kavitha
kavitha
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.
దేవుళ్ళ మహిమల గురించి, వాళ్లు వెలసిన పుణ్యక్షేత్రాల గురించి ఎన్నో రకాల కథలు వస్తూనే ఉంటాయి. అందులో కొన్ని నిజం కావచ్చు మరికొన్ని కల్పితం కావచ్చు. అలా వచ్చిన ఒక విషయం ఏంటి అంటే వెంకటేశ్వర స్వామికి వెనుక భాగంలో వెంట్రుకలు ఉండటం. మీలో చాలా మందికి ఈ విషయం గురించి తెలియకపోవచ్చు. అదేవిధంగా మీలో చాలా మందికి ఈ విషయం మీద ఇలాగే నిజమా కాదా అని అనిపిస్తూ ఉండొచ్చు. నిజం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
వెంకటేశ్వర స్వామి వారికి వెంట్రుకలని లేవట. శిల్పంలో ఉంటాయట. కానీ సహజమైన వెంట్రుకలు లేవట. అంతేకాకుండా స్వామి వారికి చెమట పడుతుంది అని, స్వామివారి దేహం మెత్తగా ఉంటుందని, పాదాలు మెత్తగా ఉంటాయని కూడా అంటూ ఉంటారు. కానీ ఆ విషయం కూడా నిజం కాదు.
స్వామి వారి యొక్క రూపం ప్రకృతికి సంబంధం లేనిది. అంటే స్వామి వారికి జన్మము, మరణము లేదు. కాబట్టి మానవ సహజమైన జుట్టు, దేహం మెత్తగా ఉండడం వంటి విషయాలను స్వామివారికి ఆపాదించలేము.మానవ శరీరం అశాశ్వతం. మానవ శరీరంపై ఏర్పడే జుట్టు కూడా కెరటిన్ అనే పదార్థంతో తయారవుతుంది. కాబట్టి జుట్టు కూడా అశాశ్వతం.
మానవ శరీరంలో జరిగే ఇలాంటి విషయాలు స్వామివారికి జరుగుతాయి అనడం తప్పు. స్వామివారు అప్రాకృతులు. వెంకటేశ్వర స్వామి కి ఉన్న కళ్ళు, ముక్కు, చిరునవ్వు అన్ని సహజంగా ఏర్పడినవి. అంతేకాకుండా వెంకటేశ్వరస్వామి చేతి మీద దైవీకమైన రేఖలు కూడా ఉంటాయట. స్వామి వారి దేహం శిల్పులు చెక్కిన దేహం కాదు. స్వామివారు స్వయంగా వచ్చి నిలిచారు.
స్వామి వారి విగ్రహం ఏ పదార్థంతో తయారు చేశారు అని కూడా ఎవరికీ తెలియదట. ఆగమశాస్త్రం లో స్వామి వారి విగ్రహం ఒక సాలిగ్రామ శిలాఫలకం అని చెప్తారట. ముందర వైపు కంటే కూడా వెనక వైపు నుండి స్వామివారు ఇంకా అందంగా ఉంటారట. స్వామివారికి వెనుక వైపు శిరస్సు దగ్గర చక్రం ఉంటుందట. ఆ చక్రాన్ని శిరస్చక్రం అంటారట.
శిరస్చక్రం కింద మెడ వరకు ఒంపులు తిరిగిన వెంట్రుకలు ఉంటాయట. యజ్ఞోపవీతం, కౌపీనం ఉంటాయట. అంతేకాకుండా స్వామివారి చేతిలో ఉన్న బాజీ బందులు, మెడలో ఉన్న ఆభరణాలను కట్టిన పట్టు దారాల యొక్క కుచ్చులు కూడా ఉంటాయట. స్వామివారి చతుర్భుజాలు కూడా ఇంకా గంభీరంగా కనిపిస్తాయట.
watch video:
also watch:
ముగ్గురు సూపర్స్టార్లు ఆ బంగ్లాలోకి వెళ్ళాక అంతా కోల్పోయి, దివాళా తీశారు..! వారు ఎవరంటే..?
కొన్ని ఇళ్ళు చూడడానికి చాలా అందంగా, ఖరిదైనవిగా ఉంటాయి. అయితే అందులోకి వెళ్ళిన వారు సర్వం కోల్పోయి, దానిని అమ్ముకోవాల్సిన పరిస్థితులు ఎదురవుతుంటాయి. వాటిని హాంటెడ్ లేదా శాపగ్రస్త’ బంగ్లా అని పిలుస్తుంటారు. ఇలాంటివి ఎక్కువగా సినిమాలలో కనిపిస్తుంటాయి. అయితే వాస్తు జ్యోతిష్యం వంటి వాటిని నమ్మేవారు, ఇలాంటి వాటిని నమ్ముతూ ఉంటారు.
కానీ కొందరు ఇలాంటివాటిని మూఢనమ్మకాలుగా చూస్తుంటారు. అయితే ఇలాంటి బంగ్లానే ముంబైలో ఉంది. ముంబైలో కార్టర్ రోడ్ లో ఉన్న’ఆశీర్వాద్’ బంగ్లా బాలీవుడ్‌కు శాపంగా మారింది. ఇందులో జీవించిన ముగ్గురు సూపర్ స్టార్లు కెరీర్‌ను కోల్పోయి, చివరికి ఈ ఇంటిని అమ్మేశారు. వారెవరో ఇప్పుడు చూద్దాం..
