యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రాల్లో ‘ఆదిపురుష్’ సినిమా కూడా ఒకటి. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ఈ సినిమాని తెరకెక్కించాడు. 600 కోట్ల భారీ బడ్జెట్ తో టి.సిరీస్ సంస్థ ఈ సినిమాని నిర్మిస్తుంది.
ఆదిపురుష్ చిత్రం జూన్ 16న రిలీజ్ కానుంది. ఈ క్రమంలో చిత్ర యూనిట్ ప్రమోషన్లలో భాగంగా రిలీజ్ చేసిన చేసిన టీజర్ కు మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. మే 9 న ట్రైలర్ దేశవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ రోజు ఫ్యాన్స్ కోసం ట్రైలర్ ప్రీమియర్ స్క్రీనింగ్ చేశారు. మరి ట్రైలర్ రివ్యూ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
ప్రభాస్, కృతి సనన్ సీతారా చిత్రం ములుగా నటిస్తున్న ‘ఆదిపురుష్’. భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది. ఈ సినిమా ఇంతకుముందు రిలీజ్ చేసిన టీజర్ వి.ఎఫ్.ఎక్స్ నాసిరకంగా ఉందని, కార్టూన్ మూవీలా ఉందని సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోల్ చేశారు. అయినప్పటికీ ‘ఆదిపురుష్’ టీజర్ ట్రెండ్ అవడమే కాక, యూట్యూబ్ లో వంద మిలియన్లకు పైగా వ్యూస్ తో రికార్డ్స్ క్రియేట్ చేసింది. అయితే ‘ఆదిపురుష్’ పై ట్రోల్స్ రావడం, ప్రభాస్ లుక్ పై సెటైర్లు రావడం ప్రభాస్ అభిమానులకు అస్సలు నచ్చలేదు అని చెప్పవచ్చు.
ఈ క్రమంలో మే 9న సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు థియేటర్లలో, అదే సమయంలో యూట్యూబ్ లో ‘ఆదిపురుష్’ ట్రైలర్ రిలీజ్ కానుంది. ‘ఆదిపురుష్’ ట్రైలర్ 105 థియేటర్లలో రిలీజ్ కానుందని తెలుస్తుంది. ప్రభాస్ ఫ్యాన్స్ కోసం ఈరోజు హైదరాబాద్ లోని ఏఎంబీ థియేటర్ లో ట్రైలర్ ప్రీమియర్ ను ప్రదర్శించారు. ట్రైలర్ ను చూసిన అభిమానులు సోషల్ మీడియాలో వారి అభిప్రాయాలను తెలుపుతున్నారు.
ఒక ట్విట్టర్ యూజర్ ఇలా ట్వీట్ చేశారు. ట్రైలర్ నిడివి 3 నిమిషాల 22 సెకన్లు. ట్రైలర్ సీతను ఎత్తుకెళ్ళే సన్నివేశంతో మొదలై, రావణుడితో ఆఖరి పోరు వరకు జరిగే సంఘటనలతో కుడి ఉందని తెలిపారు. డీసెంట్ ట్రైలర్, టీజర్ కంటే వీఎఫ్ఎక్స్ బెటర్ గా ఉందని ట్వీట్ లో రాసుకొచ్చారు.
‘ఆదిపురుష్’ ట్రైలర్ ను చూసిన మరొక ట్విట్టర్ యూజర్ తన ట్వీట్ లో ” ట్రైలర్ లో 2 నిముషాల 32 సెకండ్ల వద్ద షాట్ గూస్బంప్స్ వచ్చేలా ఉందని బెస్ట్ వి.ఎఫ్.ఎక్స్ షాట్” అని రాసుకొచ్చారు. అలాగే మరొక ట్వీట్ లో ట్రైలర్ లోని చివరి షాట్ అందరినీ విస్మయానికి గురి చేస్తుందని తెలిపారు. 


