ఓటీటీలో ఎన్నో కొత్త సినిమాలు విడుదల అవుతూ ఉంటాయి. ఇటీవల అలాగే ఒక సినిమా విడుదల అయ్యి హిట్ టాక్ సంపాదించుకుంది. ఇప్పుడు గత సంవత్సరం డిసెంబర్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా హౌ ఈజ్ దట్ ఫర్ ఏ మండే. సినిమా మీద ప్యాషన్ ఉన్న కొంత మంది అమెరికాలో రూపొందించిన సినిమా ఇది.
ఈ సినిమా అక్టోబర్ 29వ తేదీన థియేటర్లలో విడుదల అయ్యింది. ఇప్పుడు ఈటీవీ విన్ యాప్ లో స్ట్రీమ్ అవుతోంది. సినిమా కథ విషయానికి వస్తే శ్యామ్ (కౌశిక్ ఘంటసాల) ఇంటర్ లో స్టేట్ మొత్తంలో సెవెంత్ ర్యాంక్ తెచ్చుకుంటాడు. తర్వాత అమెరికాలో కష్టపడి ఉద్యోగం సంపాదించుకొని బతుకుతూ ఉంటాడు.

అర్జెంట్ గా క్రెడిట్ కార్డ్ మినిమం బిల్ కట్టాల్సి రావడంతో అక్షయ తృతీయ రోజు తన గర్ల్ ఫ్రెండ్ గిఫ్ట్ గా ఇచ్చిన గోల్డ్ చైన్, లాకెట్ ని తాకట్టు పెట్టి వెయ్యి డాలర్లు అప్పు తీసుకుంటాడు. ఈ వెయ్యి డాలర్లు శ్యామ్ జీవితాన్ని మారుస్తాయి. ఒక పెద్ద సమస్యలో ఇరుక్కుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. సినిమాలో హీరోగా నటించిన కౌశిక్ ఘంటసాల గతంలో బ్రోచేవారెవరురా, మెన్ టూ వంటి సినిమాల్లో నటించారు.

ఈ సినిమాలో శ్యామ్ పాత్రలో బాగా నటించారు. కౌశిక్ తప్ప మిగిలిన వాళ్ళు అందరూ కూడా మనకి కొత్తవారే. రాహుల్ బిరూలి అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది. డాన్ విన్సెంట్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. ఇండిపెండెంట్ సినిమా అయినా కూడా క్వాలిటీ విషయంలో ఎటువంటి ఖర్చుకి వెనకాడకుండా సినిమా తీశారు అని అర్థం అవుతోంది.

ఈ సినిమాకి శ్రీపాల్ సామా దర్శకత్వం వహించారు. దర్శకుడు తీసుకున్న పాయింట్ బాగుంది. సినిమా నిడివి కూడా తక్కువే. సినిమా మొత్తం 88 నిమిషాలు ఉంటుంది. సినిమా బృందం మొత్తం ఈ సినిమా కోసం సిన్సియర్ గా పని చేశారు అని సినిమా చూస్తూ ఉన్నంత సేపు అర్థం అవుతుంది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ సినిమా ఒక కొత్త అనుభూతి ఇస్తుంది. ఎక్కడా బోర్ కొట్టకుండా చూస్తున్నంత సేపు ఆసక్తికరంగా సాగుతుంది.
ALSO READ : రెండు సార్లు సెన్సార్ అయ్యి చిరంజీవి పరువు తీసిన ఈ సినిమా ఏంటో తెలుసా.?




