టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ ఏపీలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. కోర్టు ఆయనకి రిమాండ్ విధించగా రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించారు. గత నాలుగు రోజులుగా ఏపీలో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. పలువురు రాజకీయ నాయకులు చంద్రబాబు అరెస్ట్ ను ఖండించారు.
ఇతర రాష్ట్రాల రాజకీయ నాయకులు కూడా స్పందిస్తున్నారు. అయితే తెలుగు ఇండస్ట్రీ నుండి అంతగా స్పందించడం లేదు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, ప్రొడ్యూసర్ అశ్వనీదత్, నట్టి కుమార్ లాంటివారు స్పందించారు. తాజాగా నటి పూనమ్ కౌర్ చంద్రబాబు అరెస్ట్ పై ట్వీట్ చేయగా అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో చంద్రబాబును అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు కక్షపూరితంగా మాజీ సీఎం చంద్రబాబును అరెస్ట్ చేశారని కామెంట్లు చేశారు. నందమూరి కుంటుంబం కూడా చందబాబు అరెస్ట్ ను ఖండించింది. తాజాగా నటి పూనమ్ కౌర్ చంద్రబాబుకు అనుకూలంగా ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది.
పూనమ్ కౌర్ “మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుగారు ప్రజల కోసం చాలా సేవ చేశారని, వారి కొరకు అన్నీ త్యాగం చేసిన గొప్ప మనిషి అని, అలాంటి చంద్రబాబు నాయుడిని 73 ఏళ్ల వయస్సులో జైలుకు పంపించడం, బాధ పెట్టడం సరికాదని చెప్పుకొచ్చారు. చంద్రబాబునాయుడు సార్ ఆరోగ్యాన్ని పరిగణలోకి తీసుకోవాలని మానవతా దృక్పథంతో విజ్ఞప్తి చేస్తున్నాను.” అని ట్వీట్ లో రాసుకొచ్చారు.
పూనమ్ ట్వీట్ నెట్టింట్లో వైరల్ గా మారడంతో నెటిజన్లు ఈ ట్వీట్ పై కామెంట్స్ చేస్తున్నారు. కొందరు పాజిటివ్ గా కామెంట్స్ చేస్తుండగా, కొందరు నెటిజన్లు నెగిటివ్ గా కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు సటైర్స్ వేస్తున్నారు. పూనమ్ కౌర్ ఫ్యాన్స్ మాత్రం వివాదాల్లో ఇరుక్కోవద్దని సలహాలు ఇస్తున్నారు. ఈ ట్వీట్ నెట్టింట్లో హాట్ టాపిక్ గా మారింది.
Also Read: “జైలర్” సినిమాలో ఈ సీన్ గమనించారా..? చూసుకోవాలి కదా రజినీకాంత్ గారూ..?




రజినీకాంత్ , రమ్యకృష్ణ, తమన్నా, వసంత్ రవి, సునీల్ నటించిన జైలర్ మూవీలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, కన్నడ మెగాస్టార్ శివరాజ్ కుమార్, బాలీవుడ్ యాక్టర్ జాకీష్రాఫ్ అతిథి పాత్రలలో నటించారు. ఈ మూవీ తమిళ, తెలుగు బాషలలో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. తెలుగులో మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించి, లాభాలను కురిపించింది. చాలా కాలంగా హిట్ కోసం ఎదురు చూస్తున్న, సూపర్ స్టార్ రజినీకాంత్ కు, నెలన్స్ దిలీప్ కుమర్ కు ఈ మూవీ ఊహించని విజయాన్ని ఇచ్చింది.
థియేటర్లలో బ్లాక్ బస్టర్ అయిన జైలర్ మూవీ రీసెంట్ గా ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చింది. అక్కడ కూడా రికార్డ్స్ క్రియట్ చేస్తోంది. అయితే ఓటీటీ లో పలుమార్లు ఈ మూవీని చూసిన నెటిజెన్లు ఈ చిత్రంలోని మిస్టేక్స్ ను గమనించారు. వాటిని సోషల్ మీడియాలో మీమ్స్ రూపంలో షేర్ చేస్తున్నారు. మూవీ లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో రజినీకాంత్ జైలర్ గా ఉంటాడు. ఆ సమయంలో ఒక ఖైదీ నేను ఏపీ నుండి వచ్చా, ఒక ఫోన్ కొడ్తే చాలు నీ అంతు చూస్తారని రజినీకాంత్ తో అంటాడు.
