మెనోపాజ్ అంటే నెలసరి ఆగిపోవడం లేదా రుతుచక్రం ఆగిపోవడం. మెనోపాజ్ అనేది సహజంగా జరిగే ప్రక్రియ. మహిళల హార్మోన్లలో కలిగే మార్పుల్లో ఇది ఒక మైలురాయి. సాధారణంగా 50 ఏళ్లు దాటిన వారు మెనోపాజ్ కు చేరుకుంటారు. కానీ ప్రస్తుతం 40 ఏళ్లకే మెనోపాజ్ యొక్క లక్షణాలు మొదలవుతున్నాయి.
నెలసరి ఆగిపోయే ముందు మహిళలలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అయితే అందరిలోనూ ఒకేలాంటి లక్షణాలు కనిపించవు. ప్రెగ్నెన్సీలో లాగే ప్రతి మహిళకి డిఫరెంట్ లక్షణాలు కనిపిస్తాయి. అయితే మెనోపాజ్ వచ్చేముందు కనిపించే లక్షణాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
పీరియడ్స్ అనేది ప్రతి స్త్రీ జీవితంలో ఒక భాగం. మోనో పాజ్ ప్రతి మహిళ ఎదుర్కొనే సమస్య. రుతుక్రమం అనేది గతి తప్పుతుంది. అమ్మాయి రజస్వల అయినప్పుడు మొదలైన రుతుక్రమం ఆగిపోతుంది. దీన్ని మెనోపాజ్ అంటారు. అలాగే పన్నెండు నెలల పాటు నెలసరి రావడం నిలిచిపోతే దాన్నే మెనోపాజ్ గా చెబుతారు. ఈ దశ మొదలయ్యే ముందు మహిళలలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అవి కూడా మహిళలందరిలో ఒకేలా ఉండవు.
మెనోపాజ్ ముందు మహిళల్లో వచ్చే లక్షణాలు, ఏమిటంటే, చిన్న విషయాలకే ఎక్కువగా కోపం, చిరాకు, ఇరిటేషన్ లాంటివి వస్తుంటాయి. జుట్టు రాలటం, మతిమరుపు, నిద్రపట్టకపోవటం, తలనొప్పి, ఒంట్లో వేడి ఆవిర్లు రావటం. చర్మంలో అనేక మార్పులు జరుగుతుంటాయి. చర్మం సాగినట్టుగా అవుతుంది. ముడుతలు కూడా వస్తాయి. స్కిన్ కాంతి తగ్గిపోతుంది. బరువు పెరగుతారు. ఇలా ఆఖరికి రుతు చక్రాలు పూర్తిగా ఆగిపోతాయి.
ఈ సమయంలో తమకి ఎదురయ్యే సమస్యలను మహిళలు పైకి చెప్పలేరు. ఇక వాటిని భరించలేక తమలో తామే సతమతమవుతూ ఉంటారు. హార్మోన్ల ఉత్పత్తిలో వచ్చే మార్పుల వల్ల మెనోపాజ్ స్టేజ్ లో మహిళలు మానసిక ఒత్తిడికి ఎక్కువగా గురవుతుంటారు. ఈ సమయంలో బరువు పెరగడం వల్ల టైప్ 2 డయాబెటిస్ రొమ్ము క్యాన్సర్, గుండె జబ్బులు లాంటివి వచ్చే అవకాశం పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. వివరాల కోసం ఈ వీడియో చూడండి.
watch video :
Also Read: మీ శరీరంలో ఈ 3 పార్ట్స్ లో నొప్పి వస్తోందా..? అయితే అది గుండె నొప్పికి సంకేతమే.. జాగ్రత్తపడండి..!

జాతీయ ఉత్తమ నటుడి అవార్డ్ అల్లు అర్జున్ కు వచ్చిన విషయం తెలిసిందే. సుకుమార్ తెరకెక్కించిన పుష్ప సినిమాలో అల్లు అర్జున్ నటనకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఈ మూవీ పాన్ ఇండియా వైడ్ గా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రంలో ఎర్రచందనం స్మగ్లర్ గా అల్లు అర్జున్ నటించారు. పుష్పరాజ్ మేనరిజం, నటనకు వరల్డ్ వైడ్ గా ప్రశంసలు వచ్చాయి.