‘ఆదిపురుష్’ ట్రైలర్ ప్రీమియర్ చూసిన వారందరూ ఈ చిత్రం గురించి పాజిటివ్ గా స్పందిస్తున్నారు. చూస్తుంటే ఈ మూవీ పై వచ్చిన నెగటివ్ టాక్ సినిమా విడుదల సమయానికి పూర్తిగా పాజిటివ్ గా మారే అవకాశం కనిపిస్తోంది.
Also Read: రియల్ TO రీల్..! అసలు నిజ జీవితంలో ఈ వ్యక్తి ఎవరో తెలుసా..?

భారత్ లోని గొప్ప డైరెక్టర్ల జాబితాలో వెట్రిమారన్ పేరు కూడా ఉంటుంది. ఆయన తీసింది 5 చిత్రాలే అయినా, ప్రతీ చిత్రం ఒక అద్భుతమే. ఆయన చిత్రాలకు అవార్డులు కూడా దాసోహం అవుతుంటాయి. ఇటీవలే ఆయన తెరకెక్కించిన ‘విడుతలై పార్ట్-1’ విడుదల అయ్యి, కోలీవుడ్ లో కోట్లు కొల్లగొడుతుంది. ఎక్కడో, ఎప్పుడో విన్న లేదా చూసిన సంఘటలనే వెట్రిమారన్ మూవీగా తెరకెక్కిస్తుంటాడు. ఇటీవల రిలీజ్ అయిన ‘విడుదల పార్ట్ 1’ కూడా అలాంటి చిత్రమే.
1987 లో తమిళనాడులోని ఒక ప్రాంతంలో జరిగే స్టోరీ ఇది. ప్రభుత్వ నిర్ణయాలను, చర్యలను ప్రజాదళం అనే విప్లవ పార్టీ వ్యతిరేకిస్తూ, ప్రభుత్వ కార్యకలాపాలను అడ్డుకుంటుంది. ఈ క్రమంలో పోలీసులకు మరియు ప్రజాదళం పార్టీకి మధ్య జరిగే సంఘర్షణ ఈ మూవీ. ఈ మూవీ రిలీజ్ అయిన తరువాత తమిళ నాడులో ఈ సినిమా పై చర్చలు మొదలయ్యాయి. 1980వ దశకంలో తమిళనాడులో ఎక్కువగా వినిపించిన పేరు కవి కు.కళీయపెరుమాళ్. ఈ పాత్రనే ‘విడుతలై పార్ట్-1’ చిత్రంలో విజయ్ సేతుపతి చేశారని తెలుస్తోంది.
కళీయపెరుమాళ్ అప్పట్లో కమ్యూనిస్టు పార్టీలో పని చేశారు. ఆ తర్వాత విభేదాలతో ఉద్యమంలో చేరారు. ఉపధ్యాయుడు అయిన పెరుమాళ్ కుల నిర్మూలన పై పోరాడారు. కుల నిర్మూలన, వర్గ విముక్తి కోసం కృషి చేయడం కోసం ఆయన ఉపాధ్యాయ వృత్తిని వదిలి, పూర్తి స్థాయి రాజకీయ కార్యకలాపాల్లో నిమగ్నమయ్యారు. పెన్నాడంలోని ప్రైవేట్ చక్కెర కర్మాగారంలో పని చేస్తున్న కార్మికుల హక్కుల కోసం కలియ పెరుమాళ్ ఆధ్వర్యంలో భారీ నిరసనలు జరిగాయి. కార్మికులు సమ్మెకు దిగారు.
