ఈ సృష్టిలో అన్నిటి కన్నా తియ్యని పదం అమ్మ. తాను కొవ్వొత్తిలా కాలిపోతూ తన పిల్లలకు వెలుగు నిస్తుంది. అమృతం ఎంత రుచిగా ఉంటుందో తెలియదు. కానీ అమ్మ ప్రేమ ముందు అమృతం కూడా దిగదుడుపే. అమ్మ ప్రేమ ఈ లోకాన్నే మరిపింపజేస్తుంది. అమ్మ అనే పదానికి అంతటి మాధుర్యం ఉంది.
దేవుడు అన్ని చోట్ల ఉండలేక అమ్మను సృష్టించాడని అంటుంటారు. ప్రపంచంలో ఏ దేశంలోనైనా, ఏ ప్రాంతలో నైనా, అక్కడ ఉండే సంస్కృతులు మారుతాయి. అయితే అమ్మ ప్రేమ మాత్రం మారదు. మనిషికి కొంచెం బాధ కలిగినా వెంటనే అమ్మను గుర్తు చేసుకుంటాం. అలాంటి అమ్మ దూరం అయితే తట్టుకోలేము. కానీ ఓ అక్కాచెల్లెలు దూరం అయిన అమ్మ కోసం ఏం చేశారో ఇప్పుడు చూద్దాం..
గుజరాత్ రాష్ట్రంలోని జునాగఢ్‌లో నివసిస్తున్న హీరాబెన్ తన ముగ్గురు కుమార్తెలతో పాటు జీవించేది. తన పిల్లల బాగోగులు చక్కగా చూసుకునేది. ఆమెకు బీపీ రావడంతో ట్రీట్మెంట్ తీసుకుంటుండగా గుండెపోటు వచ్చి కన్ను మూసింది. దాంతో ఆ ముగ్గురు సోదరీమణులు తల్లి లేని వారు అయ్యారు. తల్లి మరణించిన 6 నెలల వరకు ఆమె ఆలోచనలతోనే గడిపారు. అప్పుడు వారికి తల్లి తిరిగి తీసుకురాలేము కానీ ఆమె ఆమె విగ్రహాన్ని అయితే తీసుకురావచ్చని, 6 అడుగుల ఎత్తైన తల్లి విగ్రహాన్ని తేరు చేయించి ఇంట్లో ప్రతిష్టించారు.
హీరాబెన్ తన జీవితాంతం వరకు తన కుమార్తెలకు ప్రతి విషయంలో మద్దతుగా ఉంది. తమ తల్లి విగ్రహానికి రోజూ హారతి ఇస్తారు. తమ కళ్ళ ముందు అమ్మ ఉన్నట్టుగానే భావిస్తున్నారు. ఇప్పుడు ఆ సోదరీమణులు తమ తల్లి లేదని బాధపడటం లేదు. విగ్రహంలోనే తమ తల్లిని చూసుకుంటున్నారు.
రోజూ విగ్రహాన్ని చూస్తూ కబుర్లు చెబుతూ తల్లి లేని లోటును మర్చిపోతున్నామని చెబుతున్నారు ఈ అక్కచెల్లెల్లు. అలాగే ఆమె జ్ఞాపకార్థం ఒక ఫౌండేషన్‌ను ప్రారంభించి, దాని ద్వారా పలువురికి సంక్షేమ సహాయాన్ని అందిస్తున్నారు. అనాథ పిల్లలకు అన్నదానం, చదువు లేనిపిల్లలకు వారి చదువు కోసం సహాయం చేస్తున్నారు.
Also Read: ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన “నరసింహ నాయుడు” మూవీ రిలీజ్ టైం లో ఏం జరిగిందో తెలుసా..??

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అక్కినేని అఖిల్ హీరోగా భారీ బడ్జెట్ తో రూపొందిన చిత్రం ఏజెంట్. ఈ చిత్రాన్ని అనిల్ సుంకర నిర్మించాడు. ఈ చిత్రంలో మళయాల మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో నటించగా, హీరోయిన్ గా సాక్షి వైద్య నటించింది. రిలీజ్ కు ముందు ట్రైలర్, టీజర్ లతో భారీ అంచనాలను క్రియేట్ చేసిన ఏజెంట్, థియేటర్లలో రిలీజ్ అయ్యాక పూర్తిగా నిరాశపర్చింది. ఈ చిత్రం ఏప్రిల్ 28న రిలీజ్ అయిన మొదటి షో నుండే డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది. ఈ చిత్రం పెట్టిన బడ్జెట్ లో కనీసం 10 శాతం కూడా రికవరీ చేయలేకపోయింది.
