ఇటీవల కాలంలో కరెంటు బిల్లుల మొత్తం ఎక్కువగా వస్తున్నాయి అని ప్రజలు ఆరోపణలు చేస్తున్నారు .కాగా ఈ విషయం ఇప్పుడు అంతటా చర్చనీయాంశం అయింది.అయితే దీనిపై టీఎస్ ఎస్పీడీసీఎల్ రఘుమారెడ్డి క్లారిటీ ఇచ్చారు.దీనికి సంభందించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

representative image
కరోనా వైరస్ కారణంగా ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావడం వలనే కరెంటు బిల్లులు ఎక్కువగా వచ్చాయని, అయినా గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం విద్యుత్ వాడకం బాగా పెరిగిందని రఘుమారెడ్డి అన్నారు.కరెంటు బిల్లులు ఎక్కువ మొత్తం వచ్చిందని మాకు ప్రజలు ఎక్కువ సంఖ్యలో పిర్యాదు చేసారు.కావున కరెంటు బిల్ చెల్లింపు సమయంలో ఈ నెలలో కొంతమొత్తం, అలాగే వచ్చే నెలలో మిగిలిన మొత్తం చెల్లించేలాగా వినియోగదారులకు అవకాశం కల్పించినట్లు రఘుమారెడ్డి తెలిపారు.

representative image
ఇప్పటిదాకా దాదాపు 58 శాతం మంది మాత్రమే కరెంటు బిల్ చెల్లించారు అని రఘుమారెడ్డి తెలిపారు.అయితే ఈ నేపథ్యంలో మేము బిల్లులు ఏమి పెంచలేదని, ఎంత విద్యుత్ అయితే వాడారో అంతే బిల్లు ఇచ్చామని రఘుమారెడ్డి క్లారిటీ ఇచ్చారు.మాములుగా వేసవికాలంలో విద్యుత్ వినియోగం పెరగడం వలన స్లాబ్ మారి విద్యుత్ బిల్ ఎక్కువగా వస్తుందని స్పష్టం చేసారు రఘుమారెడ్డి.





ఏనుగు మృతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు..ముగ్గురు అనుమానితులను గుర్తించారు..వారిలో ఒకరిని అరెస్ట్ చేశారు..అరెస్టు చేసిన నలభైఏళ్ల విల్సన్ ని విచారించగా..అతను రబ్బరు సేకరిస్తుంటాడని, స్థానికంగా మరొక ఇద్దరితో కలిసి పేలుడుపర్దాలు తయారు చేస్తుంటామని చెప్పుకొచ్చాడు. విల్సన్ తో పాటు పేలుడు పదార్దాలు తయారు చేసినవారిని వెతికే పనిలో ఉన్నారు పోలీసులు.పరారీలో ఉన్న ఇద్దరు నిందితులను త్వరలో పట్టుకుంటామని తెలిపారు.









ఆన్లైన్ క్లాసులకు అటెండ్ కావాలంటే స్మార్ట్ ఫోన్, నెట్ స్పీడ్ ముఖ్యం..అందరి విద్యార్దులకు అందుబాటులో ఉంటాయని చెప్పలేము.. ఎవరి ఇబ్బందులు వాళ్లవి…క్లాసులకు అటెండ్ కావల్సిందే అనేది స్కూల్ యాజమాన్యాల ధోరణి..తాజాగా ఒక విద్యార్ధిని ఫోన్లో నెట్ రాకపోవడంతో ఏకంగా ఇల్లు పైకి ఎక్కి కూర్చుని ఆన్లైన్ క్లాసులు వింటున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరలవుతోంది..ఆ విద్యార్ధిని కేరళకు చెందిన నమితా నారాయణన్ అని సమాచారం..









