అమెజాన్ ప్రైమ్ లోకి ఒక కొత్త సినిమా వచ్చేసింది. ఆ సినిమా కూడా ఒక తెలుగు సినిమా. దాని పేరు కిస్మత్. ఏప్రిల్ 2వ తేదీ నుండి ఇది అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతోంది. నరేష్ అగస్త్య, శ్రీనివాస్ అవసరాల, విశ్వదేవ్ రాచకొండ, అభినవ గోమటం, రియా సుమన్ ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటించారు. ఇంక ఈ సినిమా కథ విషయానికి వస్తే, మంచిర్యాలకు చెందిన ముగ్గురు యువకులు బిటెక్ పూర్తి చేస్తారు. కానీ ఉద్యోగాలు లేక తిరుగుతూ ఉంటారు. ఒకసారి ఒక గొడవ అవుతుంది. దాని కారణంగా పోలీస్ స్టేషన్ కి వెళ్తారు. ఇంట్లో వాళ్ళు బాగా తిట్టడంతో ఉద్యోగం చేద్దాము అనే ఉద్దేశంతో హైదరాబాద్ కి వెళ్తారు.
అప్పుడే హైదరాబాద్ లో ఎలక్షన్స్ హడావిడి ఉంటుంది. ఆ తర్వాత వీళ్ళకి అనుకోకుండా డబ్బులు దొరుకుతాయి. ఆ డబ్బులు వీళ్ల దగ్గరికి ఎలా వచ్చాయి అనేది మిగిలిన కథ. ఈ సినిమాకి శ్రీనాథ్ బాదినేని దర్శకత్వం వహించగా, రాజు సినిమాని నిర్మించారు. మార్క్ కే రాబిన్ సినిమాకి సంగీత దర్శకుడిగా వ్యవహరించారు. డైరెక్టర్ ఎంచుకున్న స్టోరీ పాయింట్ బాగుంది. సినిమా కూడా ఆసక్తికరంగా నడుస్తుంది. ఎక్కడా బోర్ కొట్టకుండా స్టోరీ రాసుకున్నారు. కొన్ని జోక్స్ కూడా నవ్వు తెప్పించే విధంగానే ఉంటాయి. నటీనటుల టైమింగ్ బాగుంది. అక్కడక్కడ కథ ఏమవుతుంది అనేది తెలుస్తుంది.
కానీ సినిమా చూసే విధంగానే ఉంది. పాటలు కూడా సినిమాకి తగ్గట్టుగా ఉన్నాయి. సినిమాలో సహాయ పాత్రల్లో నటించిన కొంత మంది నటులు కూడా చాలా బాగా నటించారు. అనుభవం ఉన్న నటులు ఈ సినిమాలో చాలా మంది ఉన్నారు. కాబట్టి నటన విషయంలో వంక పెట్టాల్సింది ఏమీ లేదు. ఎవరికి ఇచ్చిన పాత్రల్లో వాళ్ళు బాగా నటించారు. క్లైమాక్స్ కూడా అంతే ఆసక్తికరంగా రాసుకున్నారు. క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్ సినిమాలని ఇష్టపడేవారు ఈ సినిమాని మిస్ అవ్వకండి. ఈ సినిమాలో కామెడీ కూడా బాగుంది. వీకెండ్ కి ఒక్కసారి చూడగలిగే ఒక ఎంటర్టైనర్ గా ఈ సినిమా నిలుస్తుంది.
ALSO READ : “సినిమా అని చెప్పి సీరియల్ చూపించారేంటి..?” అంటూ… విజయ్ దేవరకొండ “ఫ్యామిలీ స్టార్” రిలీజ్పై 15 మీమ్స్..!