ఏజెంట్ మూవీ డిజిటల్ రైట్స్‌ను ఓటీటీ ప్లాట్‌ఫామ్ అయిన సోనీ లివ్ కొనుగోలు చేసింది. మే19 నుండి స్ట్రీమింగ్ చేయబోతునట్లు అధికారిక ప్రకటన రిలీజ్ చేసింది. కానీ ఆ రోజు స్ట్రీమింగ్ కాలేదు. దాని పై సోనీ లివ్ ” ప్రస్తుతం ఏజెంట్ సినిమా అందుబాటులో లేదని, త్వరలోనే స్ట్రీమింగ్ అవనుంది” అని ట్వీట్ చేసింది. సినీ వర్గాలలో వినిపిస్తున్న టాక్ ప్రకారం, ఏజెంట్ రిలీజ్ కి 2,3 రోజుల ముందు కూడా ఎడిటింగ్ పని జరిగిందట.
మూవీ ఔట్ పుట్ ఎలావుందో సరిగ్గా చూడకుండానే విడుదల చేయడం వల్లే ఫలితం నిరాశపరిచింది. కనీసం ఓటీటీలో అయినా రీ ఎడిట్ చేసి కాస్త బెటర్ ఔట్ పుట్ ను రిలీజ్ చేస్తే మళ్ళీ ట్రోలింగ్ బారిన పడకుండా ఉండే ఛాన్స్ ఉంది. దాంతో ఈ మూవీని రీ ఎడిట్ చేసిన తరువాత ఓటీటీలో విడుదల చేయబోతున్నట్లు తాజాగా వినిపిస్తోంది. అయితే ఈ చిత్రం ఓటీటీలో ఎప్పుడు విడుదల అవుతుందో చూడాలి మరి.
దానికి కారణం ధోనీ మోకాలి నొప్పితో ఇబ్బంది పడడటం. ఇక ధోనీ కూడా ఈ సీజన్ మొదట్లో చాలా సార్లు రిటైర్మెంట్ పై సిగ్నల్స్ ఇచ్చాడు. అయితే రీసెంట్ గా ధోనీ మాట్లాడుతూ రిటైర్మెంట్ పై నిర్ణయించుకోవడానికి ఇంకా సమయం ఉందని అన్నాడు. 17 వ సీజన్‌కు ముందు రిటైర్మెంట్ పై ఒక నిర్ణయం తీసుకుంటానని చెప్పాడు. అయితే రాబోయే ఐపీఎల్ సీజన్ లో ధోనీ ఆడే అవకాశాలు ఉన్నాయి. ఒకప్పటిలా ఆడలేకపోయినప్పటికీ, జట్టు కోసం వ్యూహా రచనలో ధోనీ బ్రెయిన్ చురుగ్గా పని చేస్తోంది.
అందువల్ల రిటైర్మెంట్ గురించి ధోనికే వదిలేయాలని చెన్నై జట్టు మేనేజ్మెంట్ ఎప్పుడో నిర్ణయించుకుంది. నిజానికి ధోనీ ఆడితేనే చెన్నై జట్టు ఫ్రాంచైజీకి ఉపయోగం అని చెప్పవచ్చు. ఇక ధోనీ తన ఐపీఎల్ కెరీర్ ను పొడిగించుకునేలా ఇంపాక్ట్ ప్లేయర్ అనే నిబంధనను బీసీసీఐ తీసుకొచ్చింది. సాధారణంగా ధోనీ లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ చేశాడు. ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల అదనపు బ్యాట్స్ మెన్ లేక బౌలర్‌ను వాడుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ధోనీ బ్యాటింగ్ ఆర్డర్లో ఇంకా దిగువ స్థానంలో బ్యాటింగ్ చేయడానికి వీలవుతోంది.