1. భరత్ భూషణ్:
‘ఆశీర్వాద్’ బంగ్లాను 1950ల ప్రారంభంలో ఆంగ్లో-ఇండియన్ ఫ్యామిలీ నుండి కొనుగోలు చేశారు. అప్పటికే అతను ఎన్నో హిట్ సినిమాలలో హీరోగా నటించి, బాక్సాఫీస్ కింగ్ పేరు తెచ్చుకున్నారు. ఈ ఇంటిని సొంతం చేసుకున్న భరత్ భూషణ్ 50ల మొదట్లో బైజు బావ్రా, గేట్‌వే ఆఫ్ ఇండియా, మీర్జా గాలిబ్ మరియు బర్సాత్ కీ రాత్ లాంటి హిట్లను సాధించాడు. కానీ దశాబ్దం ముగిసే నాటికి వరుసగా సినిమాలు ఫ్లాప్ కావడంతో చాలా అప్పుల పాలయ్యాడు. దాంతో ఆ బంగ్లాను అమ్ముకోవాల్సి వచ్చింది. దాంతో ఆ బంగ్లాలో నివసించే వారికి దురదృష్టాన్ని తెస్తుందని పలు కథనాలు వెలువడటం ప్రారంభించాయి.
2. రాజేంద్ర కుమార్:
రైజింగ్ స్టార్ అయిన రాజేంద్ర కుమార్ 1960లలో, ఈ బంగ్లా గురించి తెలుసుకున్నారు. దానిపై వస్తున్న కథనాల వల్ల 60,000 రూపాయల తక్కువ మొత్తానికి కొనుగోలు చేశారు. రాజేంద్ర కుమార్ ఆ బంగ్లాకు తన కుమార్తె డింపుల్ పేరు పెట్టాడు. ఫ్రెండ్ మనోజ్ కుమార్ సలహా మేరకు, శాపం నుండి బయటపడటానికి అందులో పూజ చేసాడు. ఆ తరువాత అతనికి హిట్ల మీద హిట్లు వచ్చి జూబ్లీ కుమార్‌గా పాపులర్ అయ్యారు. ఈ ఇల్లు తనకి అదృష్టమని అనుకున్నారు. కానీ 1968-69లో, అతని సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యి, ఆర్థిక సమస్యల్లో చిక్కుకుని తనకు ఇష్టమైన ఇంటిని విక్రయించవలసి వచ్చింది.
3. రాజేష్ ఖన్నా:
70వ దశకంలో, అప్పటికి అప్ కమింగ్ హీరోగా ఉన్న రాజేష్ ఖన్నా కొనుగోలు చేశారు. ఆ తరువాత అతి తక్కువ సమయంలోనే రాజేష్ ఖన్నాను సూపర్ స్టార్ గా అవతరించాడు. బాలీవుడ్ లో అతిపెద్ద నటుడుగా నిలిచాడు. ఆ బంగ్లాకు ఆశీర్వాద్ గా నామకరణం చేశాడు. అమితాబ్ జల్సా, షారూఖ్ మన్నత్ లానే, అప్పట్లో రాజేష్ ఖన్నా ఆశీర్వాద్ ముంబైలో ప్రత్యేక ఆకర్షణగా మారింది.
కానీ 70వ దశకం చివరి నాటికి, సూపర్ స్టార్ పేరుని కోల్పోయాడు. ఆయన రెప్యుటేషన్ కూడా తగ్గిపోయింది. భార్య విడిపోయింది. ఆయన అదే బంగ్లాలో ఒంటరిగా, మరణించే వరకు బంగ్లాలోనే ఉన్నారు. ఆ బంగ్లాను రూ.90 కోట్లకు ఓ పారిశ్రామికవేత్తకు విక్రయించారు. ఫిబ్రవరి 2016లో కొత్తదాన్ని నిర్మించడానికి ఆ బంగ్లాను పడగొట్టారు. అలా ముగ్గురు సూపర్ స్టార్లకు నిలయమైన ఆ బంగ్లా జర్నీ ముగిసింది.
Also Read: “శాకుంతలం”లో ఈ సీన్ గమనించారా..? చూసుకోవాలి కదా ఎడిటర్ గారూ..?
SUCCESS STORY: ఎంసెట్ లో 186 ర్యాంక్…ప్లేసెమెంట్స్ లో 50 లక్షల ప్యాకేజీ..! ఈ హైదరాబాద్ అమ్మాయి సక్సెస్ స్టోరీ ఏంటంటే.?
నేటి యువత గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ, కాలక్షేపం చేయకుండా తమ చదువుతో పాటు ఇతర కోర్సులు చేసి, ప్రైవేట్ ఉద్యోగాల వైపు వెళ్తున్నారు. చిన్న వయసులోనే పెద్ద పెద్ద కంపెనీల్లో మంచి ప్యాకేజీతో జాబ్స్ ను సాధిస్తున్నారు. వారి కలను నెరవేర్చుకోవమే కాకుండా వారి తల్లిదండ్రులకు తమ భవిష్యత్తు పై ఉన్న చింతను తీరుస్తున్నారు.
ప్రధానంగా ఐటి రంగంలో మంచి ప్యాకేజీతో జాబ్ లభిస్తే, వారి జీవితం సెట్ అయినట్టే. వారు అప్పటి దాకా పడిన కష్టాన్ని సైతం పోగొట్టేది ఉద్యోగం మరియు ప్యాకేజీ అని చెప్పవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం రెసిషన్ పీరియడ్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. దీనివల్ల పెద్ద కంపెనీలన్ని ఉద్యోగులను తొలగిస్తున్నాయి. కొత్తగా జాబ్స్ దొరకడం చాలా కష్టంగా మారింది.
