స్టార్ హీరోయిన్ త్రిష గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 40 ఏళ్ల వయసులోను తరగని అందంతో యంగ్ హీరోయిన్స్ కు గట్టి పోటీ ఇస్తూ సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు.
తరుణ్ హీరోగా నటించిన ద్విభాషా సినిమా నీ మనసు నాకు తెలుసు మూవీతో త్రిష హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ‘వర్షం’ చిత్రంతో స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. 20 ఏళ్లుగా సౌత్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న త్రిష కొందరు సౌత్ హీరోలతో మూడు అంతకన్నా ఎక్కువ చిత్రాలలో నటించారు. ఆ హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం..
1. ప్రభాస్:
త్రిష మొదటిసారి ‘వర్షం’ సినిమాలో ప్రభాస్ పక్కన హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. ఈ సినిమాతో త్రిష స్టార్ డమ్ ను అందుకుంది. ఈ మూవీ తరువాత ప్రభాస్ తో పౌర్ణమి, బుజ్జిగాడు మేడిన్ చెన్నై చిత్రాలలో నటించింది.
2. విక్టరీ వెంకటేష్:
త్రిష తొలిసారిగా అగ్ర హీరో వెంకటేష్ తో 2007 లో ‘ఆడవారి మాటలకు అర్ధాలు వేరులే’ అనే చిత్రంలో నటించారు. ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. ఆ తరువాత వెంకటేష్ తో నమో వెంకటేశ, బాడిగార్డ్ చిత్రాలలో నటించారు.
3. సూర్య:
త్రిష తెలుగులోనే కాకుండా కోలీవుడ్ లోనూ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. ఆమె కోలీవుడ్ స్టార్ హీరో సూర్యతో 3 సినిమాలలో నటించారు. ఆ సినిమాలు ఏమిటంటే మౌనం పేసియాదే, ఆయుత ఎళుతు, ఆరు.
4. అజిత్:
హీరోయిన్ త్రిష తమిళ స్టార్ హీరో అజిత్ నాలుగు చిత్రాలలో నటించారు. ఈ జంట కోలీవుడ్ లో హిట్ పెయిర్ గా పేరు తెచ్చుకున్నారు. త్రిష అజిత్ తో నటించిన సినిమాలు ఏమిటంటే జి, కిరీడం, మంకథ, యెన్నై అరిందాల్.
5. విక్రమ్:
హీరోయిన్ త్రిష కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ తో నాలుగు చిత్రాలలో నటించారు. ఆ చిత్రాలు సామీ, భీమా, పొన్నియన్ సెల్వన్ 1 మరియు 2.
6. జయం రవి:
తమిళ స్టార్ హీరో జయం రవితో హీరోయిన్ త్రిష 5 చిత్రాలలో నటించారు. ఆ సినిమాలు ఏమిటంటే ఉనక్కుమ్ ఎనక్కుమ్, సకలకళ వల్లవన్, భూలోహం, పొన్నియన్ సెల్వన్ 1 మరియు 2.
7. దళపతి విజయ్:
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తో హీరోయిన్ త్రిష కలిసి 5 సినిమాల్లో నటించారు.
ఈ జంట కోలీవుడ్ హిట్ పెయిర్స్ లో ఒకరిగా నిలిచారు. త్రిష, విజయ్ నటించిన సినిమాలు గిల్లి, కురువి, తిరుపాచి. ఆది మరియు లియో.
Also Read: “అర్జున్ రెడ్డి” లాగానే… ముందు “కాంట్రవర్సీ” సృష్టించి తర్వాత సూపర్ హిట్ అయిన 14 సినిమాలు..!

ఈమె ఒక బ్రాహ్మణ ఫ్యామిలిలో జన్మించింది. ఆమె తండ్రి దీపనాథ్ సేన్, తల్లి బెంగాలీ నటి సుచిత్రా సేన్. ఈమె షిల్లాంగ్ లోని లోరెటో కాన్వెంట్లో, కోల్‌కాతాలోని లోరెటో హౌస్‌లో చదువుకుంది. చిన్నప్పటి నుండి తల్లి సుచిత్రా సేన్ తో కలిసి సినిమా షూటింగ్ లకు వెళ్లడంతో ఆమెకు నటన పై ఆసక్తి కలిగింది. ఆమె ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వాలి అనుకున్నప్పుడు చాలా మంది ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆమె పెళ్లి, పిల్లలు అయిన తరువాత సినిమాలలో యాక్టింగ్ ప్రారంభించింది.