ఏవీఎస్ అసలు పేరు ఆమంచి వెంకట సుబ్రహ్మణ్యం. ఆయన మొదట పౌరోహిత్యం చేసేవారు. ఆ తరువాత విలేఖరిగా విజయవాడలో పనిచేశారు. ఆ టైమ్ లో ఏవీఎస్ ఆర్ధికంగా ఎన్నో కష్టాలు పడ్డారు. ఎంతలా అంటే ఒక్కొసారు తినడానికి కూడా డబ్బుల లేక ఇబ్బంది పడ్డారు. ఆయన ఆకలిని భరించలేక కిళ్లీ నమిలేవారట. మిమిక్రీ షోలు చేస్తూ డబ్బులు సంపాదించేవారంట. ఆ క్రమంలో ఒక షోలో దిగ్గజ దర్శకుడు బాపు ఏవీఎస్ చూసి ‘మిస్టర్ పెళ్ళాం’ మూవీలో అవకాశం ఇచ్చారు.
ఆ మూవీ హిట్ అవడంతో ఏవీఎస్ మంచి గుర్తింపు వచ్చి, వరుసగా సినిమాలలో అవకాశాలు రావడంతో కామెడియన్ గా, సహాయ నటుడిగా వందల సినిమాలలో నటించి మెప్పించారు. ఆయన సుమారు 750 చిత్రాలలో నటించారు. మాయలోడు, యమలీల, ఘటోత్కచుడు, సిసింద్రీ, మావిడాకులు, ఆవిడా మా ఆవిడే, జయం మనదేరా, వెంకీ, అదిరిందయ్యా చంద్రం, యమగోల మళ్ళీ మొదలైంది, బంగారం, బెండు అప్పారావు, శ్రీరామదాసు, సంక్రాంతి, రాధాగోపాళం వంటి ఎన్నో హిట్ చిత్రాలలో నటించి పేరు, ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు.
ఇది ఇలా ఉంటే, ఏవీఎస్ అల్లుడు కూడా టాలీవుడ్ లో ప్రముఖ నటుడుగా కొనసాగుతున్నాడు. ఆయన పేరు శ్రీనివాస్ చక్రవర్తి. అయితే పాపులర్ అయిన పేరు చింటు. అవును సినిమాలో చేసిన పాత్రకు గుర్తింపు వచ్చింది. చింటు వాల్తేరు వీరయ్య, బంగార్రాజు, తీస్ మార్ ఖాన్, ఎఫ్ 3, రాజా ది గ్రేట్ వంటి సినిమాలలో నటించారు.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా అశ్వనీదత్ వైజయంతీ మూవీస్ బ్యానర్లో నాలుగు చిత్రాలను నిర్మించారు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య మంచి అనుబంధం ఉండేది. జగదేక వీరుడు అతిలోక సుందరి, చూడాలని వుంది, ఇంద్ర చిత్రాలు బ్లాక్ బస్టర్లు హిట్ గా నిలిచాయి. కానీ ఆ తరవాత తీసిన ‘జై చిరంజీవ’ అంతగా ఆడలేదు. ఆ మూవీ తరవాత మళ్లీ చిరంజీవితో మూవీ చేయాలని అశ్వనీదత్ ప్రయత్నించారట. కానీ చిరంజీవి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడంతో అది కుదరలేదట.
అయితే మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ తరువాత ఖైదీ నం.150 మూవీతో విజయాన్ని సాధించారు. అదే సమయంలో దర్శకులు రాజ్ మరియు డీకే ఫ్యామిలీమ్యాన్ వెబ్ సిరీస్ కథతో ప్రొడ్యూసర్ అశ్వనీదత్‌ని కలిశారు. ఈ కథను మెగాస్టార్ చిరంజీవితో చేయాలని అశ్వనీదత్ భావించి, ఫ్యామిలీమ్యాన్ స్క్రిప్ట్‌ని చిరంజీవికి వినిపించారు. అది చిరంజీవికి బాగా నచ్చిందట. కానీ ఇందులో హీరో గూఢచారి లాంటి పాత్ర కావడంతో చిరుకు నచ్చేసింది. అయితే హీరో క్యారెక్టర్ కు ఇద్దరు పిల్లలు ఉండడం చిరంజీవిని ఆలోచించేలా చేశాయి.
దాంతో ఈ విషయాన్ని దర్శకులు రాజ్ మరియు డీకేకు చెప్తే, పిల్లల పాత్రల్ని తొలగించడానికి కూడా సిద్ధం అయిపోయారు. అయితే చిరంజీవి అప్పుడే రీఎంట్రీ ఇవ్వడం, ఆ సమయంలో ఇలాంటి కథ తనకు సెట్ అవుతుందో లేదో అని పక్కన పెట్టారని నిర్మాత అశ్వనీదత్ ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఈ విషయం తెలిసిన మెగా అభిమానులు బాధపడుతున్నారు. దానికి కారణం ఫ్యామిలీమ్యాన్ వెబ్ సిరీస్ గ్లోబల్ వైడ్ గా క్రేజ్ తెచ్చుకుంది.