ఇలాంటి తరుణంలో ఒక అమ్మాయి పదో, ఇరవై కాకుండా ఏకంగా50 లక్షల రూపాయల ప్యాకేజీతో జాబ్ ను సాధించింది. ఆమెనే చల్లా సాయి కృతి. సాయి కృతి హైదరాబాద్ లోని జేఎన్టీయూ స్టూడెంట్. ప్లేస్‌మెంట్స్ లో ప్రముఖ ఐటీ సంస్థ డీఈషా గ్రూప్‌లో 52 లక్షల రూపాయల వార్షిక వేతనంతో జాబ్ ను సాధించింది. సాయికృతి మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు. చిన్నప్పటి నుండి హైదరాబాద్ లోనే చదువుకున్నానని, ఆమె తండ్రి మహీధర్ ప్రాజెక్ట్ మేనేజర్ గా వర్క్ చేస్తున్నారని వెల్లడించింది.తల్లి ఉషారాణి గృహిణి, అక్క సుచిత సైతం ఐటీ ఇండస్ట్రీలో పనిచేస్తుందని అన్నారు. మానసికంగా తన ఎదుగుదలలో ఫ్యామిలీ మెంబర్స్ పాత్ర కీలకమని ఆమె చెప్పుకొచ్చారు. చదువు విషయంలో ఎప్పుడూ ఇంట్లో నుండి ఒత్తిడి లేదని, టెన్త్ క్లాస్ లో 10 పాయింట్లు వచ్చినట్టుగా తెలిపారు. ఇంటర్మీడియట్ లో 985 మార్కులు తెచ్చుకున్నట్లు తెలిపారు. ఎంసెట్ లో 186వ ర్యాంక్ వచ్చిందని, సాఫ్త్ వేర్ ఫీల్డ్ పై ఉన్న ఇంట్రెస్ట్ తో జేఎన్టీయూలో కంప్యూటర్ సైన్స్ లో చేరినట్టు తెలిపింది.
జాబ్ కోసం 3 రౌండ్లలో ఇంటర్వ్యూ జరిగిందని, ఆన్ లైన్ టెస్ట్ కాలేజ్ లోనే పెట్టారని, ఐదుగురు ఫైనల్ రౌండ్ కు హాజరైతే తను మాత్రమే ఎంపికవడం సంతోషంగా ఉందని చెప్పుకొచ్చారు. టెక్స్ట్ బుక్స్ చదవడానికే ఎక్కువ శాతం ప్రాధాన్యత ఇచ్చానని అన్నారు. ఇంటర్వ్యూకు వెళ్ళడానికి ముందు కోర్ సబ్జెక్ట్ లు ఎక్కువగా చదివానని, ఓపికగా ప్రయత్నిస్తే విజయం దక్కుతుందని సాయికృతి వెల్లడించారు. ఆమె పై నెట్టింట్లో ప్రశంసలు కురుస్తున్నాయి.
Also Read: నేను చేసిన తప్పు ఇలా అవుతుందనుకోలేదు…10 రోజులుగా హాస్పిటల్ లో నరకం చూస్తున్నా అంటూ ప్రియాంక సింగ్.!
OTTలో సెన్సేషన్ సృష్టిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్..చూడాలంటే ధైర్యం కావాలంట.!
హారర్ సినిమాలను చూడటానికి చాలామంది ఆసక్తి చూపుతారు. హారర్ సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందని చెప్పవచ్చు. ఈ సినిమాలను కొందరు ఎగ్జైటింగ్ చూస్తుంటారు. మరీ కొందరు మూవీ చూస్తున్నంత సేపు భయపడుతూ ఉంటారు.
కొందరు సినిమ చూసినప్పుడు భయపడకున్నా, ఆ తరువాత ఆ మూవీలోని భయపెట్టే సన్నివేశాలను గుర్తు చేసుకుని మరీ భయపడుతుంటారు. కానీ హారర్ సినిమాలను చూడడం మాత్రం మానేయరు. అలాంటి భయపెట్టే ఒక వెబ్ సిరీస్ ‘దహన్’. ఈ సిరీస్ కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం..
బాలీవుడ్ నటి టిస్కా చోప్రా లీడ్ రోల్ లో నటించిన సిరీస్ దహన్. ఈ సిరీస్ హారర్ థ్రిల్లర్ స్టోరీతో తెరకెక్కింది. 2022 లో రిలీజ్ అయిన ఈ వెబ్ సిరీస్ డిస్నీప్లస్ హాట్‌స్టార్ లో హిందీ, తమిళం, తెలుగు, మలయాళ భాషల్లో రిలీజైంది. 9 ఎపిసోడ్స్ గా రూపొందిన ఈ సిరీస్ ప్రస్తుతం హిందీలో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ సిరీస్ లో టిస్కా చోప్రా, రాజేశ్ తైలాంగ్, సౌరభ్ శుక్లా, తదితరులు నటించారు.