దీంతో ఫ్యాక్టరీ యాజమాన్యం కలియపెరుమాళ్ను చంపేందుకు చాలాసార్లు ప్రయత్నించింది. రాత్రిపూట కలియ పెరుమాళ్ కూలిలను తీసుకెళ్ళి, రైతుల ఆధీనంలో ఉన్న భూముల్లోని వరిపంటను కోసి పేదలకు, పంపిణీ చేసేవాడు. ఈ ‘పంట ఉద్యమం’ గ్రామీణ ప్రాంతాల్లో అప్పట్లో మార్మోగింది. కలియపెరుమాళ్ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించారు. పొన్పరప్పికి చెందిన తమిళరసన్‌తో పాటుగా చాలామంది యువకులు కలియపెరుమాళ్ నాయకత్వంలో ఉద్యమంలో పాల్గొన్నారు.
రైలును బాంబుతో పేల్చే సీన్ ‘విడుతలై పార్ట్-1’ చిత్రంలో మొదటి సన్నివేశంలో కనిపిస్తుంది. అయితే 1987లో అరియలూరు సమీపంలోని మరుదైయార్త్ వంతెనను బాంబుతో పేల్చివేసిన ఘటన కూడా మూవీలో చూపించిన తరహాలోనే జరుగిందని అంటున్నారు. అప్పుడు వంతెనను పేల్చివేయడంతో, మలైకోట్ ఎక్స్‌ప్రెస్ రైలు కూలి 50 మందికి పైగా చనిపోయారు. ఆ కేసులో తమిళరసన్‌తో పాటు లిబరేషన్ ఆర్మీ మెంబర్స్ కేసు నమోదైంది. అదే ఏడాది సెప్టెంబర్‌లో పొన్పరప్పిలోని బ్యాంకులో చోరీకి ప్రయత్నించి తమిళరసన్‌తో పాటు ఐదుగురిని కొట్టి చంపారు.
హత్య కేసులో, కవి కలియపెరుమాళ్ మరియు అతని పెద్ద కుమారుడు వల్లువన్‌కు మరణశిక్ష విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. 1972లో కడలూరు కోర్టు రెండో కుమారుడు చోళ నంబియార్‌తో సహా ఐదుగురికి జీవిత ఖైదు విధించింది. వారు మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. వల్లువన్ మరణశిక్షను జీవిత ఖైదుగా మార్చారు. కలియపెరుమాళ్కు విధించిన మరణశిక్షను, ఇతరులకు విధించిన జీవిత ఖైదును హైకోర్టు సమర్థించింది.
అనంతరం కలియపెరుమాళ్ మరణశిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మారుస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. ఢిల్లీకి చెందిన జర్నలిస్ట్ కాళయపెరుమాళ్ మరియు అతని కుమారులు జైలులో ఉన్నారని తెలుసుకుని, సుప్రీం కోర్టులో కేసు వేశారు. విచారన తర్వాత, 1983లో సుప్రీంకోర్టు కలియపెరుమాళ్ తో పాటు ఇతరులకు పెరోల్ మంజూరు చేసింది.కొన్నేళ్ళ తర్వాత, సుప్రీం కోర్టు ఆదేశాలతో వారు పూర్తిగా శిక్ష నుండి విముక్తి పొందారు. కలియపెరుమాళ్ మే 16, 2007న మరణించారు.
కవి కలియపెరుమాళ్ రెండవ కుమారుడు చోళ నంబియార్ ‘విడుతలై పార్ట్-1’ సినిమా గురించి మాట్లాడుతూ, “తన తండ్రి ప్రజల కోసం పోరాడారు. ప్రజలు ఆయనకు అండగా నిలిచారు. ఆ విషయాన్ని అలాగే ఈ చిత్రంలో చూపించారు’’ అని చెప్పారు.