ఫీల్ గుడ్ మలయాళ మూవీ ‘హోమ్’ కి రోజిన్ థామస్ దర్శకత్వం వహించారు. ఇంద్రన్స్, మంజు పిళ్లై, శ్రీనాథ్ భాసి, దీపా థామస్, నస్లెన్ కె. గఫూర్, జానీ ఆంటోని, కైనకరి థంకరాజ్ వంటివారు ఈ చిత్రంలో నటించారు. ఈ మూవీ ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో 2021లో ఆగస్టు 19న విడుదలైంది.
ఇక ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే, 60 ఏళ్ల ఒలివర్ ట్విస్ట్ (ఇంద్రాన్స్)ఇద్దరు కొడుకులకు తండ్రి. పెద్ద కొడుకు ఆంటోనీ (శ్రీనాథ్ బాసి), చిన్న కొడుకు చార్లెస్( నస్లెన్ కె. గఫూర్). ఆంటోనీ దర్శకుడు. అతను తీసిన మొదటి మూవీ పెద్ద విజయం సాదిస్తుంది. కానీ కానీ రెండవ మూవీకి స్టోరీ రాయలేక, ఏకాగ్రత కుదరక ఇబ్బందులు పడతాడు. మవతి మూవీ కథ రాసిన తన ఇంట్లోనే రాయాలని భావించి, ఇంటికి వస్తాడు. పెద్ద కొడుకు ఇంటికి రావడంతో ఒలివర్ చాలా సంతోషపడతాడు. తన మిత్రులతో ఆంటోనీ గురించి గొప్పగా చెప్పుకుని ఆనందపడతాడు.
అయితే ఆంటోనీ మాత్రం తన తండ్రి ఒలివర్ తో ఒక్కసారి కూడా ప్రేమగా మాట్లాడడు. ఎల్లప్పుడు ఫోన్ చూస్తూ ఉంటాడు.తండ్రి ఏం మాట్లాడినా ఫోన్ చూసుకుంటూ ఆంటోనీ ‘ఊ ఊ’ అని అంటుంటాడు. అయితే తన కొడకులు ఇద్దరు ఎందుకు ఆ స్మార్ట్ ఫోన్‌కి బానిసలా మారి, తమ చుట్టూ ఉన్నవాళ్ళను పట్టించుకోవడం లేదని అనుకుంటాడు. ఒలివర్ టెక్నాలజీ గురించి తెలుసుకోవాలని, ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ వంటి గురించి తెలుసుకుంటుంటాడు. ఆ తరువాత తండ్రి కొడుకుల మధ్య ఏం జరిగింది? ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి అనేది మిగిలిన స్టోరీ.
భరత్ తమిళ, మలయాళం, హిందీ, తెలుగు భాషలలో హీరోగా, సైడ్ హీరోగా పలు చిత్రాల్లో నటించారు. 2020 లో మలయాళంలో విజయం సాధించిన లవ్ మూవీని అదే టైటిల్ తో భరత్ హీరోగా తమిళంలో రీమేక్ చేశారు. ఈ చిత్రంలో వాణిభోజన్ హీరోయిన్గా నటించింది. ఈ ఏడాది జూలై 28న రిలీజ్ అయిన ఈ మూవీకి ఆర్పీ బాల దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 8 నుండి ఈ రొమాంటిక్ థ్రిల్లర్ ప్రముఖ ఓటీటీ ఆహాలో తెలుగులో స్ట్రీమింగ్ కి వచ్చింది.
ఇక ఈ మూవీ కథ విషయానికి వస్తే, అజయ్, దివ్య ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. వీరి పెళ్లి వద్దని దివ్య తండ్రి వద్దని ఎంతగా చెప్పినా వినకుండా అజయ్ ని పెళ్లి చేసుకుంటుంది. అయితే పెళ్లైన సంవత్సరంలోనే ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభం అవుతాయి. అజయ్ చేస్తున్న బిజినెస్‌లో నష్టాలు రావడంతో, మద్యానికి బానిస అవుతాడు. అదే సమయంలో దివ్య గర్భవతి అని తెలుస్తుంది. చెకప్ కోసం దివ్య హాస్పటల్ కి వెళుతుంది.
అజయ్ ఇంట్లోనే తాగుతూ ఉంటాడు. దివ్య కాల్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయడు. దాంతో దివ్య అతని పై సీరియస్ అవుతుంది. అతనిలో మార్పు రాదని శాశ్వతంగా అతని నుండి వెళ్లిపోవడానికి సిద్ధం అవుతుంది. అజయ్ ఎంతగా కన్వీన్స్ చేసినా దివ్య అతని మాట వినదు. దాంతో కోపం వచ్చిన అజయ్ దివ్యను నెట్టేస్తాడు. ఆమెకు దెబ్బ బలంగా తగలడంతో అక్కడిక్కడే చనిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అజయ్ లైఫ్ లో ఏలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అనేది మిగిలిన కథ.