ఇక ఈ సిరీస్ కథ విషయనికి వస్తే, రాజస్థాన్‌లోని మారుమూల ప్రాంతం శిలాస్ పూర్. ఆ ప్రాంతంలో ఉన్న కొండల్లో చాలా విలువైన ఖనిజాలు ఉంటాయి. ప్రభుత్వం వాటిని బయటికి తీయడానికి ప్రయత్నాలు చేస్తుంటుంది. అయితే అక్కడి ప్రజలు మైనింగ్ పనులు జరగకుండా అడ్డుకుంటారు. మైనింగ్ పనులు జరిగేలా చూడడం కోసం గవర్నమెంట్ కలెక్టర్ అవని (టిస్కా శర్మ)కి అప్పగిస్తుంది. శిలాస్ పూర్ ఓ ఆత్మ వల్ల శపించబడిందని నమ్ముతుంటారు. అక్కడ ఓ ఆత్మను బంధించి, పూజారి(సౌరభ్ శుక్లా) కాపలాగా ఉంటాడు. నిత్యం ఆ ఆత్మ శాంతికి పూజలు చేస్తూ ఉంటాడు. ఊరిలో ఎవరికి ఏం సోకినా పూజారే వదిలిస్తూ ఉంటాడు. ఆ ఊరిలో మరోవైపు మైనింగ్ జరిపించడం కోసం అవని వస్తుంది.
అరుదైన ఖనిజ సంపదను తవ్వనివ్వకుండా కావాలనే కొందరు నాటకాలు ఆడుతున్నారు భావిస్తుంది. ఆ తరువాత ఆమె జీవితంలో కొన్ని ఊహించని ఘటనలు జరుగుతాయి. ఏది వాస్తవం? ఏది అబద్ధం అని తేల్చుకోలేని స్థితికి వస్తుంది. మైనింగ్ మొదలు పెట్టడంతో ఆత్మను బంధించిన రాయికి పగుళ్లు ఏర్పడతాయి. ఆ తర్వాత ఆ గ్రామంలో ఊహించని సంఘటనలు జరుగుతాయి. మనుషులు విచిత్రంగా ప్రవర్తించడం మొదలుపెడతారు. నిజంగా ఆత్మ ఉందా? ఆ ఊరిలో ఏం జరుగుతోంది? మైనింగ్ చేయడానికి, ఆత్మకు మధ్య ఉన్న సంబంధం ఏమిటి ? చివరకు ఏం జరిగింది అనేది మిగిలిన కథ.
కంటోన్మెంట్ యువ ఎమ్మెల్యే లాస్య నందిత తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. పటాన్చెరు ఓఆర్ఆర్ మీద జరిగిన ఘోర ప్రమాదంలో మృతి చెందడం తెలంగాణలో సంచలనంగా మారింది. ఆమె మరణం పట్ల పలువురు రాజకీయ నాయకులు విచారం వ్యక్తం చేస్తున్నారు.
లాస్య నందిత కుంటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు పలువురు నాయకులు సానుభూతిని తెలియజేశారు. అయితే ఆమెకు గత రెండునెలలో ఇది మూడవ యాక్సిడెంట్ అని తెలుస్తోంది.
ఎమ్మెల్యే లాస్య నందిత ప్రయాణిస్తున్న కారు యాక్సిడెంట్ జరుగగా, అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. అయితే ఆమె రీసెంట్ గా వరుసగా ప్రమాదాలకు గురయ్యారు. ఆమెను మృత్యువు వెంటాడుతోందా అన్న విధంగా వరుస ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. 2నెలల క్రితం సికింద్రాబాద్‌లో జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్యే లాస్య నందిత వెళ్ళిన సమయంలో ఆమె ఎక్కిన లిఫ్ట్ సడెన్‌గా కిందకి వెళ్ళింది. దాంతో ఆమె లిఫ్ట్‌లో ఇరుక్కుపోయారు. ఆమె వ్యక్తిగత సిబ్బంది అప్రమత్తమై లిఫ్ట్ తలుపులు బద్దలు కొట్టి, ఆమెను సురక్షితంగా వెలుపలికి తీసుకువచ్చారు. ఎమ్మెల్యే అయిన తారువాత ఆమెకు అలా మెుదటిసారి ప్రమాదం జరిగింది.
ఆ తర్వాత 10 రోజుల (ఫిబ్రవరి 13) క్రితం బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ నల్గొండలో నిర్వహించింది. ఆ సభకు వెళ్ళి, తిరిగి వస్తున్న సమయంలో లాస్య నందిత కారు నార్కట్‌పల్లి దగ్గర అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న రెయిలింగ్ ఢీ కొట్టింది. ఈ యాక్సిడెంట్ హోంగార్డు మృతి చెందగా, లాస్య నందితకు స్వల్పగాయాలు అయ్యాయి. నేడు జరిగిన మూడవ ప్రమాదంలో లాస్య నందిత ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇప్పటి దాకా కారు రెయిలింగ్‌ను ఢీకొట్టడం వల్ల యాక్సిడెంట్ జరిగిందని అందరు భావిస్తున్నారు. తాజాగా పోలీసులు కారును పరిశీలించి, రెయిలింగ్‌ను ఢీకొనడం వల్లే ఇంత పెద్ద యాక్సిడెంట్ జరగలేదని, రెయిలింగ్‌తో పాటు, లాస్య నందిత కారు ముందున్న లారీని కూడా ఢీ కొట్టినట్లు సందేహం వ్యక్తం చేస్తున్నారు.
అతివేగంగా వస్తున్న కారు ముందున్న లారీని ఢీకొట్టినట్లుగా ఆనవాళ్లు ఉన్నాయి. కారు బ్యానెట్ పై పార్ట్ పూర్తిగా ధ్వంసం అయ్యింది. అలాగే కారుకు ఎడమవైపు ముందు చక్రం కూడా పూర్తిగా ధ్వంసమైంది. అంతేకాకుండా మీటర్ బోర్డ్ 100 కి.మీ.. స్పీడ్ దగ్గర ఆగినట్లుగా పోలీసులు గుర్తించారు. ఔటర్ రింగ్ రోడ్ రెయిలింగ్‌ను కారు ఢీ కొడితే ఇంత పెద్ద యాక్సిడెంట్ జరగకపోవచ్చని నిపుణులు కూడా అంటున్నారు.