మూన్ మూన్ సేన్ నటిగా మారక ముందు మోడల్‌గా చేశారు. ఎన్నో వాణిజ్య ప్రకటనలలో నటించి అనేక వివాదాలకు కారణమైంది. 1984లో ఆమె అనిల్ కపూర్ నటించిన ‘ఆనంద్ బహర్’ చిత్రంతో బాలీవుడ్ లో అడుగు పెట్టింది. ఈ మూవీకి ముందు ఆమె అనేక బెంగాలీ సినిమాలలో నటించింది. అప్పటికే తల్లి అయిన ఆమె ఎక్కువగా గ్లామర్ పాత్రలలో నటించడం వల్ల , ఒక వర్గం ఆడియెన్స్ మరియు సినీ క్రిటిక్స్ నుండి విమర్శలకు గురి అయ్యింది. హిందీలో అగ్ర నటులతో నటించింది.
ఆమె 1986లో సిరివెన్నెల చిత్రంతో తెలుగులోకి అడుగుపెట్టింది. ఈ సినిమాలో హీరోకు తన కళ్లను దానం చేసే జ్యోతిర్మయి పాత్రలో ఆమె అద్భుతంగా నటించారు. ఆ మూవీకి నంది అవార్డ్ కూడా అందుకుంది. ఆ తరువాత, 1987లో అక్కినేని నాగార్జునతో మజ్ను సినిమాలో నటించింది.
ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం అందుకుంది. ఆమె ఎన్ని భాషలలొ నటించిన బెంగాలీ చిత్రాలలో కొనసాగారు. ఆమె చివరిగా 2019 రిలీజ్ అయిన ‘భోబిష్యోటర్ భుట్’ అనే చిత్రంలో కనిపించింది. మూన్ మూన్ సేన్ ఇద్దరు కుమార్తెలు రైమా సేన్, రియా సేన్ లు యాక్టింగ్ నే కెరీర్ గా ఎంచుకున్నారు.








ప్రస్తుతం కేంద్ర మంత్రిగా సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న స్మృతి అంత తేలికగా ఈ స్థాయికి రాలేదు. ఆమె లైఫ్ లో చాలా కష్టపడ్డారు. స్మృతి డిల్లీలో జన్మించారు. ఆమె తండ్రి పంజాబీ, తల్లి బెంగాలీ. వారు ప్రేమ వివాహం చేసుకున్నారు. పెద్దలు అంగీకరించకపోవడంతో బయటకొచ్చి వివాహం చేసుకున్నారు. దక్షిణ దిల్లీ శివార్లలో నివసించేవారు. చేతిలో డబ్బు లేకపోవడంతో వారు పశువుల కొట్టాన్ని చూసుకునే పని చేసేవారు. స్మృతి అక్కడే జన్మించింది. ఆమెకు ఇద్దరు చెల్లెల్లు ఉన్నారు. పేదరికం వల్ల చదువుకుంటూనే కొన్ని బాధ్యతలు ఆమె మోయాల్సి వచ్చింది.
పదవ తరగతి చదివేటప్పుడు చిన్న చిన్న జాబ్స్ చేస్తూ ఉండేది. ఆ తరువాత ఇంటర్మీడియట్ పాస్ అయినా, ఆర్థిక పరిస్థితులు వల్ల కాలేజీ మానేసి, దూరవిద్యలో చదవడం ప్రారంభించింది. తన ఫ్యామిలీ ఆర్ధికంగా సాయం చేయడానికి, ఢిల్లీలో బ్యూటీ ప్రొడక్ట్స్ ని మార్కెటింగ్ చేయడం మొదలుపెట్టింది. అయితే ఆ టైమ్ లో ఫ్రెండ్ సలహాతో మిస్ ఇండియా పోటీలకు తన ఫోటోను పంపారు. 1998లో మిస్ ఇండియాకు ఎంపికయ్యారు. అయితే, ఆమె తండ్రి అందులో పాల్గొనడానికి ఒప్పుకోలేదు. అయితే ఆమె తల్లి కష్టపడి డబ్బు సర్దుబాటు చేసి స్మృతిని ఆ పోటీకి పంపింది. స్మృతి ఫైనల్స్‌కు వెళ్ళిన ఆమె గెలవలేకపోయారు.