16 వ సీజన్ లో ఇప్పటి దాకా చెన్నై జట్టు 15 మ్యాచ్‌లు ఆడింది. ధోనీ 62 బంతులను ఆడి 104 పరుగులు మాత్రమే చేశాడు. చెన్నై జట్టులో బాగా ఆడే బ్యాటర్లు ఉన్నారు. అందువల్ల ధోనీకి బ్యాటింగ్ చేసే ఛాన్స్ ఎక్కువగా రావడం లేదు. ధోనీ నుంచి చెన్నై జట్టు ఆశించేది నాయకత్వం, వ్యూహరచన మాత్రమే. ధోనీ బ్యాటర్ గా రాణించలేకపోయినా ఆ ఫ్రాంచైజీకి అంతగా బాధ లేదు. దీన్ని బట్టి 16 వ సీజన్‌కు ప్రారంభం అయ్యే ముందుగా బీసీసీఐ తెచ్చిన ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన ధోనీని మరి కొన్ని సంవత్సరాలు ఐపీఎల్ లో ఆడించడం కోసమే అన్నట్లుగా అనిపిస్తోంది.
ఐపీఎల్ ప్రైజ్‌మనీ మొత్తం:
పర్పుల్ క్యాప్ (అత్యధిక వికెట్లు తీసిన బౌలర్) :
ఇతర అవార్డులు, ప్రైజ్‌మనీ:
తన నట ప్రస్థానంలో ఎన్నో చిత్రాలలో అనేక పాత్రలను పోషించిన ఎన్టీఆర్ ఒక పాత్రను ఎంతగానో ఇష్టపడ్డారు. ఆ పాత్రలో నటించాలని ఎన్నో ఏళ్లు అనుకున్నారు. కానీ ఎన్ని సార్లు ప్రయత్నించిన కానీ ఆ పాత్రను చేయడం మాత్రం వీలుకాలేదు. అనుకున్న ప్రతిసారీ ఏదో ఒక ఆటంకం ఏర్పడేది. అలా ఆయన కోరిక తీరకుండానే ఈ లోకాన్ని విడిచారు. ఎన్టీఆర్ చేయాలనుకుని, చేయలేకపోయిన ఆ పాత్ర విప్లవ యోధుడు అల్లూరి సీతారామరాజు.
అల్లూరి సీతారామరాజు కథతో ఒక చిత్రాన్నినిర్మించాలని ఎన్టీఆర్ అనుకున్నారు. తోడు దొంగలు అనే చిత్రం తర్వాత ఎన్టీఆర్ అల్లూరి సీతారామరాజు చిత్రంలో నటించాల్సి ఉంది. కానీ అప్పటికే జయసింహ అనే చిత్రాన్ని ప్రకటించడంతో ఎన్టీఆర్ జయసింహ సినిమా తరువాత చేయాలని అనుకున్నారు. ఇక జయసింహ మూవీ పూర్తి అయ్యి రీలజ అవడం విజయం సాధించడం జరిగింది. అప్పుడు ఎన్టీఆర్ సీతారామరాజు పాత్రలో నటించే చిత్రం ప్రారంభం అయినా వేరే కారణాలతో ఆ చిత్రం ఆగిపోయింది.
అయితే పాండు రంగ మహత్మ్యం మూవీ తర్వాత ఈ చిత్రంలో నటించాలని ఎన్టీఆర్ అనుకున్నారు. అయితే ఆ టైం లో అల్లూరి సీతారామరాజు స్క్రిప్ట్ లో కథానాయకకు చోటు లేకపోవడంతో పడాల రామారావు కథను మార్చాలని ఎన్టీఆర్ ను అడిగారు. ఇక ఆ తర్వాత శోభన్ బాబుతో అల్లూరి సీతారామరాజు చిత్రాన్ని తీయాలని ఒక సంస్థ అనుకున్న ఆర్థిక సమస్యల వల్ల ఆ మూవీ వెనక్కు తగ్గింది.
అయితే అదే స్టోరీని సూపర్ స్టార్ కృష్ణ తీసుకోవడం, ఆ కథకు త్రిపురనేని మహారథి కొన్ని మెరుగులు దిద్దడం జరిగింది. సూపర్ స్టార్ కృష్ణ కెరీర్ లో అల్లూరి సీతారామరాజు 100వ చిత్రంగా తెరకెక్కింది. ఈ చిత్రం కృష్ణ కెరీర్ లోనే మైలు రాయిగా నిలిచింది. అద్భుతమైన విజయాన్ని సాధించింది.