Also read: నేను చేసిన తప్పు ఇలా అవుతుందనుకోలేదు…10 రోజులుగా హాస్పిటల్ లో నరకం చూస్తున్నా అంటూ ప్రియాంక సింగ్.!
Bramayugam movie review: “మమ్ముట్టి ” నటించిన లేటెస్ట్ హారర్ థ్రిల్లర్ మూవీ ఎలా ఉంది..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!
స్టార్ స్టేటస్ ను,ఇమేజ్ ను పక్కనపెట్టి డిఫరెంట్ కంటెంట్ బేస్డ్ చిత్రాలు చేయడం మలయాళ మెగాస్టార్ మమ్ముట్టికే చెల్లిందని చెప్పవచ్చు. ‘కాదల్ ది కోర్’లో గే పాత్ర , రోర్షాక్’లో వైవిధ్యమైన సీన్స్ చేసి అందరినీ ఆశ్చర్యపడిచాడు.ఒకవైపు కమర్షియల్ సినిమాలు చేస్తూనే, మరోవైపు డిఫరెంట్ కంటెంట్ చిత్రాలు చేస్తున్నారు. ఆయన నటించిన లేటెస్ట్ మూవీ ‘భ్రమయుగం’ తెలుగు వెర్షన్ నేడు విడుదలైంది. ఆ మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
- చిత్రం : భ్రమయుగం
- నటీనటులు : మమ్ముట్టి, అర్జున్ అశోకన్, సిద్ధార్ధ్ భరతన్ తదితరులు.
- నిర్మాత : చక్రవర్తి రామచంద్ర, ఎస్.శశికాంత్
- దర్శకత్వం : రాహుల్ సదాశివన్
- సంగీతం : క్రిస్టో జేవియర్
- విడుదల తేదీ : ఫిబ్రవరి 23, 2024
స్టోరీ:
పానన్ అనే తక్కువ కులానికి చెందిన తేవన్(అర్జున్ అశోకన్) జానపద గాయకుడు. తన తల్లి వద్దకు వెళుతూ ఒక అడవిలో దారి తప్పి, ఒక పాడుబడ్డ భవనంకు చేరుకుంటాడు. అందులో ఇద్దరు మనుషులుమాత్రమే నివసిస్తుంటారు. ఆ ఇంటి యజమాని కొడుమోన్ పొట్టి(మమ్ముట్టి), అతని వంటమనిషి (సిద్ధార్థ్ భరతన్). తక్కువ వర్గానికి చెందిన తేవన్ ను కొడుమోన్ అతిథిగా భావించి, తనతో పాటు సమానంగా చూసుకుంటాడు. కానీ ఆ తరువాత కొడుమోన్ తనను ట్రాప్ చేశారని అర్ధం చేసుకుంటాడు. దాంతో ఆ భవనం నుంచి పారిపోవాలని తేవన్ ప్రయత్నిస్తాడు. కానీ ఎన్నిసార్లు ప్రయత్నించినా, తిరిగి ఆ భవనంలోకే వస్తూ ఉంటాడు. అలా జరగడానికి కారణం ఏమిటి? కొడుమోన్ పొట్టి ఎవరు? ఆ ఇంట్లో ఉన్న మాయ ఏమిటి ? తేవన్ ఆ ఇంటి నుంచి తప్పించుకున్నాడా? చివరకు ఏమైంది? అనేది మిగతా కథ.
రివ్యూ:
రాహుల్ సదాశివన్ దర్శకత్వంలో తెరకెక్కిన ప్రయోగాత్మక సినిమా భ్రమయుగం. భ్రమయుగం టైటిల్ కు తగ్గట్లుగానే ఆడియెన్స్ ను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. కేవలం 3 క్యారెక్టర్లతో రెండున్నర గంటల చిత్రాన్ని నడిపించడం తెలికేనా? ప్రస్తుత కాలంలో బ్లాక్ అండ్ వైట్ సినిమాని ఆడియెన్స్ చూస్తారా? ఎలాంటి హీరోయిజం లేకుండా, స్టార్ హీరోని సినిమా మొత్తం ఒక్క డ్రెస్ లోనే చూపిస్తే, ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేస్తారా? లాంటి అనుమానాలకు ఈ మూవీ సమాధానం.
తేవన్ పాడుబడ్డ ఇంట్లోకి వెళ్లడంతో స్టోరీ ఊపందుకుంటుంది. అక్కడి నుండి ఆ ఇంట్లో సీన్స్ ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటాయి. డైరెక్టర్ ప్రతీ ఫ్రేమ్ ను తీర్చిదిద్దిన విధానం ఆకట్టుకుంటుంది. తేవన్ ఇంట్లో నుండి బయటపడాలని ప్రయత్నించడం, అవి విఫలం కావడం, అందుకు కారణం ఏమిటో తెలుసుకోవడానికి చేసే ప్రయత్నంలో వచ్చే సన్నివేశాలు ఆడియెన్స్ ని కుర్చీ అంచున కూర్చునేలా చేస్తాయి. స్టోరీలో వచ్చే ట్విస్టులు ఊహించనివిధంగా ఉంటాయి. నేపథ్య సంగీతం కథలో లీనం అయ్యేలా చేస్తుంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. షెహనాద్ జలాల్ కెమెరా వర్క్ ఆకట్టుకుంటుంది.
