భారత టెన్నిస్ మాజీ క్రీడాకారిణి సానియా మీర్జా, పాక్ వెటరన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ విడిపోయిన సంగతి తెలిసిందే. పదమూడేళ్ళ వైవాహిక జీవితం తరువాత ఇద్దరు విడాకులు తీసుకున్నారు. షరియా చట్టాల ప్రకారం మాలిక్ సానియాకు విడాకులిచ్చి, పాకిస్తాన్ నటి సనా జావేద్‌ను పెళ్లి చేసుకున్నారు.
జనవరి 20న షోయబ్ మాలిక్ సనా జావేద్‌ను పెళ్లి చేసుకున్నట్లుగా ప్రకటిస్తూ, పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ తరువాత సానియా మీర్జా ఫ్యామిలీ కూడా విడాకుల గురించి ఓ ప్రకటన చేశారు. ఈ క్రమంలో నెటిజెన్లు ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నారు. ఆ వ్యక్తి ఎవరో ఇప్పుడు చూద్దాం..
సానియా మీర్జాకి షోయబ్ మాలిక్‌తో పెళ్లి జరగక ముందు, ఆమె తన ఫ్రెండ్ సోహ్రాబ్ మీర్జాతో ఎంగేజ్మెంట్ జరిగింది. ఈ విషయం చాలా మందికి తెలియదు. సానియా హైదరాబాద్ లో ప్రముఖ బేకరీ అయిన యూనివరల్ బేకర్స్ ఓనర్ సోహ్రబ్ మీర్జాతో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. జులై 2009లో ఇరు కుటుంబాల సమక్షంలో ఉంగరాలు సైతం మార్చుకున్నారు. సానియా, సోహ్రబ్ హైదరాబాద్ లో సెయింట్ మేరీస్ కాలేజీలో కలిశారు. సానియా చదువుకునే రోజుల్లో వీరికి పరిచయం ఏర్పడింది. ఆ కాలేజీలో సోహ్రబ్ కామర్స్ చదివాడు. అనంతరం యూకేలో ఎంబీఏ పూర్తిచేసి, బిజినెస్ లోకి వచ్చారట. అయితే, వీరి వివాహానికి కొన్నిరోజుల ముందు సానియా, షోయబ్ మాలిక్‌తో ప్రేమించడంతో సోహ్రాబ్‌తో నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుంది.
ఆ తరువాత సానియా పెద్దలను ఒప్పించి షోయబ్ మాలిక్‌ను వివాహం చేసుకుంది. ఇక వీరు విడాకులు తీసుకున్న వార్త వైరల్ అవడంతో నెటిజెన్లు సోహ్రాబ్ మీర్జాను పెళ్లి చేసుకొని ఉంటే సానియా లైఫ్ ఇలా అయ్యేది కాదని ఇన్ డైరెక్ట్ గా కామెంట్స్ చేస్తున్నారు. అయితే సోహ్రాబ్‌తో ఎంగేజ్మెంట్ క్యాన్సల్ చేసుకున్నా, వారి ఫ్యామిలీలు ఇప్పటికీ కూడా సన్నిహితంగానే ఉన్నాయి.
Also Read: SANIA MIRZA: విడాకుల కోసం “సానియా మీర్జా” తన మాజీ భర్త నుండి ఎంత భరణం తీసుకుందో తెలుసా.?