సాధారణంగా హీరో అవ్వాలి అంటే కొన్ని పరిమాణాలు ఉంటాయి. చూడడానికి బాగుండాలి అని, హైట్ గా ఉండాలి అని, డాన్స్ రావాలి, ఫైటింగ్స్ రావాలి ఇలా చాలా ఉంటాయి. ఇవన్నీ చేస్తే మాత్రమే హీరో అంటారు. ఒక నటుడు అవ్వాలి అంటే నటన వస్తే చాలు. కానీ ఒక హీరో అవ్వాలి అంటే మాత్రం పైన చెప్పినవన్నీ కూడా కచ్చితంగా వచ్చి ఉండాలి అనే ఒక మైండ్ సెట్ లో చాలా మంది ఉంటారు. అయితే అవి తప్పు అని తెలిసిన వారు కూడా ఉంటారు. హీరో అవ్వాలి అంటే తన నటనతో ఆ పాత్రకి న్యాయం చేయాలి అనేది ముఖ్యం.
ఆ పాత్ర చూస్తున్నంత సేపు, ఆ హీరో కాకుండా ఆ పాత్ర మాత్రమే కనిపించాలి. ఆ పాత్ర చుట్టూ సినిమా తిరుగుతుంది అన్నప్పుడు అంత బాగా నటించాలి. ఆ పాత్రకి న్యాయం చేసిన వారే హీరో అవుతారు. అంతే కానీ సన్నగా ఉండడం, ఎత్తుగా ఉండడం ఇవన్నీ ఉంటేనే హీరో అవుతారు అనేది కేవలం అపోహ మాత్రమే. ఈ విషయాన్ని నిరూపించిన నటుడు సౌబిన్ షాహిర్. ఇతను మనలో కొంత మందికి తెలిస్తే, కొంత మందికి తెలియకపోవచ్చు.

పేరు తెలియకపోవచ్చు కానీ, మనిషిని చూస్తే మాత్రం మనలో చాలా మంది గుర్తుపడతారు. మలయాళం సినిమాల ద్వారా తెలుగులో అంత ఫేమస్ అయ్యారు. సౌబిన్ షాహిర్ చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టి, ఎన్నో సినిమాల్లో నటించారు. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో సహాయ పాత్రల్లో నటించారు. 2018 లో వచ్చిన సుడాని ఫ్రం నైజీరియా అనే సినిమాలో హీరోగా నటించారు. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వడమే కాకుండా, ఇలా ఉంటే కూడా హీరో అవుతారు అని నిరూపించింది.
ఆ తర్వాత వచ్చిన కుంబలాంగి నైట్స్ అనే సినిమా సౌబిన్ షాహిర్ ని భారతదేశం అంతా ఫేమస్ చేసింది. ఈ సినిమా 2019 లో వచ్చింది. 2020 నుండి లాక్ డౌన్ మొదలైన సంగతి తెలిసిందే. దాంతో ఈ సినిమా కూడా చాలా మంది చూడడంతో అప్పటి నుండి సౌబిన్ షాహిర్ చాలా మందికి తెలిసిన నటుడు అయ్యారు. గత సంవత్సరం వచ్చిన రోమాంచం సినిమాలో మెయిన్ హీరోగా నటించారు. ఈ సినిమాకి తెలుగులో కూడా మంచి ఆదరణ లభించింది.
ఇటీవల మంజుమ్మిల్ బాయ్స్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాని తనే నిర్మించారు కూడా. 2017 లో పరవా అనే సినిమాకి దర్శకత్వం వహించారు. ఇంకా ఓటీటీలో రిలీజ్ అయిన ఎన్నో మలయాళం నుండి తెలుగు డబ్బింగ్ సినిమాల ద్వారా ఫేమస్ అయ్యారు. హీరో అన్న పదానికి అర్థం మార్చి, హీరో అంటే పాత్రకి న్యాయం చేసి, సినిమా తన భుజాల మీద మోసి, ప్రేక్షకులని సినిమా ఆసక్తికరంగా చూసేలా చేసిన వాడు అని నిరూపించారు.
ALSO READ : జరగండి పాటలో ఈ మిస్టేక్ గమనించారా..? చూసుకోవాలి కదా డైరెక్టర్ గారూ..?




దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన మలయాళ మూవీ చార్లీ. ఈ మూవీ సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రానికి గాను 2016లో దుల్కర్ సల్మాన్ ఉత్తమ నటుడిగా కేరళ ప్రభుత్వం నుండి అవార్డును అందుకున్నారు. ఈ మూవీ మార్టిన్ ప్రక్కత్ దర్శకత్వంలో అడ్వెంచర్ డ్రామాగా తెరకెక్కింది. పార్వతి హీరోయిన్ గా నటించింది. 46వ కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులలో ఈ మూవీకి ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సినిమాటోగ్రఫీతో పాటు మొత్తం 8 అవార్డులను గెలుచుకుంది. ఇతర భాషలలో కూడా ఈ మూవీ రీమేక్ అయ్యింది.
చార్లీ కథ విషయానికి వస్తే, తేస్సా (పార్వతి) ఒక గ్రాఫిక్ ఆర్టిస్ట్. ఇష్టంలేని పెళ్ళిని తప్పించుకోవడం కోసం ఇంటి నుండి పారిపోతుంది. తన జర్నలిస్ట్ ఫ్రెండ్ సహాయంతో, ఆమె పాత ఇంట్లో అద్దెకు తీసుకుంటుంది. మొదట్లో, ఆ ఇంటిని అసహ్యించుకుని, దానిని శుభ్రం చేసే క్రమంలో ఆ గదిలో ఒక బుక్ దొరుకుతుంది. అది చదవడం ద్వారా గతంలో చార్లీ (దుల్కర్) అనే వ్యక్తి ఆ గదిలో ఉండేవాడని, అతని గురించి చదివిన తరువాత అతనిలోని మంచి లక్షణాలు ఆమెను ఆకట్టుకుంటాయి.
అంతేకాకుండా ఆమె చిన్నప్పుడు విన్న కథకు సంబంధించిన పెయింటింగ్ ను అక్కడి గోడల పై చూస్తుంది. ఆ పెయింటింగ్ వేసింది చార్లీ అని తెలియయగానే ఎలాగైనా అతన్ని చూడాలనే ఆసక్తితో చార్లీని వెతుకుతూ వెళ్తుంది. ఆ ప్రయాణంలో ఆమెకు ఎదురైన సంఘటనలు ఏమిటి? ఆమె చివరికి చార్లీని కలుసుకుందా? ఆ తరువాత ఏమి జరుగుతుంది అనేది మిగతా కథ.
దుల్కర్ సల్మాన్ చార్లీ పాత్రలో జీవించాడు. తన నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. చార్లీ సింపుల్, మరియు ఫీల్ గుడ్ ఫిల్మ్. ఈ మూవీ మాధవన్ హీరోగా తమిళంలో ‘మారా’ అనే టైటిల్ తో రీమేక్ అయ్యింది. తెలుగులో కూడా డబ్ అయ్యింది. ఈ చిత్రానికి ఆహాలో మంచి రెస్పాన్స్ వచ్చింది.










నెయిమర్ మూవీలో మాథ్యూ థామస్ , నస్లెన్, జానీ ఆంటోని, షమ్మీ తిలకన్, విజయరాఘవన్ కీలక పాత్రలలో నటించారు. ఈ చిత్రానికి సుధీ మాడిసన్ దర్శకత్వం వహించారు. ఇక కథ విషయానికి వస్తే, ఇద్దరు ఫ్రెండ్స్ కుంజవ (మాథ్యూ థామస్) మరియు సింటో (నస్లెన్ ) ఫుట్బాల్ అభిమానులు, అయితే వారి తండ్రుల ఒకప్పుడు మంచి మిత్రులు అయినప్పటికీ మనస్పర్ధలతో విడిపోతారు. కుంజవ, సింటో ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగం చేయాలని భావిస్తారు. అదే సమయంలో కుంజవ డోనా అనే అమ్మాయిని ప్రేమిస్తాడు.
ఆమెకు కుక్కపిల్లలంటే ఇష్టమని తెలుసకుని ఒక వీధికుక్కను తీసుకుని వస్తాడు. దాని పేరే ‘నెయిమర్’. అది వచ్చిన తరువాత వారి జీవితాలలో వచ్చిన ఊహించని మలుపులు ఏమిటి అనేది మిగతా కథ. సినిమా మొదటి సగంలో, ప్రేక్షకులకు కుంజవా, సింటో మరియు వారి కుటుంబాలను పరిచయం చేశారు. ఆ తరువాత నెయిమర్ అనే కుక్క వారి జీవితంలోకి ఎలా వస్తుంది. ప్రతి ఒక్కరి పై ఎలాంటి ప్రభావం చూపింది. అనే విషయాన్ని వినోద భరితంగా సాగుతుంది.
సెకండాఫ్ గాబ్రియల్ కు వెంకట్ తో ఉన్న శత్రుత్వం మరియు ఒకరి మీద మరొకరు గెలవడానికి చేసే ప్రయత్నాలు. వారిద్దరి పరువు ప్రతిష్ఠలు ‘నెయిమర్’ తో ముడిపడి ఉండటం కొంచెం సస్పెన్స్ తో నడుస్తుంది. క్లైమాక్స్ లో డైరెక్టర్ సున్నితమైన భావోద్వేగాలతో ముడిపడిన అంశాలను చూపించారు. ఆ సీన్స్ సందేశాన్ని ఇవ్వడమే కాకుండా మూవీ చూసిన వారిని ఆలోచించెలా చేస్తాయి. కంటతడి పెట్టిస్తాయి.