కొడుమోన్ పొట్టి పాత్రలో మమ్ముట్టి మరోసారి నట విశ్వరూపం చూపించారు. ఇప్పటివరకు ఆడియెన్స్ చూసిన మమ్ముట్టి వేరు. ఈ ‘మూవీలోని మమ్ముట్టి వేరు. మమ్ముట్టి లుక్స్ నుండి మేనరిజమ్స్ వరకు ప్రతి సీన్ లో ఆయన యాక్టింగ్ అద్భుతం. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్స్ లో అదరగొట్టేశారు. మమ్ముట్టి ధీటుగా తేవన్ పాత్రలో అర్జున్ ఆశోకన్ అద్భుతం నటించాడు. వంటవాడిగా సిద్ధార్థ్ భరతన్ చక్కగా నటించారు.
ప్లస్ పాయింట్స్:
- మమ్ముట్టి నటన
- స్టోరీ
- టెక్నికల్ టీమ్
- సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్:
- స్లో నెరేషన్
రేటింగ్ :
3/5
watch trailer :
Sundaram Master Movie Review: “వైవా హర్ష ” హీరోగా నటించిన మొదటి సినిమా ఎలా ఉంది..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!
షార్ట్ ఫిలింతో గుర్తింపు తెచ్చుకొని పాపులర్ అయిన వైవా హర్ష, ఆ తర్వాత పలు సినిమాలలో నటిస్తూ కమెడియన్ గా బిజీగా మారాడు. హర్ష తొలిసారి హీరోగా నటించిన మూవీ సుందరం మాస్టర్. నేడు థియేటర్స్ లో విడుదల అయిన ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
- చిత్రం : సుందరం మాస్టర్
- నటీనటులు : హర్ష చెముడు, హర్ష వర్ధన్, దివ్య శ్రీపాద, బాలకృష్ణ నీలకంఠపు, భద్రం తదితరులు
- నిర్మాత : రవితేజ, సుధీర్ కుమార్ కుర్రు
- దర్శకత్వం : కళ్యాణ్ సంతోష్
- సంగీతం : శ్రీచరణ్ పాకాల
- విడుదల తేదీ : ఫిబ్రవరి 23, 2024
స్టోరీ:
మిర్యాలమెట్ట అనే మారుమూల గ్రామంలో, సుందరం మాస్టర్ (హర్ష చెముడు) గవర్నమెంట్ పాఠశాలలో టీచర్. అతనికి వివాహం కానీ,సుందరం తాను గవర్నమెంట్ టీచర్ కావడంతో కట్నం ఎక్కువ కావాలని, వచ్చిన పెళ్లి సంబంధాలను రిజెక్ట్ చేస్తూ ఇంకా ఎక్కువ కట్నం ఇచ్చే సంబంధం కోసం చూస్తుంటాడు. ఆ ఏరియా ఎమ్మెల్యే(హర్ష వర్ధన్) పాఠశాలకి వచ్చి అందులోని టీచర్స్ అందరిని చూసి సుందరంని ఎంపిక చేస్తాడు. ఇంగ్లీష్ చెప్పే పేరుతో ఒక పని అప్పగించి, అడవిలో మారుమూల గూడెం అయిన మిర్యాలమెట్టకు ఇంగ్లీష్ టీచర్‌గా పంపిస్తాడు. అయితే అక్కడికి వెళ్ళిన సుందరం మాస్టర్ ఇంగ్లీష్ లో మాట్లాడే ఊరివారిని చూసి షాక్ అవుతాడు? ఆ గూడెం వాసులు సుందరం మాస్టర్ తో ఎలా ప్రవర్తిస్తారు? ఆ గూడెంకు వెళ్లిన పనిని చేశాడా? ఆ క్రమంలో సుందరం మాస్టర్ కు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి. చివరికి ఏం జరిగింది అనేది మిగతా కథ.
రివ్యూ:
సినిమా ప్రారంభం నుంచి ఎక్కువ సేపు సాగదీయకుండా దర్శకుడు నేరుగా కథలోకి తీసుకువెళ్లాడు. అత్యాశ ఉన్న గవర్నమెంట్ టీచర్ డీఈవో పోస్ట్ కోసం ఆశపడి అడివిలో బాహ్య ప్రపంచానికి దూరంగా ఉన్న గూడానికి వెళ్ళి, ఎమ్మెల్యే చెప్పిన విలువైన వస్తువును తీసుకొచ్చేందుకు రెడీ అవుతాడు. ఇంగ్లీష్ అంతగా రాని సోషల్ టీచర్ ఇంగ్లీష్ చెప్పడానికి ఆ గూడానికి వెళ్ళడం.
గూడెం వాసులకు ఇంగ్లీష్ రాదని భావించి, సుందరం మాస్టారు వారికి ఇంగ్లీష్ నేర్పించే ప్రయత్నాలు ఆడియెన్స్ ని నవ్విస్తాయి. ఫస్టాఫ్ కామెడీతో సాగింది.సెకండాఫ్ ఆ గూడెం దేవత విగ్రహం మాయమవడం,కల్మషం లేని మనుషులు,మానవత్వం, ప్రకృతి వంటి ఎమోషన్స్ తో సాగుతుంది. అయితే ఆ సీన్స్ డీల్ చేయడంలో డైరెక్టర్ కొంచెం తడబడ్డాడు. ఫస్టాఫ్ కామెడీగా సాగగా, సెకాండాఫ్‌లో నిరాశపరిచాడు.
