శ్రీ విష్ణు హీరోగా నటించిన సినిమా ‘సామజవరగమన’. ఈ చిత్రం జూలై 29న విడుదల అయ్యి బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ మూవీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.
ఓటీటీలో రిలీజ్ అయిన సినిమాలను పలు మార్లు చూసినవారు వాటిలోని మిస్టేక్స్ ను గమనిస్తూ, వాటి గురించి సోషల్ మీడియాలో షేర్ చేయడం సాధారణం అయ్యింది. ఈ క్రమంలోనే ఈ చిత్రంలో ఒక సీన్ గమనించిన ఓ నెటిజెన్ ట్విట్టర్ లో షేర్ చేయగా, నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
‘వివాహ భోజనంబు’ డైరెక్టర్ రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ సినిమా అనిల్ సుంకర సమర్పణలో ‘ఎకె ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై రాజేష్ దండా నిర్మించారు. ఇటీవల ఓటీటీలో రిలీజ్ అయిన ఈ మూవీ అక్కడ కూడా రికార్డులను బ్రేక్ చేస్తోంది. ఈ మూవీ మొదటి నుండి క్లైమాక్స్ వరకు ఫన్ ఉంటుంది. ఇక క్లైమాక్స్ సైతం కన్విన్సింగ్ గా ఉంటుంది. ఇటీవల కాలంలో ఇంత ఫన్ ఉన్న మూవీ రాలేదని చెప్పవచ్చు. శ్రీవిష్ణు, నరేష్ ఇద్దరు పోటీపడి నటించారు.
ఓటీటీలో రిలీజ్ అయిన 40 గంటల్లోనే 100 మిలియన్లకి పైన స్ట్రీమింగ్ మినిట్స్ ను నమోదు చేసిన సినిమాలలో ఒకటి నిలిచింది. అయితే ఈ మూవీ క్లిపింగ్ ఒకటి నెట్టింట్లో వైరల్ గా మారింది. ఈ చిత్రంలో హీరోయిన్ అక్క పెళ్లి గురించి ఇరు ఫ్యామిలీలు మాట్లాడే సన్నివేశంలో నరేష్ పెళ్లి ఆపడానికి ప్రయత్నిస్తుంటాడు. కానీ హీరోయిన్ తండ్రి శ్రీకాంత్ అయ్యంగార్ నరేష్ తో మాట్లాడుతూ ఉంటాడు.
ఇదంతా బాగానే ఉన్నప్పటికీ వీరి వెనకాల ఇద్దరు క్యారెక్టర్ ఆర్తిస్టులు నలుపు చీర కట్టుకున్న మహిళ, ఆకుపచ్చ డ్రెస్ వేసుకున్న మహిళ ఇటు నరేష్ మాట్లాడుతున్నప్పుడు వెనకాలే ఉంటారు. అటు శ్రీకాంత్ అయ్యంగార్ మాట్లాడుతున్నప్పుడు అటు వైపు కూడా కనిపిస్తారు. ఇది గమనించిన ఒక నెటిజెన్ ఈ వీడియో క్లిపింగ్ ను ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ వారిద్దరూ ఫ్లాష్ కంటే ఫాస్ట్ గా ఉన్నారు కదా అని రాసుకొచ్చారు. ఇది చూసిన నెటిజెన్లు ఈ పోస్ట్ పై ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
Venakala Black saree, Green dress Flash ⚡ kante fast ga unnaru kadha #Samajavaragamana pic.twitter.com/mpS7aURKBw
— Jai Hind 🇮🇳 (@TheSriram_A) July 30, 2023
Also Read: “అప్పుడే నయం ఏమో..!” అంటూ… “చిరంజీవి” పై కామెంట్స్..! ఏం జరిగిందంటే..?