ఆ డబ్బును తల్లికి ఇవ్వడం కోసం స్మృతి జాబ్ కోసం వెతకడం మొదలుపెట్టింది. అయితే ఆమె ప్రయత్నాలు ఫలించలేదు. కొన్ని రోజుల ఒక ప్రకటనలో ఛాన్స్ వచ్చింది. దాని ద్వారా టీవీలో రెండు మూవీ ప్రోగ్రామ్స్ కు యాంకరింగ్ ఛాన్స్ లభించింది. వీటిని చూసిన శోభా కపూర్ తన కుమార్తె ఏక్తా కపూర్ కు స్మృతిని పరిచయం చేసింది. అలా స్మృతికి ‘క్యోకీ సాస్ బీ కభీ బహూ థీ’ అనే టెలివిజన్ సీరియల్ లో తులసి పాత్రకు సెలెక్ట్ అయ్యింది. ఆ సీరియల్ ఆమె లైఫ్ ని మలుపు తిప్పింది. 8 ఏళ్ళ పాటు స్మృతి ఆ సీరియల్ లో కనిపించింది. టీవీ యాక్టర్లకు ఇచ్చే అత్యుత్తమ అవార్డు అయిన ఇండియన్ టెలివిజన్ అకాడమీ అవార్డు ఆమె వరసగా 5 సార్లు అందుకుని హిస్టరీ క్రియేట్ చేసింది.
ఆ తరువాత ఒక నిర్మాణ సంస్థ స్థాపించి పలు సీరియల్స్ నిర్మించింది. 2001లో పార్సీ బిజినెస్ మెన్ జుబిన్ ఇరానీని పెళ్లి చేసుకోవడంతో స్మృతి ఇరానీగా పాపులర్ అయ్యారు. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. స్మృతి తాత ఆర్ఎస్ఎస్ లో పని చేసేవాడు. దాంతో స్మృతి చిన్నప్పటి నుంచే అందులో సభ్యురాలుగా ఉంది. నిర్మాతగా ఉన్నపుడే ఆమె రాజకీయాలలో అడుగుపెట్టింది. 2003లో బిజెపిలో జాయిన్ అయ్యింది. ఆ పార్టీలో వివిధ స్థాయిలలో పార్టీ కోసం కృషి చేసిన పనిచేసిన స్మృతి ఇరానీ 2014 లో మోది గవర్నమెంట్ లో మానవ వనరుల శాఖకు మంత్రి అయ్యింది. అప్పటి నుండి పలు శాఖలలో మంత్రిగా పనిచేశారు.


తెలుగులో వచ్చిన మరో ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ వ్యూహం. ఈ వెబ్ సిరీస్ ను సుప్రియ యార్లగడ్డ అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మించారు. ఈ సిరీస్ డిసెంబర్ 14 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. చైతన్య కృష్ణ, సాయి సుశాంత్ రెడ్డి, పావని గంగిరెడ్డి, శశాంక్ సిద్ధంశెట్టి, రవీంద్ర విజయ్ ఈ సిరీస్ లో ముఖ్యమైన పాత్రల్లో నటించారు.
ఇక ఈ సిరీస్ కథ విషయానికి వస్తే, ఐపీఎస్ పూర్తిచేసిన అర్జున్ రామచంద్ర (సాయి సుశాంత్ రెడ్డి) కొత్తగా డిపార్ట్మెంట్ లో చేరుతాడు. అతని తల్లి కూడా ఐపీఎస్ ఆఫీసర్, అర్జున్ 10 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు నక్సలైట్ల చేతిలో మరణిస్తుంది. తల్లి మాటలే అర్జున్ ఐపీఎస్ అయ్యేలా చేస్తాయి. అతనికి మైఖేల్ కి సంబంధించిన హిట్ అండ్ రన్ కేసును అప్పగిస్తారు.
అర్జున్ ఆ కేసును లోతుగా దర్యాప్తు చేస్తుండగా, అది హిట్ అండ్ రన్ కేసు కాదని కావాలని చేసినట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా ఆ కేసుకి తన తల్లి మరణానికి సంబంధం ఉన్నట్టుగా తెలుస్తుంది. దాంతో ఆ రెండు కేసులు ఒకదానితో ఒకటి కనెక్ట్ అయిన చిక్కు ముడిని విప్పుతాడు. ఆ తర్వాత ఏం జరుగుతుంది? ఇతర వ్యక్తులతో ముడిపడి ఉన్న మిస్టరీ కేసును అర్జున్ ఎలా సాల్వ్ చేశాడు అనేది మిగిలిన కథ.