కామెడీతో మెప్పించిన వైవా హర్ష, ఈ సినిమలో కామెడీ మరియు అన్ని రకాల ఎమోషన్స్ ని పండించాడు. సుందరం మాస్టర్ పాత్రకు హర్ష మాత్రమే సెట్ అవుతాడు అనేలా నటించాడు. దివ్య శ్రీపాద ఆ గూడెంలో ఉండే అనాధ పిల్లగా చక్కగా నటించింది. గూడెం ప్రజలుగా నటించిన నటినటులంతా బాగా చేశారు.
ప్లస్ పాయింట్స్:
- వైవా హర్ష పర్ఫార్మెన్స్
- ఫస్టాఫ్ కామెడీ
మైనస్ పాయింట్స్:
- కొన్ని సీన్స్ అసహజంగా అనిపిస్తాయి
- క్లైమాక్స్ సీన్స్ అంతగా ఆకట్టుకోలేదు
రేటింగ్ :
2.5/5
watch trailer :
సముద్రాన్ని దాటడం లాగే… ఆంజనేయుడు మాత్రమే చేయగలిగే 6 పనులు ఏమిటో తెలుసా..?
హనుమంతుడు, వాయుపుత్రుడు, ఆంజనేయుడు, మారుతి, బజరంగీ అంటూ అనేక పేర్లతో పిలిచే అంజనీసుతుడు సాక్షాత్తు ఆ శివుని అవతారమని శివ పురాణం చెబుతోంది. శ్రీ రామచంద్రుడు మహావిష్ణువు అవతారం అని తెలిసిన విషయమే. పురాణాల ప్రకారంగా వాయు దేవుడి వరంతో అంజనీదేవి, కేసరి దంపతులకు హనుమంతుడు జన్మించాడు.
భూమిపై లోకకళ్యాణం కోసం, ధర్మాన్ని స్థాపించడం కోసం శ్రీరాముడికి సహకరించడానికి ఆంజనేయుడు జన్మించినట్టుగా శివ పురాణం చెబుతుంది. రామాయణంలో శ్రీ రాముడి వలె ఆంజనేయుడు కూడా గొప్పతనాన్ని కలిగి ఉన్న విషయం తెలిసిందే. మహా బలవంతుడు అయిన వాయుపుత్రుడి కథలు వినడం ద్వారా లేదా చదవడం ద్వారా ఆత్మ విశ్వాసం, మానసిక ధైర్యo పెరుగుదలకు సహాయపడగలదని నమ్ముతారు. హనుమంతుడు మాత్రమే చేయగలిగిన 6 పనులు ఇప్పుడు చూద్దాం..
1. సముద్రాన్ని దాటడం :
సీతా దేవిని వెతికడానికి హనుమంతుడు,జాంబవంతుడు, అంగధుడు తదితరులు సముద్రం వద్దకు వచ్చి ఆగిపోయారు. దానిని దాటడానికి ఎవరికి ధైర్యం చాలలేదు. ఆ తరుణంలో జాంబవంతుడు హనుమంతుడు ఒక్కడే సముద్రాన్ని దాటి వెళ్లి, మళ్ళీ రాగల సమర్దునిగా తెలిపాడు. హనుమంతుడు తన శక్తి పైనే నమ్మకం లేకున్నా జాంబవంతుడు వంటి వారి ప్రోత్సాహంతో సముద్రాన్ని దాటాడు.
2. సీతాదేవిని కనుగొనడం :
హనుమంతుడు సముద్రాన్ని లఘించి, సీతా దేవి కోసం వెతకడానికి లంకను చేరాడు.లంకను కాపాడుతున్న లంకిణీని ఓడించాడు. అప్పటి వరకు ఆమెను హనుమంతుడు తప్ప ఎవరు ఓడించలేకపోయారు.ఓటమిని ఒప్పుకున్న లంకిణీ, సీతజాడను చెప్పగా, హనుమంతుడు సీతాదేవిని అశోకవనంలో గుర్తించాడు.
3.అక్షయకుమారుని సంహరించడం:
సీతమ్మను కనిపెట్టిన హనుమాన్ రాముడు ఇచ్చిన సందేశాన్ని చేరవేసాడు.ఆ తరువాత లంకలోని పలు ప్రాంతాలను హనుమంతుడు నాశనం చేశాడు. విషయం తెలిసిన రావణుడు కుమారుడు అక్షయ కుమారుని హనుమంతుడిని బంధిచి తీసుకురమన్ని పంపగా,అక్షయ కుమారుడిని హనుమంతుడు హత్యమరుస్తాడు.ఆ తారువత వచ్చిన ఇంద్రజిత్తు హనుమంతుని బంధించి,సభకు తీసుకెళ్లడం, తోకకు నిప్పు అంటించగా హనుమంతుడు లంక మొత్తాన్ని దహనం చేశాడు.
4.విభీషణుని రాముని వద్దకు తీసుకెళ్లడం :
రావణసభలో రాముని పేరును స్మరిస్తూ వేడుకొంటున్న వ్యక్తిని హనుమంతుడు రావణుని తమ్ముడు విభీషణునిగా గుర్తించాడు. రాముని కలవాలనే కోరిక ఉన్నట్లు విభీషణుడు తెలుపగా, ఎవ్వరూ ఒప్పుకోకపోయినా హనుమంతుడు విభీషణున్ని రాముని వద్దకు తీసుకునివెళ్ళాడు. ఈ చర్యే ఆ తరువాత రామ,రావణ యుద్ధంలో రావణ సంహరానికి కారణమైంది.