నటుడు రాజ్ బి. శెట్టి కన్నడ చిత్రసీమలో ఓ ట్రెండ్ ను సృష్టించారు. ఇండస్ట్రీలో తన మార్క్ ను చూపించారు. శెట్టి నటుడు మాత్రమే కాదు దర్శకుడు మరియు స్క్రీన్ రైటర్ కూడా. ఆయన నటించే చిత్రాలన్నీ వైవిధ్యంగా ఉంటాయి. యుక్ మొత్తే కతి, గరుడ గమన వృషభ వాహన చిత్రాలలో విభిన్నమైన కథలతో ఆడియెన్స్ కు చేరువయ్యారు. రక్షిత్ శెట్టి, రిషభ్ శెట్టిలకి మంచి స్నేహితుడు. ఈ ముగ్గురి నుండి సినిమా వస్తుందంటే కన్నడ ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తుంటారు.
ఈ ఏడాది రాజ్ బి. శెట్టి మరొక డిఫరెంట్ మూవీ ‘టోబి’ తో ఆడియెన్స్ ని పలకరించారు. టోబి మూవీ ఆగస్ట్ 25న రిలీజ్ అయ్యి, హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ మూవీ సోనీ లీవ్ లో తెలుగులోను స్ట్రీమింగ్ అవుతోంది. ఇక ఈ మూవీ కథ విషయానికి వస్తే, టోబీ ఒక విడిచిపెట్టిన పిల్లవాడు. చిన్నతనంలో అనేక వేధింపులకు గురి అవుతాడు. అతనికి పేరు కూడా లేదు. ఆ పిల్లవాడికి ఆశ్రయం ఇచ్చినవారు టోబీ అని పిలుస్తారు.
టోబీ కోపం ఎక్కువగా ఉంటుంది. అతనికి కోపం వచ్చినపుడు చంపేస్తాడు. టోబీతో పాటు అతని కోపం కూడా పెరుగుతుంది. విపరీతమైన కోపం వల్ల అతను పాపులర్ అవుతాడు. అతనికి నచ్చినవారు చెబితేనే ఏదైనా వింటాడు. అయితే కొందరు వ్యక్తిని కొందరు టోబీని స్వార్ధం కోసం వాడుకుంటారు. ఆ విషయం తెలుసుకున్న టోబీ ఏం చేశాడు? వారి పై ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు అనేది మిగిలిన కథ.
ఈ సిరీస్ కి శరత్ జోతి దర్శకత్వం వహించగా, ప్రభావతి నిర్మించారు. వీరప్పన్ స్వయంగా చెప్పిన విషయాల ఆధారంగా ‘కూసీ మునుసామి వీరప్పన్’ డాక్యుమెంటరీ సిరీస్ ను రూపొందించారు. 1993-1996 కాలంలో వీరప్పన్ ఇంటర్వ్యూ కోసం గోపాల్ అనే విలేకరి అడవిలోకి వెళ్లి, తీసిన వీడియోలు, తన గురించి తానే వీరప్పన్ చెప్పిన దాని ఆధారంగా ఆరు ఎపిసోడ్ లతో ఈ సిరీస్‌ను తెరకెక్కించారు.
ఇక ఈ సిరీస్ కథ విషయానికి వస్తే, స్వయంగా వీరప్పన్ తన గురించి, తన లైఫ్ గురించి వివరించారు. వేటగాళ్ల ఫ్యామిలిలో కూసే మునిసామి వీరప్పన్ ఐదుగురు పిల్లలలో రెండో అబ్బాయిగా జన్మించాడు. చిన్నవయసులో తన ఆకలిని తీర్చుకోవడానికి కుటుంబ వృత్తి వేటాడడం ప్రారంభించాడు. మొదట్లో ఆకలి తీర్చుకోవడం కోసం వేటాడినా, కాలక్రమేణా దాని వల్ల కోట్ల రూపాయలు సంపాదించాడు. వీరప్పన్ దశాబ్దాల పాటు తమిళనాడు, కర్ణాటక బార్డర్ లోని అడవులను దోచుకున్నాడు.
వీరప్పన్ కనిపించిన గంధపు చెట్టునల్లా అమ్మడం, ఏనుగులను చంపి వాటి దంతాలు కూడా అమ్మడం మొదలు పెట్టాడు. ఈ క్రమంలో వీరప్పన్ వందలాది మందిని చంపేశాడు. అంతేకాకుండా తనకు వ్యతిరేకంగా ఉన్న పోలీసు ఆఫీసర్లను, పోలీస్ ఇన్ఫార్మర్ అనే సందేహం కలిగినా కూడా చంపేశాడు. తను ఇంతగా ఎందుకు మారాడు? వీరప్పన్ జీవితంలోని ముఖ్యమైన సంఘటనలను గురించి తానే స్వయంగా చెప్పాడు. ఆ విషయాలన్ని తెలుసుకోవాలంటే సిరీస్ చూడాల్సిందే..