ప్రేమ, పెళ్లితో తారకరత్న, అలేఖ్యారెడ్డి జీవితంలో అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇద్దరు కలిసి జీవించడం కోసం అయిన వారందరికీ దూరమయ్యారు. హృదయంలోని భరించలేనంత బాధను చిరునవ్వుతో దాచేస్తూ ఇద్దరు కొత్త జీవితం మొదలుపెట్టారు. ఈ జంటకి ముగ్గురు పిల్లలు నిషిక, తాన్యారామ్, రేయా. తారకరత్న ఒక వైపు ఇండస్ట్రీలో కొనసాగుతూ, మరో వైపు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. తారకరత్న ఇప్పుడిప్పుడే తన కుటుంబానికి దగ్గర అవుతున్నారు. ఇలాంటి సమయంలోనే అర్థంతరంగా కన్నుమూశారు.
నందమూరి తారకరత్న మరణించి రెండు నెలలకు పైగా అవుతుంది. యువగళం పాదయాత్రలో గుండెపోటుతో కుప్పకూలిన తారకరత్న, సుమారు 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడి ఫిబ్రవరి 18న కన్నుమూశారు. జీవితాంతం తోడుంటాడని భావించిన భర్త హఠాన్మరణంతో ఆయన భార్య అలేక్య రెడ్డి వేదన వర్ణణాతీతం. తన ముగ్గురు పిల్లల కోసం కన్నీళ్లను దిగమింగుకుంటూ జీవిస్తోంది. తన భర్తతో గడిపిన మధుర క్షణాలను తలచుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది.
తాజాగా తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో తారకరత్నను తలచుకుంటూ “ఈ జీవితానికి సరిపడా మధురమైన జ్ఞాపకాలను ఇచ్చి వెళ్లావు. ఆ జ్ఞాపకాలతోనే ముందుకు వెళతాను. నా ఆఖరి శ్వాస వరకు కూడా నిన్నే ప్రేమిస్తుంటాను” అని రాసుకొచ్చారు. అలేఖ్యారెడ్డి మరో పోస్ట్ లో తన కుమారుడి ఫోటోతో పాటుగా తారకరత్న చిన్నప్పటి ఫోటోను కూడా షేర్ చేశారు. ఆమె చేసిన పోస్ట్ లను లైక్ చేస్తూ, ఆమెకు ఎప్పుడూ మా సపోర్ట్ ఉంటుందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
అలేఖ్యారెడ్డి తన పిల్లలను చూసుకుంటున్నారు. కెరీర్ విషయంలో ఆమె జాగ్రత్తగా ఆలోచించి, నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం తారకరత్న బిజినెస్ కు సంబంధించిన విషయాలను అలేఖ్యారెడ్డి చూస్తున్నారని తెలుస్తోంది. అలేఖ్యారెడ్డి ఇటీవల సామాజిక మధ్యమాల్లో యాక్టివ్ అవుతున్నారు. ఆమె ఏ పోస్ట్ పెట్టిన సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ గా మారుతోంది.
1. గౌరవం:
2. హలో బ్రదర్:
3. దుర్గ:
4. అదే నువ్వు అదే నేను:
5. నాగ చైతన్య – ఇంద్రగంటి చిత్రం :
6. నాగేశ్వరరావు :
1. నిజాం
1. ఈస్ట్ గోదావరి
3. సీడెడ్:
1. తిరుపతి
1. విశాఖపట్నం
హీరో ప్రభాస్ నటిస్తున్న భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న పౌరాణిక మూవీ “ఆదిపురుష్” జూన్ 16న రిలీజ్ కానుంది. ఈ క్రమంలో మూవీ ట్రైలర్ ను నభూతో నభవిష్యతి అనేలా రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. ఆదిపురుష్ త్రిడీ ట్రైలర్ మే 9న రిలీజ్ కానుంది. ఆ రోజు సాయంత్రం 5:30 నిమిషాలకు అటు థియేటర్స్ లోనూ, ఇటు సోషల్ మీడియా మధ్యమాలలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
తాజాగా ఈ చిత్రాన్ని చూసిన పరుచూరి గోపాలకృష్ణ ఈ చిత్రం గురించి మాట్లాడారు. ఈ సినిమా రవితేజ బాడీ లాంగ్వేజ్‌కు సెట్ అయ్యే మూవీ కాదని ఆయన అన్నారు. ఈ మూవీకి మూలం బెంగాలీ చిత్రం అని కొందరు చెప్పారని, దాని పేరుని టైటిల్ కార్డుల్లో వేస్తే, కథ క్రెడిట్స్ రైటర్ కి ఇచ్చినట్లు ఉండేదని అన్నారు. ఒక వ్యాధి చికిత్స కోసం వాడిన మెడిసిన్ వల్ల హీరో తండ్రి మెంటల్ కండిషన్ పాడైపోయి తన చెల్లిని చంపడం, ఆ దృశ్యాన్ని చూసి అతని తల్లి మరణిస్తుంది.
