ఇండియాకి చెందిన నూరుల్ హాసన్ గొప్ప ఆర్టిస్ట్. కొన్ని నెలల క్రితం అమెరికాకు చెందిన ఒక ఆర్టిస్ట్ ఒకేసారి మెస్సీ మరియు డోనాల్డో ఫోటోలను డ్రా చేసి, తన యొక్క యూట్యూబ్ ఛానెల్ లో షేర్ చేశాడు. ఆ యూట్యూబ్ వీడియో క్రింద కామెంట్ సెక్షన్ లో నూరుల్ హాసన్ సార్ నేను కూడా ఇలా డ్రా చేయగలను అని కామెంట్ చేశాడు.
అయితే నూరుల్ కామెంట్ చూసిన వేరొక వ్యక్తి ‘యూ బ్లెడి ఇండియన్స్’ ఇలా చేయడం మీ వల్ల కాదు అంటూ కామెంట్ పెట్టాడు. ఇండియన్స్ తిట్టడం, తక్కువ చేసి మాట్లాడం నచ్చని నూరుల్ హాసన్ చాలా బాధ పడ్డాడు. ఆ తరువాత ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఒకేసారి నలుగురి ఫోటోలను (అబ్దుల్ కలాం, భగత్ సింగ్, సోను సూద్, విక్రమ్ బాత్రా) డ్రా చేసి, తన టాలెంట్ ఏమిటో చూపించాడు.
ఈ ‘ఇండియన్ రియల్ లైఫ్ హీరోస్’ స్కెచ్ వర్క్ వీడియోని రియల్ హీరో సోనుసూద్ 2021లో ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఒక కళాకారుడు తనను రియల్ లైఫ్ హీరోలతో కలిపి డ్రా చేసినందుకు సోనూ సూద్ గర్వంగా భావించాడు. ఈ పోస్ట్‌ను షేర్ చేస్తున్నప్పుడు, ‘నా అవార్డు’ అని క్యాప్షన్ కూడా ఇచ్చాడు. ఆ తరువాత నూరుల్ హాసన్ ఒకేసారి ఐదుగురి ఫోటోలను డ్రా చేసి, వరల్డ్ రికార్డుని సృష్టించారు.
ఈ గొప్ప ఇండియన్ ఆర్టిస్ట్ ‘నూరుల్ ఆర్ట్’ పేరుతో సోషల్ మీడియా వేదికలు అయిన ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్ లో తాను గీసిన చిత్రాలకు సంబంధించి వీడియోలను షేర్ చేస్తుంటాడు. అంతే కాకుండా అతనికి ఒక యూట్యూబ్ ఛానెల్ కూడా ఉంది. ఆ ఛానెల్ పేరు కూడా నూరుల్ ఆర్ట్. అతని ఛానెల్ కు వేలమంది సబ్స్క్రైబర్లు ఉన్నారు.
https://www.instagram.com/p/CWGdELghV_G/
Also Read: “యశస్వి జైస్వాల్” ని ఇంటర్వ్యూ చేసిన ఈ అమ్మాయి ఎవరో తెలుసా..?

ఉత్తర్‌ప్రదేశ్ కేడర్ 2011 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ ఆఫీసర్ అభిషేక్ సింగ్ నటన మీద ఉన్న ఇష్టంతో సంచలన నిర్ణయం తీసుకుని, ఉద్యోగానికి రిజైన్ చేశారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులు కూడా ధ్రువీకరించారు. అభిషేక్ సింగ్‌కు యాక్టింగ్, మోడలింగ్ అంటే చాలా ఆసక్తి ఉండడంతో ఒక వైపు ఐఏఎస్ అధికారిగా ఢిల్లీ సచివాలయంలో ముఖ్యమైనహోదాలో కొనసాగారు. మరో వైపు తనకు ఇష్టం అయిన నటన, మోడలింగ్ రంగాలలో రాణించారు.
అభిషేక్ సింగ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అయిన ‘ఢిల్లీ క్రైమ్ సీజన్- 2’ లో ఇన్వెస్టిగేషన్ అధికారి క్యారెక్టర్ లో నటించి. మంచి గుర్తింపును తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఓటీటీలలో మంచి యాక్టర్ గా పేరు తెచ్చుకుంటూ, మోడల్ గా ఆకట్టుకుంటున్నారు. అభిషేక్ సింగ్ మొదటిసారి నటించిన షాట్ ఫిలిం ‘చార్ పండ్రా’. దీనిని టీ సిరీస్ సంస్థ రూపొందించింది.