నాకు చాలా పెద్ద కాంటాక్స్ ఉన్నాయని అంటాడు. దాంతో రజినికాంత్ ఫోన్ ఇచ్చి, కాల్ చేయమని చెప్తాడు. అప్పుడు ఆ ఖైదీ తన మనుషులకి కాల్ చేసాడు. కానీ హీరో వారి కారులో బాంబు పెట్టి పేల్చేస్తాడు. ఆ విషయం తెలిసి ఆ ఖైదీ షాక్ అవుతాడు. అయితే ఖైదీకి ఇచ్చిన ఫోన్ ని తిరిగి తీసుకోడు. మరో సీన్ లో విలన్ పంపించిన రౌడీలు రజినీకాంత్ ఫ్యామిలి పై దాడి చేయడానికి వస్తారు. అప్పుడు రజినీకాంత్ మనవడిని ఒకదగ్గర దాచిపెడతాడు. కానీ అక్కడి నుండి తీసుకొచ్చినట్టు చూపించరు. ఇలా మర్చిపోతే ఎలా రజినీకాంత్ గారు అంటూ నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు.







అప్పట్లోనే దాదాపు 45 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసిన ఈ చిత్రం మెగా అభిమానులకు ఎప్పుడు గుర్తుంది పోతుంది. ఈ మూవీలో తమన్నా చిన్నప్పటి క్యారెక్టర్ చేసిన విషికా ఇప్పుడు హీరోయిన్ గా మారిపోయింది.

“షారుఖ్ జవాన్ సినిమా ఎలా ఉంది, మీ వ్యూ తెలుపగలరా సర్ ?” అని కోరాలో అడిగిన ప్రశ్నకు
విశ్లేషణ: ఒక నిజాయితీ గల ఆర్మీ ఆఫీసర్ దేశద్రోహిగా క్రియేట్ చేయబడి చనిపోవడం, అది నిజం కాదని కొడుకు ప్రూవ్ చేయడం అనే లైన్ తో ఇప్పటికే ఎన్నో సినిమాలొచ్చాయి. ఈ సినిమా కూడా అదే కోవకి చెందినది. కొన్ని కుట్రల వల్ల హత్యకి గురి కాబోయి, కొన ఊపిరితో ఒక గ్రామానికి చేరి ఆ గ్రామస్తులు చేయించిన వైద్యంతో రక్షించబడి ఒకానొక టైమ్ లో ఆ ఊరినే కాపాడిన ఆఫీసర్ అనే సీన్ తో అసలు ఎలివేషన్ స్టార్ట్ అవుతుంది.
తర్వాత ఒక పెద్ద బిజినెస్ మాన్(కాళీ) కూతురిని ట్రైన్ హైజాక్ లో అపంహరించి, డబ్బులు డిమాండ్ చేసి నలబై వేల కోట్లు లాగేయడం ఆ డబ్బునంతా రైతుల రుణాల కోసం వెచ్చించడం లాంటి రాబిన్ హుడ్ హీరోగా అసలు కధను మొదలెడతారు. ఇది రుచించక విలన్ అతనిని ట్రాప్ చేసి చంపబోయే ప్రయత్నంలో విక్రమ్ రాథోడ్ (మరో షారుఖ్) సూపర్ ఎంట్రీ ఇవ్వడం, ఇక ఇక్కడి నుండే కధ అనూహ్య మలుపులు తీసుకోవడం, అసలు వీళ్లెవరు, ఆ కాళీ ఎవరు, వీళ్ళ కదేంటి అనేదే మిగిలిన సగం సినిమా. ఇలా, ఒక కథగా చూస్తే ఎక్కడా కొత్తగా అనిపించదు, చాలా సినిమాలు జ్ఞప్తికొస్తాయి.
జస్ట్ హీరో ఎలివేషన్లతో, పెద్ద పెద్ద యాక్షన్ సీక్వెన్స్ లతో చాలావరకు ప్రేక్షకులను కన్విన్స్ చేసే ప్రయత్నం చేశాడు దర్శకుడు. కానీ కొన్నిచోట్ల పెదవి విరుపులైతే తప్పలేదు. ఇక కాంబో విషయానికొస్తే, షారుఖ్ ఖాన్ లాంటి హీరోని పెట్టుకొని కొత్త కథతో వస్తాడనుకుంటే మనం చూసిన ఎన్నో కథలను మిక్స్ చేసి ఈ రొట్ట రొటీన్ సినిమా తీశాడు అట్లీ, కాకపోతే ఇదొక బాలీవుడ్ మూవీ అంతే. కాకపోతే ప్రస్తుతం సొసైటీలో ప్రధాన సమస్యలైన రైతులు, వారి ఆత్మహత్య లు, గవర్నమెంట్ హాస్పిటల్స్ లో విధి విధానాలు లాంటి వాటిని కమర్షియాలిటీ జోడించి హృద్యంగా తెరకెక్కించిన తీరు మాత్రం మెప్పిస్తుంది.