అనారోగ్యంతో ఉన్న తండ్రిని జాగ్రత్తగా చూసుకుంటూ, తన ఫ్యామిలీ ఇలా అవడానికి కారణమైన వారిని హీరో అంతం చేయడమే ‘రావణాసుర’ స్టోరీ. ఈ చిత్రం పగ, ప్రతీకారం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కింది. అయితే ఇలాంటి బ్యాక్ డ్రాప్ లో ఇప్పటి వరకు చాలా చిత్రాలు వచ్చాయి. అవి సక్సెస్ అయ్యాయి. అయితే ఈ మూవీ ప్లాప్ గా నిలిచింది.
రవితేజ సినిమా అనగానే అద్భుతంగా నటించే మాస్ మహారాజ్‌ను ఆడియెన్స్ ఊహించుకుంటారు. అలాగే ఆయన మూవీ అనగానే కామెడీ, ఫైట్స్, డైలాగ్స్, యాక్టింగ్ ఇలా అన్నీంటిని చూడాలని ఆడియెన్స్ థియేటర్‌కు వెళతారు. ఇక నా దృష్టిలో అయితే రవితేజ బాడీ లాంగ్వేజ్‌కు సెట్ అయ్యే క్యారెక్టర్ కాదు. అలాగే ఈ మూవీ కట్స్ చాలా ఎక్కువ అవడం వల్ల ప్రేక్షకుడు ఒక సీన్ లో ఫీల్, నెక్స్ట్ సీన్ లో మారుతుంది. ఫీల్ కొనసాగకపోవడం ఆ మూవీకి ప్రమాదకరం అని అన్నారు.
కట్స్‌తో పాటుగా ఎక్కువగా హత్యల సీన్స్ ఉన్నాయి. వరుసగా హత్యలు జరిగినప్పుడు పోలీసులు నిందితుడిని పట్టుకకోవడానికి ప్రయత్నిస్తుంటారు. అలాంటి సందర్భంలో హంతకుడు పోలీసుల నుంచి తప్పించుకుంటూ,వారికి దొరకకుండా వివిధ కోణాల్లో హత్యలు చేస్తుంటారు. కానీ ఈ మూవీలో జరిగే హత్యలన్నీ ఒకే విధంగా చూపించారు. అంతే కాకుండా హత్యలు చేసి కూడా పోలీసుల నుండి తప్పించుకోవచ్చు అనే మెసేజ్ ఆడియెన్స్ కి వెళ్ళే ఛాన్స్ ఉంది.
ఇంతకు ముందు వచ్చిన ఇలాంటి సినిమాల్లో నిందితుడిని చివరికి పోలీసులు పట్టుకున్నట్టు చూపించారు. ఈ చిత్రంలో అలా చూపించలేదు. ఫ్యామిలీతో కలిసి చూసేందుకు అనుకూలంగా లేవు అని ఆయన తన అభిప్రాయాన్ని తెలిపారు.