వెంకన్న ప్రసాదాల్లో లడ్డు ముఖ్యమైనది. అన్ని హిందువుల పుణ్యక్షేత్రాల్లో దొరికే లడ్డుల కన్నా తిరుపతి లడ్డుకు ఉన్న ప్రాముఖ్యత వేరే దేనికి లేదని చెప్పవచ్చు. తిరుపతిలో దొరికే లడ్డు యొక్క రుచి, సువాసన వేరే లడ్డుకు ఉండదు. అందుకే తిరుపతి లడ్డుకు జియోగ్రాఫికల్ పేటెంట్ కూడా లభించింది. దాని ప్రకారం ఈ లడ్డు తయారీ పద్ధతి ఎవ్వరూ అనుకరించకూడదు.
మధురమైన తిరుపతి లడ్డుల తయారీ కోసం గత యాబై సంవత్సరాల నుండి నందిని నెయ్యిని ఉపయోగిస్తున్నారు. తిరుమలలో నిత్యం దాదాపు 3 లక్షల లడ్లు తయారు చేస్తారని తెలుస్తోంది. ఈ లడ్డుల తయారీలో సుమారు 700 మంది పోటు కార్మికులు పని చేస్తున్నారు. తాజాగా టీటీడీ అధికారులు ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. లడ్డు తయారీలో నందిని నెయ్యిని ఉపయోగించకూడదని నిర్ణయాన్ని తీసుకున్నారు.
నందిని నెయ్యిని కేఎంఎఫ్ (కర్ణాటక మిల్క్ ఫెడరేషన్) తయారు చేస్తుంది. ఈ నెయ్యిని వాడకూడదని నిర్ణయించారు. ఈ మేరకు కేఎంఎఫ్‌తో ఇన్నాళ్ళూ ఉన్న కాంట్రాక్ట్‌ను రెన్యూవల్ చేయకూడదనే డిసైడ్ అయ్యారు. దీనికి కారణం కేఎంఎఫ్ నందిని నెయ్యి ధరను పెంచడమే. ఇక ఈ విషయాన్ని కేఎంఎఫ్ ఛైర్మన్ ధ్రువీకరించారు. టీటీడీ చెప్పిన ధరకు నందిని నెయ్యిని సరఫరా చేయలేమని తెలిపారు. నెయ్యిని తక్కువ ధరకు సరఫరా చేసే టెండర్ల విధానంలో పాల్గొనట్లేదని వెల్లడించారు.
1. శాకుంతలం:
2. ఏజెంట్:
3. కబ్జా:
4. మీటర్:
5. ఆదిపురుష్:
6. రామబాణం:
7. మైఖేల్:
8. హంట్:
9. మళ్ళీ పెళ్లి:
10. అమిగోస్:
11. వీర సింహ రెడ్డి:
12. తెగింపు:
పోస్టర్, టీజర్, ట్రైలర్ తో అంచనాలు పెరిగిపోయాయి. మంచి కలెక్షన్స్ సాధించినప్పటికి, ఫస్ట్ హాఫ్ బాగున్నా, సెకండ్ హాఫ్ మాత్రం అంతగా ఆకట్టుకోలేదు.
విజయ్ సినిమాలు ఫలితంతో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ సాధిస్తాయి. విజయ్ ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ‘లియో’ మూవీలో నటిస్తున్నారు. లియో తర్వాత విజయ్ దర్శకుడు వెంకట్ ప్రభుతో కలిసి “తలపతి 68” మూవీలో నటించబోతున్నాడు. వెంకట్ ప్రభు ప్రత్యేకమైన కథనంతో సాగుతాయి. విజయ్‌తో సినిమా అనడంతో విజయ్ ఫ్యాన్స్ లో మరింత ఉత్సాహం పెరిగింది. ఈ డైనమిక్ జోడీ వెండితెరపై ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో చూడాలని అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
లియో, తలపతి 68 కోసం ఎదురుచూస్తున్న విజయ్ అభిమానుల దృష్టిని దర్శకధీరుడు రాజమౌళి చేసిన ట్వీట్ ఒకటి ఆకర్షించింది. బ్లాక్ బస్టర్ చిత్రాలకు పేరుగాంచిన రాజమౌళి గతంలో ప్రభాస్ నటించిన ఛత్రపతి సినిమాకి దర్శకత్వం వహించారు. విజయ్ నటించిన కురువి అనే మూవీ ఛత్రపతి మూవీ నుండి తీసుకోబడింది అని టాక్.
