కొంతకాలంగా సోషల్ మీడియాలో త్రో బ్యాక్ ట్రెండ్ కొనసాగుతుంది. ఈ క్రమంలో సినీ సెలబ్రెటీల చిన్న నాటి ఫోటోలు లేదా కెరీర్ మొదట్లోని ఫోటోలు అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
సౌత్, నార్త్ అనే తేడా లేకుండా ఇండస్ట్రీ సెలబ్రిటీల పోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. వాటిలో కొందరిని పాత ఫోటోలతో పోల్చినపుడు వారేనా కాదా అనేల ఉన్నాయి. తాజగా పాన్ ఇండియా స్టార్ గా రాణిస్తున్న హీరో గతంలో సీరియల్స్ లో నటించారు. వాటికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి. ఆ హీరో ఎవరో ఇప్పుడు చూద్దాం..
పైన ఫోటోలో ఉన్న యాక్టర్ ను వెంటనే గుర్తు పట్టడం కష్టంగా ఉన్నా, ఆ హీరోకి పాన్ ఇండియా రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆ హీరో నెక్స్ట్ సినిమా ఏమిటా అని దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఎదురుచూస్తున్నారు. ఆ కన్నడ స్టార్ హీరో మొదట్లో బుల్లితెర పై పలు సీరియల్స్ లో నటించి, మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తరువాత ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. మొదట్లో చిన్న చిన్న పాత్రలలో నటించిన యష్ యాక్టర్ నుండి ‘రాకింగ్ స్టార్’ గా ఎదిగారు.
యష్ అసలు పేరు నవీన్ కుమార్ గౌడ. 1986లో కర్ణాటకలోని హసన్ జిల్లాలోని భువనహళ్లిలో జె అరుణ్ కుమార్, పుష్ప దంపతులకు జనవరి 8న జన్మించాడు. యష్ తండ్రి బస్సు డ్రైవర్. యష్ కు చిన్నప్పటి నుండి నటన అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే టివి ఇండస్ట్రీలో ఉత్తరాయణ అనే సీరియల్‌తో అడుగుపెట్టాడు. ఆ తరువాత ఈటీవీ కన్నడలో ప్రసారమైన సీరియల్ సిల్లీ లల్లీ, నంద గోకుల్ వంటి పలు సీరియల్స్ లో నటించాడు. నందగోకుల్ సీరియల్ లో నటించిన రాధిక పండిట్‌ని ని ప్రేమించి, పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరూ కలిసి పలు చిత్రాలలో కలిసి నటించారు.
2007లో ‘జంబద హుడుగి’ మూవీతో యష్ ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. రెండవ సినిమా మొగ్గిన మనసులో చేసిన పాత్రకు గుర్తింపు వచ్చింది. ఆ మూవీకి గాను ఉత్తమ సహాయ నటుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును అందుకున్నాడు. 2008 లో రాకీ మూవీలో హీరోగా నటించి, ఆకట్టుకున్నాడు. వరుస చిత్రాలలో నటిస్తూ స్టార్ హీరోగా ఎదుగారు. కేజీఎఫ్ చిత్రాలతో పాన్ ఇండియా స్టార్ గా మారారు.

హీరోయిన్ సంఘవి తెలుగు, మలయాళ, తమిళ, కన్నడ భాషల్లో టాప్ హీరోయిన్ గా స్టార్ డమ్ సొంతం చేసుకున్నారు. 1993 నుండి 2004 వరకు సౌత్ ఇండస్ట్రీలో ప్రముఖ హీరోయిన్లలో ఒకరు. 15 ఏళ్ళ పాటు సాగిన సంఘవి కెరీర్లో 80కి పైగా సినిమాలలో నటించింది. సంఘవి కర్ణాటకలోని మైసూర్లో 1977 లో అక్టోబర్ 4న జన్మించింది. ఆమె తండ్రి డాక్టర్. రమేష్, మైసూర్ మెడికల్ కాలేజీలో ఈఎన్టి ప్రొఫెసర్ , మరియు ఆమె తల్లి శ్రీమతి రంజన.