అఖిల్ అక్కినేని హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఏజెంట్’ మూవీ నిరాశపరిచిన విషయం తెలిసిందే. అయితే రిలీజ్ అయిన 4 రోజులకే ఈ చిత్ర నిర్మాత మూవీ ఫెయిల్యూర్ ను ఒప్పుకుంటు, తమ దగ్గర బౌండెడ్ స్క్రిప్ట్ లేకుండానే మూవీ మొదలు పెట్టామని చెప్పారు. ఆయన చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి గతంలో దర్శకులకు చేసిన సూచనలు ఇప్పుడు వైరల్ గా మారాయి. చిరంజీవి ఆరోజు చెప్పిందే ఏజెంట్ మూవీ విషయంలో జరిగిందని నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ఇండస్ట్రీలో కూడా ఇదే టాక్ వినిపిస్తోందని సమాచారం. కానీ చిరంజీవి అప్పుడు అలా చెప్పినపుడు ఆయన పై విమర్శలు, ట్రోల్స్ విపరీతంగా చేశారు. ఇప్పుడు ఆయన చెప్పిందే నిజం అని అంటున్నారు. వాల్తేరు వీరయ్య మూవీ సక్సెస్ మీట్ లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ యంగ్ దర్శకులకు పలు సూచనలు చేశారు. మూవీ షూటింగ్ మొదలు పెట్టడానికి ముందే దర్శకులు బౌండెడ్ స్క్రిప్ట్ సిద్ధం చేసుకోవాలని సూచించారు. చిత్రీకరణ మధ్యలో సందర్భానుసారంగా సన్నివేశంలో మార్పులు చేస్తే పర్లేదు.
అయితే అప్పటికప్పుడే సన్నివేశాన్ని రాసుకునే పద్ధతిని పద్దతిని,అప్పుడు కథ రాసుకునే విధానాన్ని మానుకోవాలని సూచించారు. సిద్ధం చేసుకున్న స్క్రిప్ట్ ను దాటి ఒక్క సన్నివేశాన్ని కూడా రూపొందించకుండా ముందుగానే పేపర్ వర్క్ చేసుకోవాలని సూచించారు. ఆ విధనగా నిర్మాతకి డబ్బు ఆదా అయ్యేలా చేయాలని, నిర్మాతలను బతికించాలని, నిర్మాతలు బాగుంటేనే ఇండస్ట్రీలో మరిన్ని చిత్రాలు వస్తాయని, అప్పుడే సినీ పరిశ్రమ బాగుంటుదని మెగాస్టార్ యువ దర్శకులకు గట్టిగానే చెప్పారు. మరి ఇక నుండి అయిన డైరెక్టర్స్ మెగాస్టార్ సూచనలు పాటిస్తారేమో చూడాలి.
ఈ లీగ్ ద్వారా భారత జట్టుతో పాటు, ఆయా దేశాల జాతీయ జట్లకు ఎంపికైన ఆటగాళ్లు చాలా మంది ఉన్నారు. ప్రస్తుతం ఐపీఎల్ తమ ప్రతిభను ప్రదర్శిస్తే చాలు, వారిని నేషనల్ టీం లోకి తీసుకుంటున్నారు. వెంకటేష్ అయ్యర్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ వంటి వారు ఐపీఎల్ ద్వారానే భారత జట్టులో స్థానం సంపాదించుకున్నారు. ఈ సీజన్ లో తన ఆటతో ఆకట్టుకుంటున్న ఆ యువ క్రికెటర్ పంజాబ్ జట్టు వికెట్ కీపర్ బ్యాటర్ జితేష్ శర్మ. జితేష్ వయసు 29 సంవత్సరాలు. అతని అతను ప్రదర్శన చూసి క్రికెట్ అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు సైతం ఫిదా అయ్యారు
పంజాబ్ జట్టు తరపున ఆడుతున్న జితేష్, కీపర్ గానే కాకుండా, విధ్వంసకర బ్యాటింగ్ తో గుర్తింపు సంపాదించు కున్నాడు. జితేష్ శర్మ బ్యాటింగ్ లో వీరేంద్ర సెహ్వాగ్ ని గుర్తు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో జితేష్‌కు ఇండియా టీ20 జట్టులో స్థానం కల్పించాలని రోజు రోజుకు డిమాండ్ కూడా పెరుగుతుంది. బుధవారం నాడు ముంబై జట్టుతో జరిగిన మ్యాచ్‌లో జితేష్ 27 బాల్స్ లో 5 ఫోర్లు, 2 సిక్స్ లతో 49 పరుగులు చేశాడు. పంజాబ్ జట్టు ఈ మ్యాచ్‌లో పరాజయం పాలైనప్పటికీ, ఈ ఇన్నింగ్స్‌తో జితేష్ స్థాయి మరింత పెరిగిందని చెప్పవచ్చు.