ఉత్తరప్రదేశ్ లోని బల్లియా జిల్లాకు చెందిన జానకీ దేవి భర్త కొన్నేళ్ళ క్రితం కనిపించకుండా పోయాడు. అప్పటి నుండి ఆమె తన భర్త కోసం వెతుకుతూనే ఉంది. ఇటీవల బల్లియాలోని జిల్లా హాస్పటల్ ముందు చాలా దయనీయంగా ఉన్న ఒక దివ్యాంగుడిని చూసింది. ఆ వ్యక్తి కనిపించకుండా పోయిన తన భర్తగా భావించి ఇంటికి తీసుకెళ్లింది. అతని గడ్డం మరియు జుట్టు అచ్చం తన భర్త వలె ఉండడంతో పొరబాటు పడింది. అతన్ని చిరిగిన బట్టలలో చూసి బాధపడిపోయింది.
ఆసుపత్రి బయట అతన్ని చూసి ఇన్నేళ్ల నుండి ఎక్కడికి వెళ్లిపోయావు? ఇంతకాలం ఎక్కడున్నావు? అని జానకీ దేవి అడిగింది. కానీ ఆ వ్యక్తి మాత్రం ఏం మాట్లాడలేదు. జానకీ దేవి అతన్ని ఇంటికి తీసుకొచ్చి, అతనికి షేవింగ్ చేయించిన తరువాత చూసి షాక్ అయ్యింది. ఆ తరవాత అతని పుట్టు మచ్చలు చూసి భర్త కాదో గుర్తు పట్టడం కోసం ప్రయత్నించింది. కానీ పుట్టు మచ్చలు కూడా కనిపించలేదు. దాంతో ఇంటికి తీసుకువచ్చిన వ్యక్తి తన భర్త కాదని గ్రహించింది.
అంతకు ముందు “నాన్న వచ్చాడు” అని తన పిల్లలతో ఆనందంగా చెప్పింది. ఒక కొత్త కుర్తాను తీసుకురమ్మని డబ్బులిచ్చి పిల్లలను పంపింది. కానీ చివరికి అతను తన భర్త కాదని, తప్పు తెలుసుకుని అతనికి క్షమాపణలు చెప్పి, అ వ్యక్తిని వారి కుటుంబ సభ్యులకు అప్పగించింది. ఇదంతా చూసిన స్థానికులందరు ఆశ్చర్యపోయారు.
మెగా ఫ్యామిలీ హీరోలు పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ ఇద్దరు కలిసి నటించిన ‘బ్రో’ మూవీ కోసం అటు మెగాఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూశారు. తమిళంలో విజయం సాధించిన ‘వినోదయ సీతమ్’ మూవీకి రీమేక్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ఈ మూవీని నిర్మించింది. థమన్ ఈ మూవీకి సంగీతాన్ని అందించాడు.
జులై 28న రిలీజ్ అయిన ఈ చిత్రానికి తొలి రోజు రూ. 30.05 కోట్ల భారీ కలెక్షన్స్ సంపాదించింది. కానీ రెండవ రోజు కొంచెం కలెక్షన్స్ వసూళ్లు తగ్గినట్టుగా తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా రెండవ రోజు రూ.27 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు తెలుస్తోంది. రిలీజ్ అయిన రెండు రోజుల్లోనే ఈ సినిమా రూ. 50 కోట్ల క్లబ్లో జాయిన్ అయ్యింది. ఇక ఆదివారం కలెక్షన్స్ పెరుగుతాయని అంతా అనుకున్నారు.
అయితే తెలుగు స్టేట్స్ లో రూ. 11 – 11.50 కోట్ల షేర్ సాధించింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 13 – 14 కోట్ల షేర్ రాబట్టిందని తెలుస్తోంది. మూడు రోజుల్లో బ్రో మూవీ రూ. 56 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టింది. ఈ మూవీ విజయం సాధించాలంటే ఇంకా రూ. 42 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించాలని తెలుస్తోంది.