ఎన్టీఆర్ కృష్ణ నటించిన ఈ చిత్రాన్ని చూసిన తరువాత అల్లూరి సీతారామరాజు సినిమా చేయాలని అనుకోలేదు. ఇక అల్లూరి సీతారామరాజు చిత్రంలో సూపర్ స్టార్ కృష్ణ అద్భుతమైన నటనను ఎన్టీఆర్ ప్రశంసించారు. అయితే అల్లూరి సీతారామరాజు సినిమాలో నటించనప్పటికీ, ఎన్టీఆర్ అల్లూరి పాత్రలో కొన్ని చిత్రాలలో కనిపించారు.
చరిత్ర మరచిన కథలను, గుర్తుంచుకోదగిన కథలను తెలుగు చిత్రాలు ఎక్కువగా చూపిస్తున్నాయి. అలా జాతి గర్విం చే ఎందరో ప్రముఖులు వెండితెరపై కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో రామ్‌చరణ్, నిఖిల్ ఓ మూవీని రెడీ చేయబోతున్నారు. చరణ్ ప్రొడ్యూసర్ గా నిఖిల్ హీరోగా ది ఇండియా హౌస్ అనే చిత్రం రాబోతోంది. దీనికి సంబంధించి టైటిల్ ప్రకటన జరిగింది. ఒక వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు.
అసలు ఈ ఇండియా హౌస్ అంటే ఏంటి?
ది ఇండియన్ సోషియాలజిస్ట్ పేపర్ కటింగ్ లో ఉన్న వారు ఎవరు?
1905 విప్లవం:
అలా భారత్ నుంచి వచ్చి, ఇండియా హౌస్ స్కాలర్ షిప్ తో చదువుకునేవారిలో ఒక లా స్టూడెంట్ వీర్ సావర్కర్. 1906లో వీర్ సావర్కర్ ఇండియా హౌస్ కు స్కాలర్ షిప్ తో వచ్చి, మెల్లగా ఓ నాయకుడిగా మారిపోయాడు. ఆ కాలంలో ఇండియా హౌస్ లో బ్రిటీషు అధికారులు ఎక్కువగా సోదాలు నిర్వహించేవారు. అయితే సోషియాలజిస్ట్ పత్రిక ఎడిటర్ అయిన కృష్ణవర్మ ఎంతగానో ఇబ్బంది పడేవాడు.
బ్రిటీషర్లు తనను చంపేస్తారని భయపడిన కృష్ణవర్మ 1907లో పారిస్ కు వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఆ పత్రిక బాధ్యతను, ఇండియా హౌస్ బాధ్యతలను వీర్ సావర్కరే తీసుకున్నాడు. సోషియాలజిస్ట్ పత్రికను ముందుకన్నా ఎక్కువ తీవ్రతతో ప్రచురించడం మొదలు పెట్టాడు. నాస్తికుడైనా సావర్కర్ హిందూత్వ అజెండాతో పనిచేసేవాడు.
శాంతిప్రియ 1987లో తమిళ చిత్రం ‘ఎంగ ఊరు పట్టుకారన్’ తో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. భానుప్రియ స్టార్ హీరోయిన్ గా చేసిన దర్శకుడు వంశీ శాంతి ప్రియని ‘మహర్షి’ అనే చిత్రంలో హీరోయిన్ గా తీసుకున్నాడు. తెలుగులో ఇదే ఆమెకు మొదటి చిత్రం. ఆయన తీసిన మహర్షి సినిమా అంతగా ఆడకపోయినా, ఆ సినిమాలోని పాటలు మాత్రం ఇప్పటికీ చెవుల్లో మారుమోగుతున్నాయి. శాంతి ప్రియ ఈ సినిమా ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. కానీ తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు.
