ఆరోజుల్లో సినిమా చూడాలంటే.. థియేటర్‌కు వెళ్లి గంటలు తరబడి వెయిట్ చేసి, టికెట్ తీసుకుని సినిమా చూసేవాళ్లం. కానీ ఇప్పుడు అంతా మారిపోయింది. మనకి నచ్చిన టైంకి, నచ్చిన ప్లేస్‌లో స్మార్ట్‌ఫోన్ నుంచి క్షణాల్లో టికెట్ బుక్ చేసుకుంటున్నాం. కొన్నిసార్లు సినిమాకి వెళ్లడానికి వీలుకాక లేదా కొన్ని కారణాల వల్ల టికెట్ రద్దు చేయాల్సి వస్తుంది. మరి ఇలా క్యాన్సల్ చేస్తే టికెట్ డబ్బులు తిరిగి వస్తాయా లేదా అని కొందరు ఆందోళన చెందుతారు. ఇకపై మీకు ఆందోళన వద్దు. ఎందుకంటే టికెట్‌ను క్యాన్సల్ చేసుకుని ఈజీగా మీ డబ్బును పొందవచ్చు.

బుక్‌మైషోలో టికెట్ క్యాన్సల్ ఇలా చేయండి
-BookMyShow యాప్‌ని మొబైల్లో ఓపెన్ చేయాలి.
-ప్రొఫైల్ ఐకాన్‌పై క్లిక్ చేసి, Your Orders అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
-టికెట్ లిస్ట్ స్క్రీన్‌పైన వస్తుంది.. ఇక్కడ మీరు బుక్ చేసిన టికెట్ సెలక్ట్ చేసుకోవాలి.
-తర్వాత బుకింగ్ రద్దు చేయు అనే ఆప్షన్ వస్తుంది. దీనిని క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేయాలి.
-రీఫండ్ చెల్లింపు పద్ధతి అనే ఆప్షన్ ఉంటుంది. తర్వాత వాపస్ అనే ఆప్షన్ ఉంటుంది. దీనిని ఎంచుకోవాలి. అంతే ఇంకా మీ రిఫండ్ వచ్చేస్తుంది.
బుక్‌మైషో వైబ్సైట్లో ఇలా చేయండి
-అధికార వైబ్‌సైట్ ఓపెన్ చేసి, ఖాతా లాగిన్ చేయండి.
-తర్వాత కుడివైపున ఉన్న ప్రొఫైల్‌ని ఓపెన్ చేయండి.
-ఇంతకు ముందు ఉన్న టికెట్ కొనుగోలు లిస్ట్‌ను ఓపెన్ చేసి, టికెట్‌పై క్లిక్ చేయండి.
-స్క్రీన్‌పైకి స్క్రోల్ చేసి, టికెట్ రద్దు చేయు అనే ఆప్షన్ క్లిక్ చేయాలి.
-వాపస్ పద్ధతిని సెలక్ట్ చేసి, ధృవీకరించుపైన క్లిక్ చేస్తే అమౌంట్ రిఫండ్ వస్తుంది.
గమనిక: కానీ కొన్నిసార్లు ఈ వైబ్‌సైట్ పనిచేయకపోవచ్చు.

సూపర్ స్టార్ కస్టమర్ టికెట్లో ఎలా రద్దు చేయాలంటే?
BookMyShow సూపర్ స్టార్ కస్టమర్లకు ఎక్స్ట్రా బోనస్‌ను ఇస్తుంది. అదే ఏంటంటే? సూపర్ స్టార్ కస్టమర్ అయితే, టికెట్ కోసం పే చేసిన అమౌంట్ అంతా కూడా తిరిగి పొందుతారు. బుక్‌మైషో నుంచి సంవత్సరంలోపు 10కంటే ఎక్కువ టికెట్లు బుక్ చేస్తే వాళ్లను సూపర్ స్టార్ కస్టమర్ అంటారు. మరి ఈ సూపర్ స్టార్ కస్టమర్ తన టికెట్‌ను ఎలా క్యాన్సల్ చేయాలో తెలుసుకుందాం.
-బుక్‌మైషో యాప్ ఓపెన్ చేసి తర్వాత ప్రొఫైల్లోకి వెళ్లి టికెట్ ఆర్డర్ల ఎంపికపై క్లిక్ చేయాలి.
-టికెట్‌ను ఎంచుకుని సూపర్‌స్టార్ టికెట్ క్యాన్సల్పై క్లిక్ చేయాలి.
-వాపస్ పొందే ఆప్షన్‌పై క్లిక్ చేసి, టికెట్ క్యాన్సల్ను నిర్ధారించండి. అంతే ఇక మీరు ఇచ్చిన అకౌంట్లోకి డబ్బు జమ అవుతుంది.

