మూవీస్, టెలివిజన్ సిరీస్‌లకు సంబంధించిన సమాచారానికి IMDb ప్రపంచవ్యాప్తంగా పాపులర్. ఈ రేటింగ్స్ కి ప్రపంచ వ్యాప్తంగా అందరు వేల్యూ ఇస్తారు. అయితే గత కొంతకాలం గా ఇండియన్ మూవీ డేటాబేస్ వెబ్సైట్ లో తెలుగు చిత్రాలు మంచి రేటింగ్స్ ని నమోదు చేస్తున్నాయి. ముఖ్యంగా చిన్న సినిమాలు ఊహించిన రేంజ్ లో సక్సెస్ అయ్యాయి. అలాగే కొన్ని పాన్ ఇండియా సినిమాలు కూడా భారీ స్థాయిలో బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ అందుకున్నాయి.
అయితే టాప్ రేటింగ్స్ సాధించిన సినిమాల సంగతి పక్కన పెడితే..ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ లో తక్కువ రేటింగ్స్ సాధించిన తెలుగు చిత్రాలేవో ఇప్పుడు చూద్దాం..
#1 సత్తెకాలపు సత్తెయ్య
శోభన్ బాబు హీరోగా 1969 లో వచ్చిన సత్తెకాలపు సత్తెయ్య చిత్రానికి ఐఎండిబి లో 2 .5 రేటింగ్ వచ్చింది.
#2 పరమవీరచక్ర
బాలయ్య హీరోగా దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన పరమవీరచక్ర సినిమాకి 2 .1 రేటింగ్ వచ్చింది.
#3 ఒక్కమగాడు
బాలయ్య హీరోగా వైవిఎస్ చౌదరి తెరకెక్కించిన ఒక్క మగాడు సినిమా 1.8 రేటింగ్ సాధించింది.
#4 విజయేంద్రవర్మ
బాలకృష్ణ హీరోగా స్వర్ణ సుబ్బారావు తెరకెక్కించిన విజయేంద్ర వర్మ సినిమాకి కూడా 2 రేటింగ్ వచ్చింది.
#5 మహారథి
పి వాసు దర్శకత్వం లో బాలయ్య హీరోగా వచ్చిన మహారధి సినిమాకి కూడా 2 రేటింగ్ వచ్చింది.
#6 లైగర్
విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ తెరకెక్కించిన లైగర్ చిత్రానికి ఐఎండిబి లో 2 రేటింగ్ వచ్చింది.
#7 మస్త్
శివాజీ హీరోగా వచ్చిన మస్త్ మూవీ కి కూడా ఐఎండిబి లో 1 .7 రేటింగ్ వచ్చింది.
#8 రగిలే గుండెలు
1985 లో మోహన్ బాబు హీరోగా చంద్రశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించిన చిత్రం రగిలే గుండెలు కి ఐఎండిబి లో 1 .7 రేటింగ్ వచ్చింది.
#9 వీరభద్ర
బాలకృష్ణ నటించిన ఈ చిత్రానికి రవి కుమార్ చౌదరి దర్శకుడిగా పని చేయగా 2.2 రేటింగ్ దక్కింది.
#10 ప్రేమపంజరం
మోహన్ బాబు, హరీష్ ప్రధాన పాత్రల్లో వచ్చిన ప్రేమపంజరం చిత్రానికి ఐఎండిబి లో 1 రేటింగ్ వచ్చింది.
#11 అల్లుడు దిద్దిన కాపురం
కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కృష్ణ, శోభన, మోహన్‌బాబు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి ఐఎండిబి లో 1 .4 రేటింగ్ వచ్చింది.
#12 విజయం
రాజా హీరోగా 2003 లో వచ్చిన విజయం మూవీ కి ఐఎండిబి లో 1 .7 రేటింగ్ వచ్చింది.
#13 నరసింహుడు
ఎన్టీఆర్, అమీషా పటేల్, సమీరా రెడ్డి ప్రధాన పాత్రల్లో వచ్చిన నరసింహుడు చిత్రానికి ఐఎండిబి లో 3 రేటింగ్ వచ్చింది.
#14 తుఫాన్
రామ్ చరణ్, ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రల్లో వచ్చిన తుఫాన్ చిత్రానికి ఐఎండిబి లో 3 రేటింగ్ వచ్చింది.
#15 సుభాష్ చంద్రబోస్
వెంకటేష్, శ్రేయ జంటగా నటించిన సుభాష్ చంద్రబోస్ చిత్రానికి ఐఎండిబి లో 3 .1 రేటింగ్ వచ్చింది.