5. సంజీవని పర్వతo తీసుకుని రావడం :
యుద్ధంలో ఇంద్రజిత్ లక్ష్మణుని మీద బ్రహ్మస్త్రాన్ని ప్రయోగించినపుడు, లక్ష్మణుడు స్పృహకోల్పోతాడు. లక్ష్మణుడు తిరిగిలేవాలంటే సంజీవని ఒక్కటే పరిష్కారమని చెప్పడంతో, హిమాలయాలకు వెళ్ళిన హనుమాన్ సంజీవని గుర్తించడం కష్టం కావడంతో ఏకంగా ఆ పర్వతాన్నే పెకలించి, తీసుకుని వచ్చి,లక్ష్మణుడిని కాపాడుతాడు.
6. అనేకమంది రాక్షసులను సంహరించడం, రావణున్ని ఓడించడం:
రామ,రావణ యుద్ధంలో హనుమాన్ ఎంతోమంది రాక్షసులను సంహరించాడు.ఈ క్రమంలో రావణునికి, హనుమంతుడికి మధ్య భీకరయుద్ధం జరుగగా అందులో హనుమంతుడు రావణుని ఓడించి, సంహరించకుండా విడిచిపెట్టాడు.దానికి కారణం రాముడి చేతిలోనే రావణుడు చంపబడాలనే ఆలోచన.
Also Read: 10 ఏళ్ల బాలిక కలలో కనిపించిన కృష్ణుడు.. ఆమె ఆమె చెప్పిందని “దర్గా” దగ్గరలో తవ్వగా ఏం కనిపించిందంటే.?
ANCHOR ANASUYA: అనసూయ పడిన కష్టాల గురించి బయటపెట్టిన రచయిత..ఆ టాక్ షో చేసిన సమయంలో.?
యాంకర్ అనసూయ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బుల్లితెర పలు షోలకు యాంకరింగ్ చేస్తూ, మరో వైపు సినిమాలలో డిఫరెంట్ పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది.
యాంకర్‌గా కెరీర్ ప్రారంభించిన అనసూయ, నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అటు ఫ్యామిలీని, ఇటు కెరీర్ ను బాలెన్స్ చేసుకుంటూ కొనసాగుతున్నారు. రైటర్ బెజవాడ ప్రసన్న కుమార్ ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో యాంకర్ అనసూయ గురించి వెల్లడించిన విషయాలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.
జబర్దస్త్ కామెడీ షోతో పాపులర్ అయిన అనసూయ భరద్వాజ్, సినిమాలలో నటిస్తూ బిజీగా మారారు. వరుసగా ఆఫర్స్ రావడంతో వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూరాణిస్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అనసూయ లేటస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. ఆమె ఫోటోలు క్షణాల్లో వైరల్ గా మారుతూ ఉంటాయి. కొన్నిసార్లు నెట్టింట్లో ట్రోల్స్ కు గురి అయ్యి, ఇబ్బందులు సైతం పడ్డారు. రైటర్ బెజవాడ ప్రసన్న కుమార్ ఒక ఇంటర్వ్యూలో అనసూయ గురించి మాట్లాడుతూ, ‘అలీ టాకీస్’ అనే టాక్ షో చేసే సమయంలో అనసూయ పడిన కష్టాల గురించి వెల్లడించారు.
ఎపిసోడ్ షూటింగ్ పూర్తయిన తరువాత నెక్ట్స్ ఎపిసోడ్‌కి రాత్రి ఏడు గంటలకు వచ్చి అర్ధరాత్రి ఒకటి దాకా అనసూయ రిహార్సల్ చేసేదని అన్నారు. ఆ సమయంలో అనసూయ భర్త భరద్వాజ్ బయట కారులో ఎదురుచూసేవారని చెప్పారు. న్యూ షోకు టెస్ట్ షూట్ కోసం అన్ని ఫిక్స్ చేసుకున్నామని, కానీ షూటింగ్ కి 2 రోజుల ముందు ఆమె డెలివరీ అయ్యింది. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన నెక్స్ట్ డే విశ్రాంతి తీసుకుని 3వ రోజు షూటింగ్ కి వచ్చారని వెల్లడించారు. షూటింగ్లో పాల్గొంటూనే అరగంటకి ఒకసారి వెళ్ళి తన బిడ్డకి ఫీడింగ్ ఇస్తూ, షోకి యాంకరింగ్ చేసిందని, ఆ విధంగా ఎవరూ చేయలేరని చెప్పుకొచ్చారు.
ఆ ఒక్కరోజు షూటింగ్ లో పాల్గొన్నందుకు అనసూయ ఇప్పటి దాకా డబ్బులు కూడా అడగలేదని చెప్పారు. ఆల్టర్నేట్ అయినా చూసుకోమని చెప్పలేదని, ఆ సమయంలో వాళ్లింట్లో వాళ్లు అంగీకరించడం గ్రేట్ అని ప్రసన్న కుమార్ అన్నారు. నెట్టింట్లో చాలామంది అనసూయ గ్లామర్ చూసి ట్రోల్ చేస్తారని, ఆ కామెంట్స్ చూస్తే వారు చిన్నగా అనిపిస్తారని చెప్పుకొచ్చారు. అనసూయ లాంటి టఫ్ అమ్మాయిని ఇండస్ట్రీలో చూడలేదని, చాలా స్ట్రాంగ్ మహిళ అని చెప్పారు. ప్రస్తుతం ప్రసన్న కుమార్ చేసిన కామెంట్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
Also Read: OORU PERU BHAIRAVAKONA COLLECTIONS: బ్రేక్ ఈవెన్ కి దగ్గర్లో ఉన్న ఊరి పేరు భైరవకోన..