ఈ సాంగ్ లో అభిషేక్ ప్రేమికుడిగా అద్భుతంగా నటించి, మెప్పించాడు. ఐఏఎస్ ఆఫీసర్ అయినప్పటికీ ఒక యాక్టర్ గా అద్భుత నటనను కనబరిచినందుకు ఆడియెన్స్ ఆయన నటనకు ఫిదా అయ్యారు. ఈ సాంగ్ రిలీజ్ అయిన 4 రోజులకే యూట్యూబ్ లో ట్రెండింగ్ గా మారింది. ఇక ఇప్పటి వరకు ఆ సాంగ్ కు యూట్యూబ్ లో 560 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అభిషేక్ సింగ్ కు ఇన్స్టాగ్రామ్ లో ఐదు మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.
మానసిక చికిత్స పొందుతున్న ఆ మహిళతో సాన్నిహిత్యం ఏర్పడడంతో ప్రమీల ఆమె గురించి అడిగింది. అప్పుడు సదరు మహిళ తాను మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాకు చెందినట్టుగా, తనకు ఇద్దరు కుమారులు ఉన్నారని తెలిపింది. మూడు సంవత్సరాల క్రితం తాను ఎక్కాల్సిన రైలు కాకుండా వేరే రైలులో ఎక్కానని చెప్పారు. ఆమెకు తన కుటుంబ సభ్యులను సంప్రదించడానికి వివరాలు కూడా లేకపోవడంతో పుదుక్కోట్టైలో చిక్కుకుపోయానని ఆ మహిళ చెప్పింది.
వివరాలు తెలుసుకున్న ఆ మెడికల్ స్టూడెంట్ ఆ మహికు సహాయం చేయాలని నిర్ణయించుకుంది. ఆ మహిళ ఫొటోను మరియు వివరాలను సోషల్ మీడియా వేదిక ఎక్స్ లో పోస్ట్ చేసింది. ఆ పోస్ట్ వైరల్ కావడంతో ఆ మహిళ పేషెంట్ స్నేహితురాలికి ఆ పోస్ట్ కనిపించింది. స్నేహితురాలు వెంటనే వీడియో కాల్ చేసి మహిళతో మాట్లాడింది. గత శుక్రవారం ఆ మహిళను ఆమె భర్తతో మాట్లాడించారు.
వీడియో కాల్ తర్వాత, మహిళ కుటుంబం తరువాతి రోజు శనివారం ఆమెను కలవడానికి పుదుక్కోట్టైకి వచ్చింది. ఆ మహిళ తప్పిపోయినపుడు ఆమె కుటుంబసభ్యులు లోకల్ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు పెట్టారు. కానీ ఆ మహిళ ఆచూకీ దొరకలేదు. దాంతో ఆమె మరణించి ఉంటుందని అనుకున్నారు. మానసిక చికిత్స వల్ల మహిళ పరిస్థితి మెరుగుపడిన తరువాత ఆమెకు తన వివరాలు గుర్తుకు వచ్చాయి. ఒక్క పోస్ట్ వల్ల మూడు సంవత్సరాల తర్వాత తన కుటుంబాన్ని కలుసుకుంది.
ఇండియన్ క్రికెటర్ యశస్వీ జైస్వాల్ ని ఇంటర్వ్యూ చేసిన యాంకర్ పేరు గరిమా భరద్వాజ్. ఆమె ప్రముఖ జర్నలిస్ట్ మరియు న్యూస్ యాంకర్. యశస్వి జైస్వాల్ ను ఇంటర్వ్యూ చేసిన తర్వాత గరిమా వైరల్‌గా మారింది. దాంతో ఆమె ఎవరా అని నెట్టింట్లో వెతుకుతున్నారు. ఆమె ప్రస్తుతం ‘ది లలన్‌టాప్’ అనే పాపులర్ షోలో పని చేస్తుంది.