దాంతో ఆమె తమిళ సినిమాల్లోను ఆ తరువాత ఎక్కువగా హిందీ సినిమాల్లో నటించింది. బాలీవుడ్ లో ఎక్కువ పాపులారిటీ పొందింది. దాంతో ఆమెను హిందీ నటిగానే పరిగణిస్తారు. శాంతి ప్రియ ప్రముఖ బాలీవుడ్ నటుడు, నిర్మాత అయిన వి శాంతారామ్ మనవడు సిద్ధార్థ్ రేను ప్రేమించి 1992లో పెళ్లి చేసుకున్నారు. సిద్ధార్థ్ కూడా బాలీవుడ్లో కొన్ని సినిమాల్లో నటించాడు. ఈ జంటకి ఇద్దరు కుమారులు. అయితే పెళ్లి తర్వాత కొన్ని విషయాల్లో శాంతి, సిద్ధార్థ్‌ల మధ్య గొడవలు జరిగేవని తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో వెల్లడించింది.
శాంతి ప్రియ మాట్లాడుతూ భర్త చనిపోయే ముందు కూడా మాకు చాలా గొడవలు జరిగాయని, అప్పటికి పెద్ద అబ్బాయి వయసు 10 ఏళ్లు, చిన్న బాబు వయసు 4 ఏళ్లు. తన భర్త చనిపోయే కూడా ఇద్దరికీ గొడవ జరిగిందని, ఒక విషయం మాట్లాడాలని పిలవగా, తను వెళ్లలేదని, ఆ తరువాత భోజన సమయంలో తింటూ ఉండగానే వెనక్కి పడి మరణించారని తెలిపారు. సిద్ధార్థ్ మరణం తర్వాత మళ్ళీ తన పిల్లల కోసం నటించడం ప్రారంభించింది. అప్పటి నుండి ఆమె చాలా హిందీ సీరియల్స్‌లో నటిస్తూ, తన పిల్లలను పెంచింది.
ఈ చిత్రాలలో ప్రతి రాష్ట్రం యొక్క సంప్రదాయం, సంస్కృతి, ఆహారం, అభివృద్ధిని చక్కగా చూపించారు. ఈ ఫోటోలను చూసిన నెటిజెన్లు ఆశ్చర్యపోతున్నారు. AI వివిధ రాష్ట్రాల్లో మెట్రో రైలు ప్రయాణాన్ని ఎంత అద్భుతంగా క్రియేట్ చేసిందో ఈ ఫోటోల ద్వారా చూడవచ్చు.
2. సూరత్ మెట్రోలో ప్రయాణికులను ఇలా చూపించారు. పైన వజ్రాలను AI సృష్టించింది.
3. హర్యానా మెట్రోలో చాలా మంది తమ సంప్రదాయ వస్త్రధారణలో ఉండగా, వారి చేతుల్లో కర్రలు పట్టుకుని హర్యానా సంస్కృతిని ప్రదర్శిస్తున్నారు.
4. చెన్నైమెట్రో అత్యంత ఆసక్తికరంగా సూపర్ స్టార్ రజనీకాంత్ కూర్చుని ప్రయాణం చేస్తుండటం కనిపిస్తుంది.
5. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో నక్సలిజం ఎక్కువ. అందువల్ల ఛత్తీస్‌గఢ్ మెట్రోలో ప్రయాణం ఈ విధంగా ఉంటుందని AI చిత్రాన్ని రూపొందించింది.
6. తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారిలో సంప్రదాయాలకు చాలా విలువను ఇస్తారు. అందువల్ల కన్యాకుమారి మహిళలు మెట్రోలో ప్రయాణిస్తే ఈ విధంగా ఉంటుందని AI అంచనా వేసింది.
7. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ దమ్ బిర్యానీకి ప్రసిద్ధి చెందింది. ఈ విషయం అందరికి తెలిసిందే. అందువల్ల హైదరాబాద్ మెట్రోలో AI బిర్యానీ ఉన్నట్టుగా రూపొందించింది.
8. ఉత్తర ప్రదేశ్ లో దుండగులు నాటు తుపాకులతో తిరుగుతూ ఉంటారు. అందువల్ల యూపీ మెట్రోలో ఈ విధంగా ఉంటుందని AI అంచనా వేసింది.
9. కోటా మెట్రోలో ఈ విధంగా ఉంటుందని AI ఫోటోను రూపొందించింది.
10. కోల్ కతా మెట్రోలో చేపలు పట్టుకుని ప్రయాణిస్తూన్నట్టుగా AI ఫోటోను రూపొందించింది.
