా బాగుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఈ హీరో కోలీవుడ్ లో అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగారు. కంటెంట్‌కు చాలా ప్రాధాన్యత ఇస్తూ, కొత్త స్టోరీలకు మద్దతిస్తూ, కథ నచ్చితే ఆ క్యారెక్టర్ కోసం ఎలాంటి రిస్క్ చేయడానికైనా రెడీ అయ్యే తమిళ హీరో. రజినీ కాంత్ మరియు కమల్ హాసన్ లను కలిపితే ఆ హీరో అని అక్కడి ఆడియెన్స్ పిలుస్తారు. రీసెంట్ గా తెలుగులో హిట్ అందుకున్నాడు. హాలీవుడ్ సినిమాలో సైతం నటించాడు.
సౌత్, నార్త్ అనే తేడా లేకుండా సినిమాలలో నటిస్తూ ఆడియెన్స్ ని మెప్పిస్తున్నాడు. ఇప్పటికే ఆ హీరో ఎవరో అర్థమై ఉంటుంది. పై ఫొటోలో ఉన్న హీరో మరెవరో కాదు సౌత్ సూపర్ స్టార్ ధనుష్. సార్ మూవీతో టాలీవుడ్ లో విజయాన్ని అందుకున్న, ధనుష్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో మరో తెలుగు సినిమా చేయనున్నారు.
పాన్ ఇండియా సినిమా కెప్టెన్ మిల్లర్‌తో ఆడియెన్స్ ను పలకరించడానికి రెడీ అవుతున్నారు. ఈ మూవీ విడుదల కాకముందే మరో రెండు చిత్రాలను పట్టాలెక్కించారు. ఇటీవలే బాలీవుడ్ దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో హ్యాట్రిక్ సినిమాని ప్రకటించారు. అలాగే తన స్వీయ దర్శకత్వంలో 50వ చిత్రాన్ని కూడా ధనుష్ ప్రారంభించారు.







బాలకృష్ణ ఈ మూవీ షూటింగ్ విషయంలో సీనియర్ హీరోలైన కృష్ణ, కృష్ణంరాజులకు చెందిన పార్ట్ ను ముందుగా చేద్దామని చెప్పడంట. అయితే ఆ పార్ట్ షూటింగ్ అండమాన్ దీవుల్లో ప్లాన్ చేయడంతో కుటుంబాలతో ట్రిప్ లగా సరదాగా ఉంటుందని ముగ్గురు హీరోలు తమ ఫ్యామిలీలను తీసుకొని అండమాన్ కి వెళ్లారంట. అక్కడి లొకేషన్లు బాగున్నా, ఉండేందుకు రాజీవ్ గాంధీ గెస్ట్ హౌజ్ మాత్రమే ఉందంట. తప్పక అందులోనే అందరూ అడ్జస్ట్ అయ్యారంట. ఇక అక్కడ తినడానికి ఆహారం కూడా దొరికలేదంట. వెళ్లిన రోజు తమతో పాటు తీసుకెళ్లిన బిస్కేట్లు, చిరుతిండ్లతో గడిపారంట
మరుసటి రోజు ఎక్కడి నుండో రైస్, కూరగాయలు తెప్పించుకున్నారంట. వాటితో విజయ నిర్మలగారు అద్భుతంగా వంట చేయడంతో అందరు తిన్నారట. ఇక బాలయ్య చేపలని వేటాడీ తీసుకు రావడంతో విజయ నిర్మల వాటితో చేపల పులుసు చేసిందంట. ఆ చేపల పులుసు అద్భుతంగా ఉండడంతో మూవీ యూనిట్ అందరికి రుచి చూపించారంట. అందరు లొట్టలేసుకుంటూ తిన్నారట. దాంతో తెలుగు ఇండస్ట్రీలో విజయనిర్మల గారి చేపల పులుసు ఫేమస్ అయ్యింది.
Also Read: 

దుల్కర్ సల్మాన్ 2012లో ‘సెకండ్ షో’ అనే మలయాళ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అదే ఏడాది దుల్కర్ రెండవ సినిమా ‘ఉస్తాద్ హోటల్’ లో నటించాడు. ఈ చిత్రంలో నిత్యామీనన్ హీరోయిన్ గా నటించింది. అన్వర్ రషీద్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ఈ మూవీ 2012కి గాను మూడు జాతీయ అవార్డులు అందుకుంది. ‘బెస్ట్ పాపులర్ సినిమా , బెస్ట్ డైలాగ్స్, యాక్టర్ తిలకన్ కి ప్రత్యేక అవార్డు వచ్చింది. ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకుని, భారీ కలెక్షన్స్ సాధించి, కమర్షియల్ గా విజయం సాధించింది. ఈ మూవీని తెలుగులో ‘జనతాహోటల్’ గా డబ్ చేసి, 2018 లో రిలీజ్ చేశారు.
ఇక ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే, ఫైజల్ (దుల్కర్ సల్మాన్) నలుగురు ఆడపిల్లల తర్వాత పుట్టిన అబ్బాయి కావడంతో అతని తండ్రి, అక్కలు అల్లారుముద్దుగా పెంచుతారు. ఫైజల్ కి వంటలు చేయడం అంటే చాలా ఇష్టం. దాంతో తండ్రికి తెలియకుండా విదేశాల్లో హోటల్ మేనేజ్ మెంట్ చేశాడు. కానీ ఫైజల్ తండ్రి అతనితో స్టార్ హోటల్ పెట్టించాలని భావిస్తాడు. ఫైజల్ కి తండ్రి షహానా (నిత్యామీనన్)తో పెళ్ళిచూపులు ఏర్పాటుచేస్తాడు. ఆ సమయంలో ఫైజల్ హోటల్ మేనేజ్ మెంట్ గురించి బయటపడుతుంది.
దాంతో ఫైజల్ ను తండ్రి పాస్ పోర్ట్ తీసుకుని, ఇంట్లో నుంచి బయటికి పంపిస్తాడు. అప్పుడు ఫైజల్ తాతయ్య కరీంభాయ్ వద్దకు వెళ్ళి, ఆయన నడిపే “ఉస్తాద్ హోటల్”లో పనిచేస్తూ, డూప్లికేట్ పాస్ పోర్ట్ కు అప్లై చేసి, ఎదురుచూస్తుంటాడు. ఆ తరువాత తాత సహాయంతో బీచ్ బే అనే ఫైవ్ స్టార్ హోటల్ చెఫ్ గా జాయిన్ అవుతాడు. అక్కడ బీచ్ బే తమ హోటల్ ను విస్తరించడం కోసం “ఉస్తాద్ హోటల్”ను ఆక్రమించుకోబోతుందని తెలుసుకుంటాడు.
ఉస్తాద్ హోటల్ ను ఫైజల్ ఎలా కాపాడాడు ? తాత దగ్గర ఏం నేర్చుకుంటాడు ? చివరికి ఫైజల్ అనుకున్నట్టు విదేశాలకి వెళ్లాడా? లేదా అనేది మిగిలిన కథ. ఈ చిత్రంలో దుల్కర్ ఫైజల్ పాత్రలో ఒదిగిపోయారు. ఉస్తాద్ హోటల్ యాజమానిగా, ఫైజల్ తాతగా యాక్టర్ తిలకన్ జీవించారు. నిత్యామీనన్ తనదైన నటనతో ఆకట్టుకుంది. ఈ చిత్రం ప్రస్తుతం యూట్యూబ్ లో అందుబాటు ఉంది.