నవంబర్ 24 వ తారీఖున రిలీజ్ అయ్యే సినిమాల్లో మంచి బజ్ సినిమా కోట బొమ్మాళి పిఎస్. ఈ సినిమా మీద ఇంత బజ్ రావడానికి కారణం దీన్ని గీత ఆర్ట్స్ వారు నిర్మించడం అయితే, ఇంకొకటి లింగ్ లింగ్ లింగిడి సాంగ్ వైరల్ అవ్వడం. ముందు నుంచి ఈ సినిమా మీద మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్, శ్రీకాంత్ ప్రధాన పాత్రధారులుగా ఈ సినిమా తెరకెక్కింది. తేజ మార్ని ఈ సినిమాని డైరెక్ట్ చేశారు. శ్రీకాంత్ పాత్ర ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుంది అని అంటున్నారు. ప్రముఖ నటుడు మురళీ శర్మ కూడా ఈ సినిమాలో కీలక పాత్ర పోషించారు.
తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ సభ్యుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చినట్లు సినిమా బృందం తెలియజేసింది. ఈ సినిమాకు కనుక పాజిటివ్ టాక్ వస్తే మాత్రం సులువుగా బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి.
ప్రేక్షకులకు సీట్ ఎడ్జ్ త్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అందించడం ఖాయమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. దానికి తోడు సెన్సార్ సభ్యుల పాజిటివ్ రెస్పాన్స్ కూడా మరింత బలం చేకూర్చింది. రాజకీయాలకు పోలీసులకు జోక్యం ఉంటే ఎలా ఉంటుందో ఈ సినిమా అలా ఉంటుందని అంటున్నారు. తాజాగా ఎన్నికలకు సంబంధించి విడుదలైన సాంగ్ బాగా వైరల్ అవుతుంది. ఈ సినిమా నిర్మాత బన్నీ వాసు కూడా ఈ సినిమాని డిఫరెంట్ రేంజ్ లో ప్రమోట్ చేస్తున్నారు.

ప్రెస్ మీట్ లో మీడియా వారు సినిమా టీం ని ప్రశ్నలు అడగడం మామూలే కానీ దీనికి రివర్స్ గా మీడియాని సినిమా వాళ్లు ప్రశ్నలు అడిగితే ఎలా ఉంటుందో అంటూ ఒక కొత్త ఈవెంట్ కి ఈ సినిమా బృందం తెర తీసింది. అది కూడా బాగా క్లిక్ అయింది. ఏది ఏమైనా నవంబర్ 24న విడుదలవుతున్న చిత్రాల్లో కోట బొమ్మాళి పిఎస్ హిట్ అయిపోతుంది అని సినీ వర్గాలు కూడా చెబుతున్నాయి. ఫిలింనగర్ సర్కిల్ లో కూడా ఈ సినిమా మీద మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇది మలయాళం మూవీ కి రీమేక్ గా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.










తర్వాత రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ గా గుర్తింపు తెచ్చుకొని ప్రతి వీడియోలో బిగ్ బాస్ కి తనని పంపించండి అని అడిగాడు. అలా చివరికి అనుకున్నది సాధించి బిగ్ బాస్ లో అడుగు పెట్టాడు కూడా. అయితే, సోషల్ మీడియా పుణ్యమా అని పల్లవి ప్రశాంత్ పాత వీడియోలు ఇప్పుడు ప్రత్యక్షం అయ్యాయి. దాంతో పల్లవి ప్రశాంత్ టిక్ టాక్ వీడియోస్ కూడా చేసేవారు అని అందరికీ తెలిసింది. ఇది మాత్రమే కాదు. ఒక బిగ్ బాస్ సీజన్ లో వీకెండ్ ఎపిసోడ్ లో పల్లవి ప్రశాంత్ ఆడియన్స్ లో కూడా కనిపించాడు. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో టాప్ కంటెస్టెంట్స్ లో ఒకడిగా నిలిచాడు.
ప్రొడ్యూసర్ శరత్ చంద్ర మాట్లాడుతూ. మా ఫస్ట్ లుక్ టైటిల్ పోస్టర్ అడిగిన వెంటనే విడుదల చేసిన హీరో రాజ్ తరుణ్ గారికి చాలా థాంక్స్ త్వరలో మూవీ విడుదలకి సన్నాహాలు చేస్తున్నాము మా “సారంగదరియా” అందరికీ నచ్చేలా ఉంటుంది అని ప్రొడ్యూసర్ తెలిపారు. డైరెక్టర్ పద్మారావు అబ్బిశెట్టి(పండు )మాట్లాడుతూ..