సంఘవి బాలనటిగా సినిమాలలో నటించడం మొదలుపెట్టింది. సంఘవి నాయనమ్మకు ప్రముఖ కన్నడ నటి ఆరతి, చిన్న చెల్లెలు. సంఘవి ఆమెతో పాటు షూటింగ్స్ కు వెళ్ళేది. అలా సినిమాలలో నటించాలన్న ఆసక్తి ఏర్పడింది. 1993లో తమిళ సినిమా అజిత్ హీరోగా వచ్చిన ‘అమరావతి’ మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ మూవీతో ఆమెకు గుర్తింపు వచ్చింది. వరుస ఆఫర్స్ రావడంతో అక్కడ స్టార్ హీరోయిన గా మారారు. శ్రీకాంత్ హీరోగా నటించిన తాజ్ మహల్ మూవీతో సంఘవి టాలీవుడ్ లో అడుగుపెట్టారు.
సిందూరం, సూర్యవంశం అవంతి చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్నారు. కెరీర్ లో రాణిస్తున్న దశలో 1998లో శివయ్య మూవీలో నటించింది. ఆ మూవీ సమయంలో ఆ మూవీ డైరెక్టర్ సురేశ్ వర్మను ప్రేమించి, పెళ్లి చేసుకున్నారు. పెళ్ళైన ఏడాదికి ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడిపోయారు. ఆ తరువాత 2016 లో బెంగుళూరుకు చెందిన ఐటీ ప్రొఫెషనల్ వెంకటేష్‌ని రెండవ పెళ్లి చేసుకుంది. ఈ జంటకు జనవరి 2020లో ఆడపిల్ల జన్మించింది.
దుల్కర్ సల్మాన్, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం హేయ్ పిల్లగాడ. మలయాళంలో రిలీజ్ అయ్యి, భారీ వసూళ్ళు రాబట్టి, సంచలన విజయం సాధించిన `కలి` మూవీని తెలుగులో హేయ్ పిల్లగాడ గా డబ్ చేసి, రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి సమీర్ తాహిర్ దర్శకత్వం వహించగా, డి.వి.కృష్ణస్వామి నిర్మించారు. తమిళంలో కూడా ఈ మూవీ విజయం సాధించింది.
ఈ మూవీ కథ విషయానికి వస్తే, సిద్దు (దుల్కర్ సల్మాన్) కు చిన్న చిన్న విషయాలకు సైతం విపరీతమైన కోపం వస్తుంటుంది. అతను అంజలి (సాయి పల్లవి) ని లవ్ చేసి, పెళ్లి చేసుకుంటాడు. అంజలికి సిద్ధూ కోపం గురించి తెలిసినా, ఎప్పటికైనా సిద్దు కోపం తగ్గించుకుంటాడని, మారతాడని వెయిట్ చేస్తుంటుంది. అయితే సిద్దు మాత్రం అదే విధంగా ఉంటాడు. వీరిద్దరూ ఓసారి వైజాగ్ కు బయలుదేరుతారు.
మార్గ మధ్యలో ఒక డాబాలో ఆగిన సమయంలో అక్కడ ఉన్న రౌడీలకు సిద్ధుకు గొడవ జరుగుతుంది. ఆ గొడవ వారి జీవితంలో ఎలాంటి మార్పులను తెచ్చింది? ఆ తరువాత వారిద్దరూ ఎలాంటి ప్రమాదంలో పడ్డారు అనేదే మిగిలిన కథ. ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్ సిద్దుగా చక్కగా నటించారు. ఆ పాత్ర చుట్టూనే స్టోరీ తిరుగుతుంది. సిద్ధూ ప్రేయసిగా, భార్యగా అంజలి పాత్రలో సాయి పల్లవి నేచురల్ యాక్టింగ్ తో ఆకట్టుకుంది.