జితేష్‌కి ఐపీఎల్లో ఇదే టాప్ స్కోరు. గత ఏడాది ఢిల్లీ క్యాపిటల్స్ పై జితేష్ 44 పరుగులు చేశాడు. అయితే జితేష్ 5 లేదా 6 స్థానాల్లో బ్యాటింగ్ చేస్తాడు. అందువల్ల ఎక్కువ ఓవర్లు ఆడే అవకాశం అతనికి లేదు. అయినప్పటికీ అతనికి వచ్చిన ఛాన్స్ నే జితేష్ సద్వినియోగం చేసుకున్నాడు. చివరి ఓవర్లలో జితేష్ బ్యాటింగ్ విధ్వంసకరంగా ఉంటుంది.
ఈ యంగ్ ప్లేయర్ ని సరైన విధానంలో వాడినట్లయితే మరో ధోని కాగలడని క్రికెటర్లు నిపుణులు భావిస్తున్నారు. నిజం చెప్పాలంటే ధోని అనంతరం భారత జట్టుకు ధోని స్థాయిలో వికెట్ కీపర్ బ్యాటర్ లభించలేదు. అయితే ఆ లక్షణాలు జితేష్ శర్మలో కనిపిస్తున్నాయి. దీంతో సరిగ్గా వాడితే మరో ధోనీ అవుతాడని క్రికెట్ ఫ్యాన్స్ అంటున్నారు.
మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్స్ లో కోలీవుడ్ డైరెక్టర్ శంకర్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న ‘గేమ్ చేంజర్’ ఒకటి. ఈ చిత్రం పైన ప్రకటించినప్పటి నుండే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రాన్నిపాన్ ఇండియా మూవీ అనుకున్నారంత. రామ్ చరణ్ కి ఆర్ఆర్ఆర్ మూవీతో గ్లోబల్ స్టార్ గుర్తింపు తెచ్చుకోవడంతో ఈ మూవీని పాన్ గ్లోబల్ ఫిల్మ్ గా మారుతుందని కొందరు భావించారు.
అయితే ఈ మూవీ ఎవరు ఊహించని విధంగా ఈ మూవీ రీజనల్ చిత్రంగా తెరకెక్కుతుందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దర్శకుడు శంకర్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ సినిమా రీజనల్ మూవీ అని ఫిల్మ్ నగర్ లో టాక్. అది కూడా ద్విభాషా చిత్రం అని, తెలుగుకు దగ్గరగా పూర్తి స్థాయి తమిళంలో తెరకెక్కుతున్న సినిమా అని వినిపిస్తోంది.
రీజనల్ సినిమా అనే విషయం ప్రస్తుతం అందర్నీ షాక్ కి గురి చేస్తోంది. దీనిపై సోషల్ మీడియాలో నెటిజెన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. గత ఏడాది ఎన్నో అంచనాల మధ్యన వచ్చిన లైగర్ చిత్రంలో కూడా చాలావరకు హిందీనే ఉంటుంది. ఇపుడు గేమ్ ఛేంజర్ చిత్ర విషయంలో కూడా మేకర్స్ అదే తప్పు చేస్తున్నట్టుగా కామెంట్స్ వస్తున్నాయి.
