సినిమా పరిశ్రమలో 20 ఏళ్ల ప్రస్థానం ఉన్న నటి నయనతార. నయనతార ప్రస్తుతం లేడీ ఓరియంటెడ్ సినిమాలు ఎక్కువగా చేస్తున్నారు. మరొక పక్క స్టార్ హీరో సినిమాల్లో కూడా నటిస్తున్నారు. అయితే ఇప్పుడు నయనతార నెక్స్ట్ సినిమా ఎలా ఉంటుంది అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
నెక్స్ట్ సినిమా కూడా నయనతార లేడీ సినిమానే చేస్తున్నారు. అరుణ్ రాజా కామరాజ్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో నయనతార నటించబోతున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వస్తుంది. ప్రస్తుతం నయనతార మాధవన్, సిద్ధార్థ్, మీరా జాస్మిన్ తో కలిసి టెస్ట్ అనే ఒక సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.
నయనతార తెలుగు సినిమా చేసి చాలా కాలం అయ్యింది. గత సంవత్సరం చిరంజీవి హీరోగా నటించిన గాడ్ ఫాదర్ సినిమాలో చిరంజీవి చెల్లెలి పాత్రలో నయనతార నటించారు. మళ్లీ తర్వాత ఇప్పటివరకు నయనతార తెలుగు సినిమాలో నటించలేదు. కానీ డబ్బింగ్ సినిమాల ద్వారా నయనతార తెలుగు ప్రేక్షకులని పలకరిస్తూనే ఉన్నారు. ఇటీవల నయనతార హీరోయిన్ గా నటించిన అన్నపూరణి సినిమా తెలుగులో కూడా విడుదల అయ్యింది. ఒక సాధారణమైన అమ్మాయి చెఫ్ అయ్యి పేరు ఎలా సంపాదించుకుంది అనే అంశం మీద ఈ సినిమా అంతా నడుస్తుంది. ఈ సినిమాలో జై హీరోగా నటించారు. ఈ సినిమా వివాదాల బారిన పడినా కూడా, ఒక డీసెంట్ హిట్ టాక్ సొంతం చేసుకుంది.