ఆమె సక్సెస్ ఫుల్ స్పోర్ట్స్ జర్నలిస్ట్. అంతకు ముందు దైనిక్ జాగరణ్, పాఠక్ పత్రిక, ఇండియా న్యూస్‌లతో పాటు అనేక మీడియా సంస్థలకు పనిచేసింది. గరిమా భరద్వాజ్ 1998లో ఢిల్లీలో జన్మించింది. అక్కడే పెరిగింది. ప్రస్తుతం ఆమె వయసు 25 సంవత్సరాలు. ఆమె మోతీ రామ్ మెమోరియల్ గ్రిల్స్ సీనియర్ స్కూల్ లో ప్రాధమిక విద్యను పూర్తిచేశారు. ఆ తర్వాత ఆమె బాచిలర్స్ ఇన్ జర్నలిజంని గురు గోవింద్ సింగ్ ఇంద్రప్రస్థ యూనివర్సిటీలో చేశారు. ఆ తర్వాత జర్నలిజం రంగంలోకి అడుగుపెట్టింది.
డిల్లీలో నివసిస్తున్న గరిమా భరద్వాజ్ 2021 ఆగస్ట్ నుండి ‘ది లలన్‌టాప్’ లో సబ్ ఎడిటర్ గా పనిచేస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే గరిమా భరద్వాజ్ యశస్వీ జైస్వాల్ ను ఇంటర్వ్యూ చేసిన వీడియో వైరల్ అయిన తర్వాత ఆమె ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్లు ఒక్కసారిగా పెరిగారు. ప్రస్తుతం ఆమెను 50 వేలకు పైగా ఫాలో అవుతున్నారు.
ఎనిమిదేళ్ల చిన్నారి తన నాన్న పై కోపం రావడంతో అతన్ని అమ్మడం కోసం “ఫాదర్ ఆన్ సేల్” నోటీసును వారి ఇంటి డోర్ మీద అంటించింది. ఆ నోటీసులో “తన నాన్నను రెండు లక్షలకు కొనుక్కోవచ్చని, మరిన్ని వివరాల కోసం డోర్ బెల్ కొట్టాలని” చిన్నారి పేర్కొంది.
ఈ నోటీసును చూసిన ఆ చిన్నారి తండ్రి సోషల్ మీడియా వేదిక ఎక్స్ లో పోస్ట్ చేసారు. అందులో తన విలువ అంత తక్కువ కాదని రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ నోటీస్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇక ఎనిమిదేళ్ల పాప తన నాన్నని రెండు లక్షల రూపాయలకు అమ్ముతున్నట్లు రాసిన నోటీసును ఇంటి బయట పెట్టటం చూసి నెటిజెన్లు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఫన్నీ ఎమోజీలు పెడుతున్నారు.
కొందరు నెటిజెన్లు తండ్రిని అమ్మకానికి పెట్టిన ఎనిమిదేళ్ల చిన్నారి తెలివితేటలకి వివిధ రకాల కామెంట్లు, రియాక్షన్స్ ఇస్తున్నారు. పలువురు నెటిజన్లు చేసిన ఫన్నీ కామెంట్లలో కొన్నిటికి ఆ చిన్నారి తండ్రి సమాధానం కూడా ఇచ్చారు. ఈ రోజు సోషల్ మీడియాలో తాను చూసిన హాస్యాస్పదమైన విషయం ఇదే అని ఒక నెటిజెన్ కామెంట్ చేశారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఈ పోస్ట్ పై స్పందిస్తున్నారు. ఇప్పటి వరకు ఎక్స్ లో ఈ పోస్ట్ ని 29 వేల మందికి పైగా చూశారు. వందల మంది నెటిజెన్లు ఈ పోస్ట్ ను లైక్ చేశారు.
మిర్చి, జనతా గ్యారేజ్, శ్రీమంతుడు, భారత్ అనే నేను వంటి కమర్షియల్ బ్లాక్ బస్టర్స్ సినిమాలను తెరకెక్కించిన సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా, కీలక పాత్రలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్నారంటే అటు మెగా ఫ్యాన్స్, ఇటు ఇండస్ట్రీలో రికార్డ్స్ క్రియేట్ చేయడం ఖాయం అని అనుకున్నారు. కొరటాల ఈ మూవీ కోసం ధర్మస్థలి అనే కొత్త ప్రపంచాన్ని కూడా సృష్టించారు.
ఈ మూవీ 2022 మే 20న భారీ అంచనాల మధ్య, గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. అయితే ఫస్ట్ షోతోనే ఈ మూవీ నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. నెటిజెన్లు ఈ మూవీని, దర్శకుడు కొరటాల శివను విపరీతంగా ట్రోల్ చేశారు. చిరంజీవి కెరీర్ లోనే మైనస్ అనే టాక్ కూడా వచ్చింది. బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అవడంతో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు తీవ్రంగా నష్టపోయారు. అప్పట్లో అది కూడా పెద్ద చర్చకు దారి తీసింది.