1. దేశముదురు వివాదం:
2. దువ్వాడ జగన్నాధం వివాదం:
3. అల్లు అర్జున్ – పవన్ కళ్యాణ్ వివాదం:
4. సరైనోడు వివాదం:
5. అల్లు అర్జున్ – భానుశ్రీ మెహ్రా వివాదం:
4. రాపిడో యాడ్ వివాదం:
5. జొమాటో యాడ్ వివాదం:
6. విద్యా సంస్థ యాడ్ వివాదం:
అల్లు అర్జున్ మీద, ఆ విద్యాసంస్థ మీద చర్యలు తీసుకోవాలని పోలీసులకు కంప్లైట్ చేశారు.
వైష్ణవి చైతన్య పేరు ప్రస్తుతం టాలీవుడ్ లో మారుమోగుతోంది. అయితే ఆమె ఈ మూవీకి ముందు ఆమె యూట్యూబర్ గా కొన్ని వెబ్ సిరీస్ లలో నటించి గుర్తింపు తెచ్చుకుంది. వాటి ద్వారానే వైష్ణవి చైతన్య సినిమాలలో అవకాశాలను పొందారు. అలా ఆమె కెరిర్ ప్రారంభంలో చిన్న చిన్న క్యారెక్టర్లలో నటించింది. ఈ క్రమంలోనే వైష్ణవి చైతన్యకు సాయి రాజేష్ తెరకెక్కించిన బేబీ సినిమాలో హీరోయిన్ గా అవక్షం వచ్చింది. ఇక ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.
ఈ మూవీ హిట్ తో ఆమెకు వరుస ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. తన తొలి సినిమా విజయం సాధించడంతో తదుపరి చిత్రాలకు కండిషన్లు పెడుతున్నట్టు సమాచారం. రెండవ చిత్రానికి గాను వైష్ణవి చైతన్య దర్శక నిర్మాతలకు పలు షరతులు పెట్టారని, వాటికి అంగీకరిస్తేనే మూవీకి సైన్ చేస్తానని చెప్పినట్టు తెలుస్తోంది.
సినిమాలకు తాను సైన్ చేయాలంటే అడ్వాన్స్ ముందుగానే చెల్లించాలని, ఒక్కో చిత్రానికి రూ. 2 కోట్ల రూపాయల పారితోషికం ఇస్తేనే వారి చిత్రాలలో నటిస్తానని సూటిగా చెబుతున్నారని తెలుస్తోంది. అయితే వైష్ణవి చైతన్య రెండవ ఇలాంటి షరతులు పెట్టడంతో ఆమె పై పలువురు విమర్శలు చేస్తున్నారు.
అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో రూపొందిన పుష్ప మూవీ సెన్షేషనల్ విజయన్ని దక్కించుకుంది. అంతేకాకుండా అల్లు అర్జున్ కు జాతీయ ఉత్తమ నటుడు అవార్డు రావడంతో పుష్ప యూనిట్ సంబరాలు చేసుకుంటోంది. అల్లు అర్జున్ తాజాగా ఫ్యాన్స్ కోసం పుష్ప-2 మూవీ షూటింగ్ వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోలో సుకుమార్, అల్లు అర్జున్ మూవీ స్క్రిప్ట్ గురించి చర్చిస్తూ కనిపించారు. అయితే అభిమానులు దాన్ని స్క్రీన్ షాట్ తీసి, సామాజిక మధ్యమాలలో షేర్ చేశారు. ఆ స్క్రీన్ షాట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.
ఆస్క్రీన్ షాట్ లో కేశవ పాత్ర కోసం రాసినట్లుగా ఒక డైలాగ్ ఉంది. ‘ముందు అయితే నీకు, షెకావత్ కి గొడవ మచ్చా.. కానీ ఇప్పుడు సిండికేట్ కూడా ఇన్వాల్వ్ అయింది’ అని ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ డైలాగ్ వైరల్ గా మారింది. పుష్ప 2 మూవీలో పుష్పరాజ్ కు, షెకావత్ కు మధ్య వచ్చే సన్నివేశాలపై భారీ అంచనాలు పెరిగాయి. ఈ చిత్రంలో చాలా లెంగ్తీ డైలాగ్స్ ఉన్నాయని తెలుస్తోంది.