ప్రియాంక తుంపల టాలీవుడ్ లో ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ లలో ఒకరు. తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూలో తన గురించి పలు విషయాలను తెలిపారు. ప్రియాంక స్వస్థలం విశాఖపట్నం. తాను ఒక కార్పొరేట్ ఉద్యోగినని, బీఏ చేసిన ఆమె ప్రొడక్ట్ బ్రాండింగ్, ఆర్జే, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ లో పని చేశానని అన్నారు. ఒకసారి పని మీద అన్నపూర్ణ స్టూడియోస్కి వెళ్లానని, ఆ సమయంలో ‘విలేజ్‌లో వినాయకుడు’ మూవీ కోసం డబ్బింగ్ ఆడిషన్స్ నిర్వహిస్తున్నారు.
అక్కడే మొదటిసారి డబ్బింగ్ ఆర్టిస్ట్‌ల గురించి తెలిసిందని, ఇంట్రెస్టింగ్ గా అనిపించడంతో సరదాగా అందులో పాల్గొన్నాను. డైరెక్టర్‌కి నా గొంతు నచ్చడంతో ఆ మూవీలో అవకాశమిచ్చారు. ఆ మూవీనే నా ఫస్ట్ మూవీ అని తెలిపారు. వర్క్ నచ్చడంతో డబ్బింగ్ ను కొనసాగించానని అన్నారు. డబ్బింగ్ ఆర్టిస్ట్ గా గత 15 ఏళ్లుగా చాలా మంది ప్రముఖ హీరోయిన్లకు డబ్బింగ్ చెప్పానని, అలా మంచి గుర్తింపు వచ్చిందని అన్నారు.
అలా ప్రియాంక తుంపాల కాజల్ అగర్వాల్, రాశికన్నా, తమన్నా, సాయిపల్లవి, పూజా హెగ్దే, రష్మిక, రెజీనా, నభా నటేష్, ఐశ్వర్య లక్ష్మి, అనన్యపాండే, కేతిక శర్మ వంటి ఎంతోమంది కథానాయకలకు గాత్రదానం చేసింది. ఆమె తెలుగు, హిందీ మాత్రమే కాకుండా డిస్నీ, మార్వెల్ వంటి హాలీవుడ్ సంస్థలకూ ప్రియాంక జర్నీ సాగింది. అలా కెప్టెన్ మార్వెల్, జంగిల్ క్రూజ్, ఎటర్నల్స్, ఎవెంజర్స్ ఎండ్ గేమ్, ఇండియానా జోన్స్ అండ్ ది డయల్ ఆఫ్ డెస్టినీ చిత్రాలకు కూడా పని చేసారు. ఆమె కెరీర్ లో ఇప్పటివరకు దాదాపు 150కి పైగా చిత్రాలకు వర్క్ చేసారు.
మన పితృస్వామ్య వ్వవస్థ కుటుంబంలో అల్లుడూ, కోడలు ఇద్దరూ వేరే కుటుంబాల నుండి వచ్చినప్పటికీ, కోడలికి కుటుంబ బాధ్యతను, అల్లుడికి అయితే హోదా ఇచ్చింది. ఇక ఇల్లరికం వెళ్ళిన అల్లుడు అయితే బాధ్యతలో కోడలితో సమానంగా చూస్తారు. అందువల్లనే ఇల్లరికపు అల్లుడిని ఇంటికి పెద్ద పాలికాపు అని అంటారు. సాధారణంగా ఎవరింటి కైనా వెళ్ళినపుడు అతిథి పాటించే నియమాలన్నీ కూడా అల్లుడికి అత్తవారింటికి వెళ్ళిన సమయంలో వర్తిస్తాయని చెప్పచ్చు.