ఎవరెలా చేశారంటే..
అలాగే షారుఖ్ డైలాగులు కూడా కొంతలో కొంత ఆలోచింపచేసే విధంగా ఉంటాయి, కధగా ‘జవాన్’ పాతదైనా రొటీన్ అయినా, రేసీగా స్క్రీన్ ప్లే రాసుకుని తెరకెక్కించాడు అట్లీ. ఇక అనిరుద్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొన్ని చోట్ల గూస్ బాంప్స్ తెప్పించింది. పాటలు మాత్రం పెద్దగా ఎక్కలేదనేది నిజం. విజయ్ సేతుపతి విలనిజంలో పస లేదు, నయనతార ఓకే. దీపికా, సంజయ్ దత్ వి పెద్ద పాత్రలేమి కావు. కానీ బానే చేశారు. ప్రియమణి పాత్ర బాగా డిజైన్ చేశారు. కానీ చివరలో నయనతార కోసం ఆ పాత్రను చంపేసినట్లు అనిపిస్తుంది.
ప్లస్ & మైనస్: షారుఖ్, విజయ్ సేతుపతి, అనిరుధ్ , యాక్షన్ సీన్స్ ప్లస్ కాగా, పాత కధ, నచ్చని పాటలు పెద్ద మైనస్ అయ్యాయి.
స్కంద మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కనిపించిన చైల్డ్ ఆర్టిస్టు పేరు మేఘనా సునీల్. ఆమె గుండమ్మ కథ సీరియల్ ద్వారా పాపులర్ అయ్యింది. గుండమ్మ గా మేఘన అందంతో, నటనతో బుల్లితెర ఆడియన్స్ ఆకట్టుకుంటోంది. ఇంట్లోవారు ఆమెను మేగీ అని పిలుస్తారు. ఆమె స్వస్థలం విజయవాడ. ఆమె తండ్రి పేరు సునీల్, తల్లి పేరు శ్రీలక్ష్మి. ప్రస్తుతం 9వ తరగతి చదువుతోందని తెలుస్తోంది.
ఆమె తండ్రి సునీల్ కు నటన పైన ఉన్న మక్కువ వల్ల, మేఘనకు కూడా నటన పట్ల ఇష్టం కలిగింది. ఈ రంగంలోకి అడుగుపెట్టింది. మేఘన సిటీ కేబుల్ లో యాంకర్ గా కూడా చేసింది. పలు ప్రకటనలలో నటించిన మేఘన, హీరో నాగార్జునతో కలిసి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ప్రకటనలో నటించింది. ఆమె జీ తెలుగులో ప్రసారం అవుతున్న డ్రామా జూనియర్స్ కోసం ఆడిషన్స్ కి హాజరు అవడంతో గుండమ్మ కథలో సీరియల్ లో పాత్రకు సెట్ అవుతుందని భావించి ఆ సీరియల్ లో తీసుకున్నారు.
ఆ సీరియల్ ద్వారా ఆడియన్స్ కి దగ్గరైన మేఘన ఆ తరువాత అత్తారింట్లో అక్కాచెల్లెళ్లు, అమ్మాయిగారు సీరియల్స్ అవకాశం వచ్చింది. ఆ తరువాత పలు సినిమాలలో ఆఫర్స్ వచ్చాయి. దాంతో F3, ముఖచిత్రం, హిడింబా వంటి సినిమాలలో నటించింది. తాజాగా స్కంద మూవీలో నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఒక పక్క నటిస్తూనే స్టడీస్ కొనసాగిస్తోంది.
జవాన్ కథ మహేష్ బాబుకి బాగా నచ్చిందని, కానీ కాల్ షీట్స్ లేకపోవడంతో సున్నితంగా ఈ కథను రిజెక్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ మూవీ రిలీజ్ కు ముందు, ఆ తరువాత మహేష్ బాబు ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. మహేష్ తరువాత అట్లీ ఈ స్టోరీని రామ్ చరణ్ కి వినిపించారంట. అయితే డిఫరెంట్ కథతో రిస్క్ చేయడానికి ముందుకు రాలేదట. ఆ తరువాత అట్లీ షారూఖ్ ఖాన్ కి కథ చెప్పడం, ఆయనకు నచ్చి ఒకే చేయడంతో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్ళింది. ఈ ఏడాది షారుక్ కి రెండవ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.