తాజాగా లీకైన డైలాగ్ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటోంది. కేశవ్ పాత్రకే ఇటువంటి డైలాగు ఉంటే, హీరోకి ఏ రేంజ్ డైలాగులు ఉంటాయో అని ఫ్యాన్స్ సంతోషపడుతున్నారు. అల్లు అర్జున్ కు జాతీయ ఉత్తమ నటుడు అవార్డు వచ్చిన సంతోషంలో ఉన్న బన్నీ ఫ్యాన్స్ ఈ డైలాగ్ తో మరింత సంతోషపడుతున్నారు.
కానీ దేవస్థాన కౌంటర్ సిబ్బంది ఆ రవికను చెత్తలో వేయమని చెప్పడంతో వారు షాకయ్యారు. సందేహం వచ్చి, రవిక ను పరిశీలించగా అది రవిక కాదని, దాన్ని రుమాలు అనికూడా చెప్పలేము అని హారిక తెలిపారు. అమ్మవారి రవికల పేరుతో గుడ్డ ముక్కలను అందంగా ఉండే ప్లాస్టిక్ కవర్లలో ప్యాక్ చేసి అమ్ముతున్నారని హారిక ఆరోపించారు.
అడిగినంత డబ్బు ఇస్తున్నా కూడా, గుడి అవరణలోనే భక్తులను మోసం చేయడం ఏంటని కౌంటర్ లో ఉన్న సిబ్బందిని నిలదీయగా వారు ఆలయ అధికారులకు కంప్లైంట్ చేయమని సూచించినట్లుగా ఆమె తెలిపారు. అక్కడ ఇదంతా సాధారణంగా జరిగే విషయమే అని ఆలయ అధికారి చెప్పారని అన్నారు. దాంతో దేవాలయ ఈవో భ్రమరాంబను కలవడానికి ప్రయత్నించగా, ఆ టైమ్ లో ఈవో అందుబాటులో లేకపోవడంతో వెనక్కు వచ్చామని హారిక వెల్లడించారు.
అక్కినేని నాగార్జున పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమా ‘నా సామి రంగ’ పై అధికారికంగా ప్రకటన ఇస్తూ, గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. ఈ చిత్రంతో విజయ్ బిన్నీను డైరెక్టర్ గా పరిచయం అవుతున్నాడు. రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించారు. మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘పొరింజు మరియమ్ జోస్’ మూవీకి రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది.
పోరింజు మరియం జోస్ మూవీ 2019లో విడుదల అయ్యింది. ఈ మూవీకి జోషి దర్శకత్వం వహించాడు. ఈ మూవీలో జోజు జార్జ్, నైలా ఉష, చెంబన్ వినోద్ జోస్ లు టైటిల్ రోల్స్ ను పోషించారు. త్రిసూర్‌లో 1980-1990ల మధ్య జరిగిన సంఘటనల ఆధారంగా ఈ మూవీ రూపొందించబడింది. ఈ మూవీ కథ విషయానికి వస్తే, పోరింజు(జోజు జార్జ్), మరియం(నైలా ఉష), జోస్(జోజు జార్జ్), ముగ్గురు చిన్నప్పటి నుండి స్నేహితులు, కలిసి చదువుతుంటారు. అయితే పోరింజు మరియంను ప్రేమిస్తాడు.
కానీ ఆమె తండ్రి బాగా డబ్బున్నవాడు కావడంతో పోరింజు, జోస్ లతో స్నేహం చేయవద్దని చెప్తాడు. అయితే మరియం కూడా పోరింజు ప్రేమిస్తుంది, కానీ అపార్థాల వల్ల వారు విడిపోతారు. ఇరవై ఏళ్ల తరువాత పొరింజు కసాయిగా పనిచేస్తుండగా, మరియం వడ్డీ వ్యాపారి అవుతుంది. జోస్, పోరింజులు ఎప్పటిలానే స్నేహితులు కొనసాగుతారు. ఆ గ్రామ చర్చిలో జరిగే పండుగలో జరిగిన ఒక సంఘటన వీరి ముగ్గురి జీవితాలను ఎలా మార్చింది అనేది కథ.
ఇక ‘నా సామి రంగ’ సినిమాలో తెలుగు నెటీవీటికి తగ్గట్టుగా అనేక మార్పులు చేర్పులు చేసినట్టు తెలుస్తోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి కానుకగా రిలీజ్ కానుంది. హీరోయిన్, తదితర వివరాలను త్వరలో ప్రకటించనున్నారని తెలుస్తోంది.