ఇవి గుర్తుంచుకోండి BookMyShowలో టికెట్ క్యాన్సల్ చేయడానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. టికెట్‌ను క్యాన్సల్ చేయాలంటే సినిమా 4గంటలు ముందే చేయాలి. లేకపోతే టికెట్లో 30% తీసి, మిగిలిన అమౌంట్ మీ అకౌంట్లోకి జమ అవుతుంది. అదే రిఫండ్ అమౌంట్ క్రెడిట్, డెబిట్ కార్డు లేదా నెట్ బ్యాకింగ్ పద్ధతిని ఎంచుకుంటే 7 నుంచి 10 రోజుల సమయం పడుతుంది. అదే బుక్‌మైషో వాలెట్‌కు కావాలని రిక్వెస్ట్ పెట్టుకుంటే కొన్నిగంటల్లోనే వాలెట్‌కి డబ్బు జమ అవుతుంది.




ఇంటి వద్ద మనం బీపీ చెక్ చేసుకుని ముందు టీ, కాఫీలు తీసుకోకూడదు .అలాగే సిగరెట్ గాని,మద్యం గాని సేవించకూడదు. దాని కన్నా ముఖ్యంగా బీపీ చెక్ చేసుకునే ముందు యూరిన్ అనేది కంప్లీట్ గా వెళ్లిపోవాలి. బాగా ప్రశాంతంగా ఉన్నప్పుడే బీపీని చెక్ చేసుకోవాలి.




అతను తన పరిశోధనలో ఆ బృందాన్ని కిడ్నాప్ చేసింది పదేళ్లు క్రితం చనిపోయిన బిగ్ డాడీ (శివరాజ్ కుమార్) అని తెలుసుకుంటాడు. అసలు ఇంతకీ బిగ్ డాడీ ఎవరు? అతను జైల్లో ఉండగానే వామన్ ను ఎందుకు లక్ష్యం చేసుకోవాలనుకుంటాడు? ఆ జైల్లో ఉన్న 1000 కేజీల బంగారం కధ ఏంటి? పితామహా ఏజెన్సీలో ఉన్న ఘోస్ట్ కు బిగ్ డాడీ కి సంబంధం ఏంటి? వీరిద్దరూ ఒకటేనా అనేది సినిమా చూసి తెలుసుకోవాలి…!ఇది ఒక రొటీన్ గ్యాంగ్‌స్టర్ డ్రామా…! ఎలివేషన్ లు, మాస్ ఎలిమెంట్స్ ను నమ్ముకుని చేసిన సినిమా కాకపోతే లాస్ట్ లో స్పై టచ్ ఇచ్చి ఆసక్తి రేపించారు.






భక్తి టీవీలో ప్రసారం అవుతున్న ధర్మ సందేహాలు కార్యక్రమంలో తల్లితండ్రులు పెట్టిన శాపనార్ధాల ఫలిస్తాయా అని ఒకరు అడిగిన సందేహానికి డాక్టర్ శ్రీ మైలవరపు శ్రీనివాసరావుగారు ఇలా సమాధానం చెప్పుకొచ్చారు. “జ్ఞానంతో తిట్టినా, అజ్ఞానంతో తిట్టినప్పటికి ఆ వాక్కు ఫలిస్తుంది. అందువల్లనే పాతకాలంలో అమ్మమ్మలు, బామ్మలు వంటివారి నోటి నుండి ఒక్కమాట కూడా అపశబ్ధం వచ్చేది కాదు.
కోపం వచ్చినప్పుడు ఏం మాట్లాడుతున్నామో తెలియదు. ఏం చేస్తున్నామో తెలియదు. ఎవరిని తిడుతున్నామో కూడా తెలియదు. ఎవరిని శపించే స్థాయికి వాక్కు వెళ్తుందో మనసుకు, బుద్ధికి తెలియదు. సాధారణంగా తల్లి దండ్రులు పిల్లల ప్రవర్తన పై కోపం వచ్చినపుడు తిడుతూ, శాపనార్ధాలు పెడుతుంటారు. అయితే ఏ తల్లి దండ్రులు కూడా తమ పిలల్లని మనస్పూర్తిగా దూషించరు, శపించరు. కోపంలో పిల్లలను, తిట్టడం, శపించడం అనేది జరుగుతుంటుంది. అవి మనస్పూర్తిగా వచ్చినవి కానప్పటికీ, ఆ తిట్లు, శాపనార్ధాలు ఫలిస్తాయని చెప్పుకొచ్చారు.
వాస్తవంగా పిల్లలు తప్పు చేసినపుడు ఎప్పుడు కూడా మందలించాలి. కోపంతో కళ్ళతో మందలించాలి. అవసరం అయితే చిన్నపాటి దెబ్బ వేసి మందలించాలి. అది తప్పు కాదు కానీ, నోటితో మాత్రం పిల్లలను ఏమి అనకూడదు. ఎంత కోపం వున్నప్పటికీ, నోటితో మాత్రం తిట్టడం, శపించడం లాంటివి చేయకూడదు. వాక్కు ఆత్మశక్తి ద్వారా ప్రచోదితం అయ్యి బయటికి వస్తుంది. కాబట్టి ఫలించే అవకాశం ఉంటుంది”. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను చూడండి..