చిరంజీవి ఎవరి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలో అడుగు పెట్టి, ఎన్నో కష్టాలు పడి, మెగాస్టార్ గా ఎదిగిన తీరు ఎంతో మందికి ఆదర్శంగా నిలిచింది. చిరంజీవి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి, స్టార్ హీరోగా ఎదిగి కోట్లాదిమంది ఫ్యాన్స్ ను సొంతం చేసుకున్నారు. ఆయన అసలు పేరు శివ శంకర వరప్రసాద్. 1955లో పశ్చిమ గోదావరి జిల్లాలోని మొగల్తూరులో ఆగష్టు 22న చిరంజీవి జన్మించారు. ఆయనకు చిన్నతనంలోనే నటన పై ఇంట్రెస్ట్ ఏర్పడింది. చదువు పూర్తి చేసుకొని చిరంజీవి 1976లో చెన్నైలో ఉన్న మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో చేరి, నటనలో శిక్షణ తీసుకున్నారు.
చిరంజీవి 1978లో ‘పునాది రాళ్లు’ అనే చిత్రం ద్వారా హీరోగా మారారు. అయితే ఆ మూవీ కన్నా ముందు ‘ప్రాణం ఖరీదు’ అనే మూవీ విడుదల అయ్యింది. ఆ తరువాత బాపు దర్శకత్వంలో నటించిన ‘మనవూరి పాండవులు’ అనే మూవీతో చిరంజీవికి గుర్తింపు వచ్చింది. మోసగాడు, ఇది కథ కాదు, రాణీ కాసుల రంగమ్మ వంటి చిత్రాలలో చిన్న పాత్రలు, విలన్గా కూడా నటించి నటుడిగా చిరంజీవి గుర్తింపు తెచ్చుకున్నాడు.
1980లో చిరంజీవి హీరోగా నటించిన ‘మొగుడు కావాలి’ మూవీ విజయం సాధించి, తొలి సిల్వర్ జూబ్లీ సినిమాగా రికార్డు సృష్టించింది. తమ్మారెడ్డి భరద్వాజ ఈ మూవీని నిర్మించారు. ఆ తర్వాత ‘తిరుగులేని మనిషి’ మూవీలో చిరంజీవి ఎన్టీఆర్ తో కలిసి నటించారు. ఆ తర్వాత వచ్చిన ‘చట్టానికి కళ్లులేవు’ మూవీతో మాస్ హీరోగా మారారు. ఈ మూవీకి కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ దర్శకత్వం వహించారు.
రామయ్య వీధిలో కృష్ణయ్య, శుభలేఖ సినిమాలతో చిరంజీవి ఫ్యామిలీ ప్రేక్షకులకు చేరువయ్యారు. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఖైదీ మూవీతో ఆయన స్టార్ హీరోగా ఎదిగారు. ఆ తరువాత వరుస సినిమాలు చేస్తూ, ఎన్నో రికార్డులు బ్రేక్ చేస్తూ, మరెన్నో రికార్డులు క్రియేట్ చేస్తూ, టాలీవుడ్ లో ఎదురులేని టాప్ హీరోగా కొనసాగుతున్నారు.