యోయో ఫిట్నెస్ టెస్ట్ మొదలుపెట్టిన వ్యక్తి శంకర్ బసు. ఆయన ఒకప్పడు స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్ గా పనిచేశారు. ఇండియన్ క్రికెట్లో అత్యున్నత ఫిట్నెస్ స్టాండర్డ్స్ ను నెలకొల్పిన విరాట్ కోహ్లి భారతజట్టు కెప్టెన్‌గా ఉండటం వల్ల యోయో టెస్ట్ కు తేలికగా ఆమోదం వచ్చింది. అప్పటి భారత జట్టు కోచ్ రవిశాస్త్రి ఈ టెస్ట్ ను సపోర్ట్ చేశాడు. 2018 నుంచి 3 ఏళ్ల పాటు యోయో టెస్ట్ లో పాస్ అవడం అనేది భారత ప్లేయర్స్ కు తప్పనసరి అయ్యింది.
అత్యుత్తమ ఫిట్నెస్ ఉన్నవారు మాత్రమే యోయోలో పాస్ అవగలరు. యువరాజ్ సింగ్, సురేశ్ రైనా వంటి సీనియర్ క్రికెటర్లు మాత్రమే కాకుండా పృథ్వీ షా, వాషింగ్టన్ సుందర్ లాంటి యంగ్ ప్లేయర్స్ కూడా ఈ టెస్ట్ ను పాస్ కాలేక ఇబ్బంది పడ్డారు. కోహ్లి టీం ఇండియా కెప్టెన్‌గా ఉన్నన్ని రోజులు ఈ టెస్ట్ ను కఠినంగా అమలు చేశారు. యోయో టెస్ట్ లో వచ్చిన స్కోరును బట్టే భారత క్రికెట్ జట్టులో స్థానం లభిస్తుంది. ఎంత పెద్ద క్రికెటర్ అయినా సరే ఈ పరీక్షలో ఫెయిలైతే అంతే.
ఇటీవల బీసీసీఐ యోయో టెస్ట్‌తో పాటుగా రెండు 2 కిలోమీటర్ల పరుగును కూడా అమలులోకి తెచ్చింది. ఈ రెండింటిలో ఏదో ఒక దానిలో క్రికెటర్లు తప్పనిసరిగా పాస్ కావాల్సి ఉంటుంది. ఈ టెస్ట్ లో భాగంగా ఇరవై మీటర్ల ఎడంతో 2 కోన్లను ఏర్పాటు చేస్తారు. క్రికెటర్లు వీటి మధ్య పరుగెత్తాల్సి ఉంటుంది. దీనిలో ఉండే స్థాయిలను బట్టి, ప్రతి ఆటగాడు పరుగెత్తే వేగాన్ని పెంచుకుంటూ వెళ్లాలి. ఒక ఆటగాడు పరుగు మొదలుపెట్టే ముందు బీప్ సౌండ్ వస్తుంది. మళ్ళీ బీప్ సౌండ్ వచ్చేలోపు అవతలి ఎండ్‌కు ఆ ఆటగాడు వెళ్లాలి.
మళ్ళీ బీప్ వినిపించేలోపు మళ్లీ మొదలుపెట్టిన చోటుకి రావాలి. ఒకసారి ఇలా చేస్తే ఒక షటిల్ కంప్లీట్ అయినట్టుగా పరిగణిస్తారు. ఒక షటిల్లో ఒక ఆటగాడు 40 మీటర్లు రన్ చేస్తాడు. క్రికెటర్లు పూర్తి చేసిన షటిళ్లను బట్టి స్కోరును లెక్కిస్తారు. షటిల్ కు షటిల్ కు మధ్య 5- నుండి 10 సెకన్ల వరకు విరామం ఉంటుంది. బీప్ సౌండ్ ను ఎవరూ కంట్రోల్ చేయలేరు. టెస్ట్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ ద్వారా జరుగుతుంది.
షటిల్ కంప్లీట్ చేసే టైమ్ లో మొత్తం 3 బీప్స్ వస్తాయి. షటిల్ మొదలవడానికి ముందు ఒక బీప్, ఆ తరువాత 20 మీటర్ల దూరానికి ఒక బీప్, మళ్ళీ 20 మీటర్లకు ఒక బీప్ వస్తుంది. ఈ బీప్ శబ్దం వినిపించేలోపే ఆటగాడు తన లక్ష్యాన్ని చేరుకోవాలి. ఒక బీప్ కానుక మిస్సయితే కోచ్, ట్రైనర్ ఆ ఆటగాడికి వార్నింగ్ ఇస్తారు. 2 బీప్స్ మిస్సయితే ఆ ఆటగాడి పరీక్ష ముగిసినట్లే. ఆ ఆటగాడు యోయో టెస్ట్‌లో ఫెయిలయ్యాడని అర్ధం.