రీసెంట్ గా డాన్స్ మాస్టర్ చైతన్య నెల్లూరులో ఒక హోటల్ లో ఉరి వేసుకుని మరణించాడు. అతను మరణించే ముందు ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేశాడు. అందులో అప్పుల వల్లనే ఇలా చేస్తున్నానని, జబర్దస్త్ లో ఎక్కువ రెమ్యూనరేషన్ ఇస్తారని, ఢీ షోలో తక్కువ రెమ్యూనరేషన్ ఇస్తారని తెలిపాడు. దాంతో మల్లెమాల వారు ఢీ షోలో పనిచేసేవారికి తక్కువ రెమ్యూనరేషన్ ఇవ్వడం వల్లనే అతను ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నాడని కామెంట్స్ చేస్తున్నారు.
తాజాగా అదిరే అభి ఈ విషయం పై స్పందించాడు. చైతన్య మాస్టర్ మరణం నేపథ్యంలో ఇండస్ట్రీకి కొత్తగా వచ్చే వారికి అదిరే అభి కొన్ని సూచనలు చేశాడు. అదిరే అభి తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో ఒక వీడియోను పంచుకున్నాడు. ఆ వీడియోలో సిని పరిశ్రమ లేదా టీవీ పరిశ్రమలోకి రావాలని అనుకునేవారికి, వచ్చే వారికి అంత తేలికగా అవకాశం దొరకదు. రెడ్ కార్పెట్ పరిచి స్వాగతం చెప్తారని అనుకోవడం, డబ్బులు బాగా ఇస్తారని అనుకోవడం చాలా పొరపాటు. ఇక్కడికి వచ్చాక ఎంతోమంది కష్టాలు పడి, తమ కడుపు మాడ్చుకొని, నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపితే తప్ప ఒక బ్రేక్ రాదు.
ఆ బ్రేక్ వచ్చిన తరువాత కూడా దానిని కొనసాగించడం కూడా పెద్ద విషయమే. ఇవ్వన్ని చెప్పడానికి కారణం ఇండస్ట్రీలోకి రావలనుకునేవారు ఇవ్వని తెలుసుకొని మానసికంగా సిద్ధపడి వస్తే, వచ్చాక ఏర్పడిన కష్టాలను ఎదుర్కోవచ్చు. అలాగే ప్లాన్ బి కూడా పెట్టుకుంటే కాస్త ధైర్యంగా ఉంటారు. అలాగే వచ్చిన ఆదాయంలో కూడా కొంచెం దాచుకోవడం వల్ల కష్టకాలంలో ఆ డబ్బు ఉపయోగపడుతుంది. ఒకటి రెండు చిత్రాలలో నటించిన తర్వాత కానీ, రెండు మూడు షోలలో చేసిన తర్వాత అయిన ఇబ్బందులు ఎదురు కావచ్చు.
అంత పెద్ద స్టార్ అమితాబచ్చన్ కూడా 1990 చివర్లో ప్రొడ్యూసర్ గా 100 కోట్లకు పైగా నష్టాలను చూశారు. అయితే అమితాబ్ ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ షోతో మళ్లీ డబ్బులు సంపాదించారు. కాబట్టి కెరీర్ లో ఏ టైమ్ లో అయినా ఇబ్బందులు రావచ్చు. వాటి కోసం జీవితానికి ముగింపు పలికే నిర్ణయాలు తీసుకోవద్దని అభి చెప్పుకొచ్చాడు. అలాగే షోకి వచ్చే రేటింగ్ ను బట్టి రెమ్యూనరేషన్ ఇస్తారని, జబర్దస్త్ షోకి రేటింగ్ ఎక్కువ వస్తుంది కాబట్టి అందులో పని చేసేవారికి రెమ్యూనరేషన్ ఎక్కువ ఇస్తారని చెప్పుకొచ్చారు.