ఈ మూవీలో చిరంజీవి ఆచార్య అనే నక్సల్ నాయకుడుగా నటించాడు. ఆచార్య కార్పెంటర్ వేషంలో ధర్మస్థలికి వస్తాడు. అయితే అక్కడికి ఎళ్లిన తరువాత కొందరు గుడి ముందు తాగుతూ ఉంటే, హీరో గుడి ముందు ఇలాంటివి చెయ్యడం తప్పు అని చెబుతాడు. ఆ ఊరు అంతా గుడిలో పూజలు చేస్తారు. అయితే ఆ తరువాత నిమిషంలో హీరోనే సానా కష్టం వచ్చిందే అని ఐటెం సాంగ్ లో డాన్స్ చేస్తాడు. మరి హీరో చెప్పిన రూల్స్ ను ఆయనే పాటించరా అని నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు.
కన్నడ స్టార్ రక్షిత్ శెట్టి ‘ఛార్లీ’ సినిమాతో తెలుగు ఆడియెన్స్ చేరువయ్యాడు. అంతకుముందు అతడే శ్రీమన్నారాయణ మూవీతో పరిచయం అయ్యాడు. ఈ సినిమాలు మంచి కలెక్షన్స్ సాధించాయి. ఇక కన్నడ ఇండస్ట్రీలో భారీగా కలెక్షన్స్ సాధించి, లాభాలను అందించాయి. సప్త సాగరదాచే ఎల్లో మూవీ సెప్టెంబర్ 1న రిలీజ్ అయ్యి, సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.
రక్షిత్ శెట్టి నటించిన ఈ సినిమాను ‘సప్త సాగరాలు దాటి’ అనే టైటిల్ తో సెప్టెంబర్ 22న తెలుగులో రిలీజ్ చేశారు. ఈ మూవీ తెలుగులో మొదటి రోజు మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీకి రివ్యూలు కూడా పాజిటివ్ గా వచ్చాయి. అయితే దాదాపు ఇదే స్టోరీ లైన్ తో రిలీజ్ అయిన మాస్ మహారాజ రవితేజ మూవీ మాత్రం ఫ్లాప్ అయ్యింది. హరీష్ శంకర్ తొలి సారి దర్శకత్వం వహించిన షాక్ మూవీలో రవితేజ, జ్యోతిక జంటగా నటించారు.
ఈ సినిమాని రామ్ గోపాల్ వర్మ నిర్మించారు. ఈ మూవీ 2006 లో రిలీజ్ అయ్యింది. ఈ మూవీలో కూడా హీరో జైలుకి వెళ్తాడు. నెట్టింట్లో అదే కాన్సెప్ట్ తో వచ్చిన తెలుగు సినిమాని ఫ్లాప్ చేసి, డబ్బింగ్ సినిమాని మాత్రం సూపర్ హిట్ చేసారు అంటూ నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు.
విజయ్ సేతుపతి, ఐశ్వర్య రాజేష్ జంటగా నటించిన తమిళ సినిమా “కా పే రణసింగం”. ఈ మూవీని దర్శకుడు పి.విరుమాండి తెరకెక్కించారు. ఈ మూవీ కోలీవుడ్ లో 2020లో అక్టోబర్ 2న రిలీజ్ అయ్యింది. అక్కడ విజయం సాధించడంతో ‘వైఫ్ ఆఫ్ రణసింగం’ టైటిల్ తో తెలుగులో డబ్ చేసి, 2020లో రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ మూవీ ప్రముఖ ఓటీటీ జీ5 లో అందుబాటులో ఉంది.
ఇక కథ విషయానికి వస్తే, ఒక చిన్న గ్రామంలో నివసించే రణసింగం(విజయ్ సేతుపతి) కి విప్లవ భావాలు అధికంగా ఉంటాయి. గ్రామంలో ఏలాంటి సమస్య వచ్చినా కూడా రణసింగం ముందుండి పోరాడుతాడు. అతని మంచితనం నచ్చడంతో సీత (ఐశ్యర్వ రాజేష్) ప్రేమిస్తుంది. ఆ తర్వాత వారిద్దరి వివాహం జరుగుతుంది. వారికి పాప పుట్టిన తర్వాత రణసింగం దుబాయ్ కి జాబ్ కోసం వెళ్తాడు.