11. బీహార్ రాష్ట్రంలో ప్రసిద్ధ వంటకం లిట్టి చోఖా. అందువల్ల అక్కడి మెట్రోలో లిట్టి చోఖా ఉన్నట్టుగా ఫోటోను AI రూపొందించింది.
12. బెంగుళూర్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ఎక్కువగా ఉంటారు. అందువల్ల అక్కడి మెట్రోలో సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ప్రయాణం చేస్తున్నట్టుగా ఫోటోను AI రూపొందించింది.
13. కాశ్మీర్ లో మంచు ఎక్కువగా ఉంటుంది. అందువల్ల కాశ్మీర్ మెట్రోలో మంచు కూరుస్తున్నట్టుగా AI ఫోటోను రూపొందించింది.
14. రాజస్థాన్ ఎడారి, ఒంటెలకు ప్రసిద్ధి చెందింది. అందువల్ల రాజస్థాన్ మెట్రోలో ఎడారిలో ఒంటెలు ఉన్నట్లుగా AI ఫోటోను రూపొందించింది.
15. ఒడిశా మెట్రోలో ఈ విధంగా ఉంటుందని AI ఫోటోను రూపొందించింది. 
AI రూపొందించిన ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజెన్లు ఈ చిత్రాలపై తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.
1. కామెరాన్ గ్రీన్:
వాంఖడే స్టేడియంలో 69వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ జట్టు పై కామెరూన్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి, సెంచరీ చేసి నాటౌట్ గా నిలిచాడు. లక్నో జట్టుతో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో, కామెరూన్ 23 బంతుల్లో 41 పరుగుల చేసి, అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. చురుకైన ఆసీస్ తన బ్యాటింగ్ విన్యాసాలతో ముంబై జట్టు బ్యాటింగ్ విభాగాన్ని బలోపేతం చేశాడు. 16 గేమ్‌లలో 160.28 అత్యుత్తమ స్ట్రైక్ రేట్‌తో 452 పరుగులు చేశాడు.
పూరన్ లక్నో జట్టు తరుపున కొన్ని అద్భుతమైన క్షణాలను అందించాడు. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన 15వ మ్యాచ్‌లో, బెంగళూరు జట్టు పై 19 బంతుల్లో 62 పరుగులతో అపూర్వమైన ఇన్నింగ్స్ ను ఆడాడు. అలాగే ఒక వికెట్ తీసి, లక్నో జట్టు అద్భుత విజయంలో కీలక పాత్రను పోషించాడు. ప్లేఆఫ్స్ వరకు లక్నో జట్టు ప్రయాణంలో, 172.94 అద్భుతమైన స్ట్రైక్ రేట్‌తో 15 మ్యాచ్‌లలో 358 పరుగులు చేశాడు.
మెజారిటీ హైదరాబాద్ జట్టు మ్యాచ్‌లలో, గొప్పగా ఆడిన ఏకైక ప్లేయర్ క్లాసెన్. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో బెంగళూరు జట్టు పై తన తొలి ఐపీఎల్ సెంచరీని బాదాడు. ఈ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ తన ఈ సీజన్ లో ఆడిన 12 మ్యాచ్‌ల్లో 448 పరుగులతో, 177.07 స్ట్రైక్ రేట్‌తో ముగించాడు. ఈ సీజన్లో సన్‌రైజర్స్ జట్టు తరఫున అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా నిలిచాయి.
1. జహీర్ ఖాన్:
2. వీరేంద్ర సెహ్వాగ్:
3. సచిన్ టెండూల్కర్:
4. సౌరవ్ గంగూలీ:
5. రాహుల్ ద్రవిడ్:
6. యువరాజ్ సింగ్:
7. రవిచంద్రన్ అశ్విన్:
8. విరాట్ కోహ్లీ:
9. రోహిత్ శర్మ:
10. మొహిందర్ అమర్నాథ్:
1983 ప్రపంచ కప్ ఫైనల్లో ఆఖరి వికెట్‌ను తీసింది కూడా అమర్నాథే. ఆయన తన కెరీర్లో ఎప్పుడు మ్యాచ్ ఆడిన తన లక్కీ ఎరుపు రుమాలును తన జేబులో పెట్టుకునేవాడు.