పై ఫోటోలో గ్రీన్ షర్ట్ వేసుకుని ఫోటోకి ఫోజు ఇస్తున్న ఈ అబ్బాయి, గొప్ప నటుడుగా పేరున్న తండ్రికి నట వారసుడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. అయితే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును అతి తక్కువ సమయంలోనే సొంతం చేసుకుని సౌత్ ఇండస్ట్రీలో లో స్టార్ హీరోగా మారారు. తాను నటించే పాత్ర కోసం ఎంతైనా కష్టపడడం, ఆ పాత్రలో ఒదిగిపోవడం, లవ్, యాక్షన్ ఎమోషన్ ఏదైనా అద్భుతంగా చేయడం అతని ప్రత్యేకత. కథ, తాను చేసే పాత్ర నచ్చితే ఇతర భాషలలో నటించి, మెప్పిస్తున్న ఈ హీరోకి ఇతర ఇతర భాషల ఇండస్ట్రీల్లోనూ పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ఉన్నారు.
అంత టాలెంట్ ఉన్న హీరో ఎవరంటే దుల్కర్ సల్మాన్. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కుమారుడు. నిన్న (జూలై 28) దుల్కర్ బర్త్ డే సందర్భంగా అభిమానులు విషెస్ చెప్తూ, దుల్కర్ చిన్ననాటి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దుల్కర్ సల్మాన్ మలయాళ సినిమా ద్వారా హీరోగా మారి, తమిళం, తెలుగు, హిందీ భాషల్లో అద్బుతమైన క్యారెక్టర్లు చేసి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు.
‘సీతా రామం’ తో టాలీవుడ్ లో చెరుగని ముద్ర వేసిన దుల్కర్, డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘లక్కీ భాస్కర్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీ టైటిల్, మరియు పోస్టర్ దుల్కర్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేశారు. నటుడిగా మాత్రమే కాకుండా సింగర్, నిర్మాత కూడా. దుల్కర్ సల్మాన్ భార్య పేరు అమల్ సూఫియా. వీరికి ఒక పాప ఉన్నారు.
ఆ క్రమంలోనే జమిని ఛటర్జీ మనవరాలు జర్నలిస్టు అయిన రాణి ఛటర్జీ (ఆలియాభట్)ను చూసి తొలి చూపులోనే ప్రేమిస్తాడు. కానీ రాణి, రాకీ ప్రేమకు ఇద్దరి ఫ్యామిలీలు అభ్యంతరం చెబుతాయి. అయితే రాణి, రాకీ ప్రేమకు వారి కుటుంబాల నుండి ఎలాంటి అభ్యంతరాలు వచ్చాయి? తమ ప్రేమ గెలిపించుకోవడానికి రాకీ, రాణి ఏం చేశారు? అనేది మిగిలిన కథ.
రివ్యూ:
మిఠాయి బిజినెస్ నిర్వహించే ఫ్యామిలీకి చెందిన యువకుడిగా రణ్వీర్ సింగ్ ఒదిగిపోయాడు. స్టైల్,బాడీ లాంగ్వేజ్, లుక్, యాటిట్యూడ్‌తో ఆకట్టుకుంటాడు. జర్నలిస్టు పాత్రలో రాణి గా,ఎమోషనల్ సన్నివేశాలలో ఆలియా భట్ నటన బాగుంది.ధర్మేంద్ర, షాబానా ఆజ్మీ, జయబచ్చన్ వారి క్యారెక్టర్లలో ఒదిగిపోయారు. వరుణ్ ధావన్, సారా ఆలీ ఖాన్, అనన్య పాండే, జాన్వీ కపూర్ గెస్ట్ రోల్స్ లో మెరిశారు. మిగతా వారు తమ పాత్రల మేరకు నటించారు.
రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ మూవీకి ప్రీతమ్ అందించిన సంగీతం స్పెషల్ ఎట్రాక్షన్ష్, సినిమాటోగ్రఫి బాగుంది. ధనవంతుల కుటుంబాల ఇంటి సెటప్‌తో సహా ప్రతీ సీన్ రిచ్‌గా తీశారు. డైలాగ్స్ ఫన్, కామెడీ, ఎమోషనల్ ఆకట్టుకున్నాయి. మూవీలో ప్రతీ ఫ్రేమ్ చాలా రిచ్‌గా కనిపిస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
ప్లస్ పాయింట్స్ :