అయితే అక్కడ రణసింగం పనిచేసే ఫ్యాక్టరీలో జరిగిన గొడవల కారణంగా రణసింగం మరణించాడని చెప్తారు. రణసింగం మృతదేహాన్ని ఇండియాకి రప్పించడం కోసం చేసిన ప్రయత్నం ఫలించదు. ఆ తరువాత సీత ఎలా పోరాడింది? చివరికి ఏం జరిగింది? అనేది మిగతా కథ. నటన విషయానికి వస్తే విజయ్ సేతుపతి కనిపించింది కాసేపే అయినా ఎప్పటిలానే రణసింగం పాత్రలో ఒదిగిపోయాడు. ఈ మూవీలో ముఖ్యమైన పాత్ర ఐశ్యర్వ రాజేష్ ది. ఆమె అద్భుతంగా నటించింది.
అయితే, కేసీఆర్ కన్నా ముందు నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ, ఇందిరా గాంధీ, ఎన్టీఆర్ వంటి చాలా మంది నాయకులు రెండు స్థానాల నుంచి పోటీ చేశారు. అయితే ఇలా పోటీ చేయవచ్చా ఆనే విషయం పై ఎన్నికల కమిషన్ 2018లో సుప్రీంకోర్టులో వాదన వినిపించింది. సెక్షన్ 33(7)ను సవరించి ఒక అభ్యర్థి ఒక స్థానం నుండి మాత్రమే పోటీ చేసేలా రూల్స్ ను మార్చాలని, అది కుదరకపోతే రెండు స్థానాల నుంచి పోటీ చేసిన అభ్యర్థి రెండు చోట్ల గెలిస్తే, వారు వదులుకున్న నియోజకవర్గానికి జరిగే బై ఎలెక్షన్స్ ఖర్చును వారే భరించాలని ప్రతిపాదించింది.
ఇక అసెంబ్లీ నియోజకవర్గానికి ఐదు లక్షలు, లోక్ సభ నియోజకవర్గానికి పది లక్షలు ఖర్చు భరించాలని ఎలెక్షన్ కమిషన్ ప్రతిపాదించింది. సెక్షన్ 33(7) ప్రకారం ఒక అభ్యర్థి రెండు నియోజవర్గాల నుంచి ఒకేసారి పోటీ చేయవచ్చు. దీనిని 1996లో చట్ట సవరణ ద్వారా కలిపారు. 1996కి ముందు ఎలెక్షన్స్ లో అభ్యర్థులు ఒకేసారి ఎన్ని స్థానాల నుంచైనా పోటీ చేసే అవకాశం ఉండేది. ఈ సవరణ తరువాత 2 స్థానాలకు పరిమితం చేశారు.
ప్రొడ్యూసర్ ఎంఎం రత్నం కుమారుడు రవికృష్ణ, సోనియా అగర్వాల్ హీరో హీరోయిన్లుగా నటించిన మూవీ 7/జి బృందావన్ కాలనీ. ఈ సినిమాని ప్రముఖ ప్రొడ్యూసర్ ఎంఎం రత్నం నిర్మించారు. ఈ మూవీని తెలుగు, తమిళంలో ఒకేసారి రిలీజ్ చేశారు. రెండు చోట్ల ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది.
ఈ సినిమాకి సంగీతం ఇళయరాజా తనయుడు యువన్ శంకర్ రాజా అందించారు. ఈ మూవీలోని సాంగ్స్ ఇప్పటికీ ప్రేక్షకులను ఫిదా చేస్తాయి. ఇటీవలే ఈ మూవీ రీరిలీజ్ అయ్యింది. రీరిలీజ్ లో కూడా ఈ మూవీకి ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. దానికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
అయితే తాజాగా ఈ మూవీలో ఒక సీన్ కు సంబంధించిన తెలుగు మరియు తమిళం వీడియోలను ఒక యూజర్ ఇన్ స్టాలో పోస్ట్ చేస్తూ, వీటిలో ఏ వర్షెన్ నచ్చింది అంటూ అడిగారు. తమిళ్ సీన్ లో తండ్రి హీరోతో ఎమోషనల్ గా చెప్తాడు. అయితే తెలుగు సీన్ లో తండ్రి ఫ్రస్టేషన్ తో చెప్తాడు. ఈ రెండింటిలో తెలుగులోనే తండ్రిగా సహజంగా నటించారని నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు. తండ్రి పాత్రలో చంద్ర మోహన్ చాలా సహజంగా చేశారని కామెంట్స్ చేస్తున్నారు.